Jump to content

సామాజిక భద్రత

వికీపీడియా నుండి

[1]

ఆహార హక్కు

[మార్చు]

ఆహారము, పోషణ సంరక్షణ

[మార్చు]

జాతీయ మధ్యాహ్న భోజన పథకం, పరిపూర్ణ బాలల వికాస సేవలు ( ఐ సి డి ఎస్ ), కిషోరి శక్తి యోజన ద్వారా పోషణ సంరక్షణ జరుగుతూ ఉంది. మధ్యాహ్న భోజన పథకం సుమారుగా మొత్తం అంతా అమలు చేసారు, ఐ సి డి ఎస్ మాత్రం అంచెలంచెలుగా అమలు చేయబడుతోం ది. 11 నుండి 18 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికల ఆరోగ్య, పోషణని పెంపొందించడానికి కిషోరి శక్తి యోజనని కూడా ప్రభుత్వం అమలు చేసింది. 4,882 కోట్ల రూపాయలతో ప్రభుత్వం జాతీయ ఆహార సంరక్షణ మిషన్ ని ప్రారంభించింది. 2008-09 సంవత్సరములో ప్రభుత్వం 225 లక్షల టన్నుల గోధుమలని కొనుగోలు చేసింది. ఇదివరకె ప్పుడూ ఇలా కొనుగోలు చేయలేదు. ప్రభుత్వం, 265 లక్షల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసింది. ఇదివరకె ప్పుడూ ఇంత అత్యధిక స్థాయిలో ఈ విధంగా బియ్యాన్ని కొనుగోలు చేయలేదు. ప్రభుత్వం గోధుమల కనీస సహకార ధర ( ఎమ్ ఎస్ పి ) నాలుగు సంవత్సరములలో క్రమంగా పెంచింది. ఇది 2004-2005 సంవత్సర స్థాయి కన్నా 56% ఎక్కువ. ఇది 2008-2009లో క్వింటాలుకి 1000 రూపాయలు. 2004 లో బియ్యం కనీస సహకార ధర ( ఎమ్ ఎస్ పి ) క్వింటాలుకి 546 రూపాయల నుండి 850 రూపాయలకు పెరిగింది. 2007-2008 లో తగినంత గోధుమల నిల్వలు, స్థిరమైన గోధుమల ధరల ద్వారా ఆహార సంరక్షణ కల్పించడానికి ప్రభుత్వం 17.69 లక్షల టన్నుల గోధుమల్ని దిగుమతి చేసుకుంది.

జాతీయ గ్రామీణ ఉపాధి పూచీ చట్టం

[మార్చు]

ఎంతో కాలం నుండి చేస్తున్న డిమాండులలో ఒక్కటైన ఆహార ఉద్యమమే (, ఇండియాలలో శ్రామిక ఉద్యమం ) ఈ జాతీయ “ ఉపాధి హామీ చట్టం ”జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్ ఆర్ ఇ జి ఎ, 2005) వచ్చిన తరువాత ఈ డిమాండ్ పాక్షికంగా 2005 సంవత్సర మధ్యలో తీరింది. ఈ చట్టం క్రింద, ఎవరైనా యువకులు రోజూవారీ శ్రామికునిగా కనీస వేతనానికి చేయదలచుకుంటే, వారు 15 రోజులలో స్థానిక ప్రభుత్వ పనులలో ఉపాధికి అర్హులు. ఈ ఉపాధి సంవత్సరానికి ఒక ఇంటికి 100 రోజుల వరకు పరిమితము.

పౌరసరఫరాల వ్యవస్థ

[మార్చు]

ఆహార సంరక్షణ కల్పించడంలో పౌర సరఫరాల వ్యవస్థ ( పి డి ఎస్) ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. 4 లక్షలకన్నా ఎక్కువ చౌకదుకాణాల నెట్ వర్కుతో, ప్రతి సంవత్సరము 15,000 కోట్ల రూ పాయలు విలువచేసే నిత్యావసర వస్తువుల్ని సుమారు 16 కోట్ల కుటుంబాలకి సరఫరా చేస్తున్న ట్లు చెపు తున్నారు. ఇండియాలో పౌరసరఫరాల వ్యవస్థ బహుశా ప్రపంచంలో ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్కు.

ధాన్య బ్యాంకులు

[మార్చు]

ఉత్పాదకత లేని ఋతువు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో కలిగే కరువు నుండి కాపాడడానికి గ్రామీణ ధాన్య బ్యాంకులకు ఎక్కువ కవరేజి, ఎక్కువ అర్థవంతం అయ్యేలా సమీక్షించారు. ఇంతకు ముందు, షెడ్యూలు తెగల వారికి, గిరిజన ప్రాంతాలలో ఉండే షెడ్యూలు కులాలలో ఇష్టమైన వారికి ఈ పథకం వర్తించేది. కరవుకు లోనయ్యే ప్రాంతాలలో ఎడారి ప్రాంతాలలో, ఆహార కొరత ఉన్న దేశ భాగాలలో సరైన మార్గంలేని కొండ ప్రాంతాలలో, గత నాలుగు సంవత్సరాలలో అనుమతించిన గ్రామీణ ధాన్యపు బ్యాంకులు 4,858 నుండి 18,129 వరకు పెరిగాయి.

అంత్యోదయ అన్నయోజన

[మార్చు]

అంత్యోదయ అన్నయోజన, అదనంగా ఒక కోటి గృహాల వరకు విస్తరించింది. ఇది 67% విస్తారం వరకు వ్యాపించింది. మొత్తం జనాభాలో సుమారు 5% జనాభా రెండు పూర్తి బోజనములు లేకుండా నిద్ర పోతుందన్న నిజాన్ని “జాతీయ సేంపిల్ సర్వే ఎక్సర్ సైజ్ ” చెప్పింది. ఈ జనాభా విభాగాన్ని“ఆకలి ” అని పిలుస్తారు. ఈ తరగతికి చెందిన జనాభా లక్ష్యంగా పెట్టడానికి, టార్గెటెడ్ పౌర సరఫరా విధానమును మరింత క్రేందీకృతం చేయడానికి, 2000 సంవత్సరము డిసెంబరులో అంత్యోదయ అన్న యోజనని (ఎ ఎ వై ) ఒక కోటి అతి పేద కుటుంబాల కొరకు ప్రారంభించారు. రాష్ట్రా లలో టార్గెటెడ్ పౌర సరఫరా విధానము పరిధిలో ఉండే దారిద్ర్య రేఖ క్రిందనున్న కుటుంబాలలో ఒక కోటి అతి పేద కుటుంబాలను గుర్తించడము, ఆహర ధాన్యాలను అతి తక్కువ ధరలో అంటే గోధుమ కిలో 2 రూపాయలకు, బియ్యం కిలో 3 రూపాయలకు ఇవ్వడానికి (ఎ ఎ వై ) ఆలోచిస్తుంది. డీలర్ల మార్జిన్ తో పాటు సరఫరా ఖర్చు, రవాణా ఖర్చు రాష్టాలు / కేంద్రపాలిత ప్రాంతాలు భరించాల్సి ఉంటుంది. ఈ పథకం క్రింద ఆహారం యొక్క మొత్తం రాయితీలను వినియోగ దారులకు అందజే యబడుతుంది.

గ్రామీణ గృహ పథకం

[మార్చు]

గ్రామీణ గృహ పథకం

[మార్చు]

మానవ మనుగడకి గృహము ఒక కనీస అవసరము. గృహము, గ్రామీణ పేదలకి ఒక పెద్ద ప్రాముఖ్యతని సంతరిస్తుంది. దానితో గృహము లేదనే వ్యాకులతను పారద్రోలి, స్పష్టమైన, సురక్షితమైన గుర్తిం పు పొంది మర్యాదయైన జీవనానికి పునాది వేస్తుంది. ఆ విధంగా ఇండియాలో పేదరికాన్ని తొలగించడానికి, గృహాల కొరతని తగ్గించడం చాలా ముఖ్యమైన వ్యూహరచన.

ఇందిర ఆవాస యోజన (ఐ ఎ వై)

[మార్చు]
  • ఇండియా గ్రామీణ గృహాల కొరత 148 లక్షల వద్ద ఉన్నదని 2001 జనాభా లెక్కలు తెలుపుతున్నాయి. ఈ అవసరం కొరకు భారత “నిర్మాణ ప్రోగ్రాము”ని గుర్తించి, కావలసిన ప్రాముఖ్యతని ఇచ్చారు.
  • 2005-2006 సంవత్సరం నుండి దేశమంతా, రాబోయే నాలుగు సంవత్సరములలో 60 లక్షల గృహాలని నిర్మిచాలని ఆలోచిస్తుంది.
  • ఇందిర ఆవాస యోజన పథకం ద్వారా గ్రామీణ వికాస మంత్రిత్వశాఖ చే గ్రామీణ గృహ పథకాన్ని అమలు చేస్తారు.
  • ఇది కేంద్రం స్పాన్సర్ చేస్తున్న పథకం. ఈ ఖర్చుని 75:25 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రాలు భరిస్తాయి.
  • ఆర్థిక వనరులు కేటాయించడానికి ఈ క్రింద నిచ్చిన సూత్రాలని అనుసరించాలి.
  • రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు
  • ఎక్కువ గృహాల కొరత ఉన్న రాష్ట్రాలకి ప్రాముఖ్యత నివ్వాలి.
  • రాష్ట్ర స్థాయి కేటాయింపులకు ప్లానింగ్ కమిషన్ చే ముందుగా నిర్ణయించిన విధంగా గృహాల కొరత 7 %, దారిద్ర్య నిష్పత్తులకు 25 % ప్రాముఖ్యత నివ్వాలి.
  • జిల్లా స్థాయి కేటాయింపులకు
  • గృహాల కొరతకు తిరిగి 75%, జనాభాలలో గల షెడ్యూలకు లాలు / తెగల పై 25% ప్రాముఖ్యతని వ్వాలి.
  • మామూలు ప్రాంతాలలో గృహానికి 45,000/- రూపాయల వరకు, కొండ ప్రాంతాలలో 48,500/- రూపాయల వరకు గ్రాంటు సహ కారాన్ని ఇవ్వాలి. రెండు వాయిదాలలో జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థలకి నిధులు విడుదల చేయాలి.
  • ఈ పథకం నిర్దిష్టంగా ద్రారిద్ర్య రేఖకి దిగువనున్న (బి పి ఎల్) గ్రామీణ గృహాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఉపాధి

[మార్చు]

భారతదేశం లో ఉపాధి కల్పన

[మార్చు]

దారిద్ర్య నిర్మూలన వ్యూహరచన వివిధ రకాలైన పేదరికాన్ని తగ్గించే, ఉపాధి కల్ప నా కార్యక్రమా ల్ని కలిగి ఉంది. ఇందులో చాలా వరకు చాలా సంవత్సరముల నుండి అమలులో ఉన్నాయి, ఉపాధి కల్పించి, ఫలవంతమైన ఆస్తు లను సృష్టించి, సాంకేతిక, వ్యాపార నైపుణ్యాలను ఇచ్చి వాటిని పటిష్ఠం చేసి పేదవారి ఆదాయాన్ని పెంచారు. ఈ పథకాల క్రింద, ఉపాధి, స్వయం ఉపాధి రెండూ దారిద్ర్య రేఖ దిగువనున్న వారికి ఇచ్చారు. పలురకాల పేదరికాన్ని తగ్గించే, ఉపాధి కల్ప నా కార్యక్రమా ల్ని 1998-99 సంవత్సరం నుండి క్రింద నిచ్చిన రెండు గ్రూపులుగా వర్గీకరించారు.

భారతదేశం లో అవ్యవస్ధికృత రంగంలో పనివారు

[మార్చు]

“అవ్యవస్థీ కృత రంగంలోని పనివారు” అంటే, ఎవరైతే వేతనము లేదా ఆదాయం కొరకు, నేరుగా లేదా ఏదైనా సంస్థ / కంట్రాక్టరు ద్వారా; స్వయంగా అతను లేదా ఆమె లేదా స్వయం ఉపాధి; ఏదైనా ప్రదేశంలో అతని లేదా ఆమె గృహములో, ఫీల్డులో లేదా ఏదైనా పబ్లిక్ ప్రదేశంలో పని చేసేవారు, ఎవరైతే ఎంప్లోయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కా ర్పొ రేషన్ చట్టం, ప్రోవిడెంట్ ఫండ్ చట్టం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొ రేషన్ యొక్క ఒక్కొ క్క ఇన్సూరెన్స్, పింఛను పథకం, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా లాభం పొందనివారు లేదా సమాయాన్ని బట్టి అధికారులు నిర్ణయించిన లాభాలు పొందని వారు.

ఉపాధి కల్పన - ప్రభుత్వ చొరవలు

[మార్చు]

గ్రామీణ పేదలకు 100 రోజులు ఉపాధిని కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన చట్టం ఎన్ ఆర్ ఇ జి ఎ) అమలు చేయబడింది. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి సామా జిక సంరక్షణ కలిగించే చట్టం ఏదీ చేయలేదు. ఈ చట్టం క్రింద, దేశంలో 200 జిల్లాల నుండి క్రమంగా మొత్తం 614 గ్రామీణ జిల్లాలకి 2008 సంవత్సరము ఏప్రిల్ నెల నుండి విస్తరింప జేశా రు. చిన్న, గ్రామీణ పరిశ్రమల ద్వారా ఎక్కువ ఉపాధులను కల్పించడానికి ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ (కె వి ఐ సి) ని పునరుద్ధరించారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో, పెద్ద మొత్తంలో జీవనాధారమైన ఉపాధి కల్పనావకాశములు కలిగించే ఈ వ్యాపార సంస్థల యొక్క ఉత్పాదకతను మెరుగు పరచడానికి “అవ్యవస్ధిత రంగంలో వ్యాపార సంస్థల కొరకు జాతీయ కమిషన్” (ఎన్ సి ఇ యు ఎస్) ని సలహా ఇచ్చే సంఘంగా, అనియమిత రంగాన్ని గమనించ డానికి నియమించారు. ఇది యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఏలియన్స్ ప్రభుత్వం తన సామాన్య కనీస పథకంలో వాగ్ధానం చేసిన ప్రకారం; క్రొత్త గ్లోబల్ వాతావరణంలో, రంగంలో పోటీ తత్వాన్ని మెరుగు పరచడానికి, క్రెడిట్, ముడి పదార్థాలు, ఉపకరణ పరికరాలు, సాంకేతిక అభివృద్ధి, మార్కెటింగు వంటి విషయాలలో సంస్థాగత విధానాలతో రంగాన్ని కలపడానికి తగిన పద్ధతుల్ని సిఫార్సు చేయ డానికి వ్యవస్థీ కృతం కాని రంగంలో ఆ రంగ నైపుణ్య వికాసానికి కావలసినంత మేర జోక్యము చేసుకోవడం కూడా కమిషన్ పరిగణలో ఉంది. ప్రత్తిపై సాంకేతిక అభివృద్ధి నిధి పథకం, సాంకేతిక యంత్రాంగం (టెక్నాలజీ మిషన్) పన్నుల ఉపశమనంతో పెద్ద ప్యాకేజ్ ని ఇచ్చారు. దేశంలో గరిష్ఠ విలువలని, పురోగతిని సాధించ డానికి పన్నుల విధానాన్ని హేతుబద్ధంగా వివరించారు. సాంకేతిక అభివృద్ధి నిధి పథకం, ప్రత్తిపై టెక్నాలజీ మిషన్ వంటి పథకాల ఉద్దేశము ప్రకారము పెట్టుబడిని, పరిశ్రమ రంగాన్ని నవీన పరచడానికి, నాణ్యత గల ముడి సరుకులు పోటీ ధరలకి లభ్యమయ్యేలా చేయడానికి పెంపొందించారు. అదనపు క్రెడిట్ తో పాటు 10% పెట్టుబడి రాయితీలు ఇవ్వడం మొదలు పెట్టడంతో, సాంకేతిక అభివృద్ధి నిధి పథకం ద్వారా పెట్టే పెట్టుబడి 2003-04 లో 1300 కోట్ల రుపాయల నుండి 2006-07లో సుమారు 20,000 కోట్ల రుపాయల వరకు పెరిగింది. ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పార్కుల పథకాన్ని ఉపకరణ సౌకర్యాలని పటిష్ఠం చేయడానికి ప్రారంభించారు. ఈ పథకం క్రింద, 40 ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కులను స్థాపించాలని ప్రతిపాదించారు. 11 వ పంచవర్ష ప్రణాళికలో టెక్స్టైల్ పై టెక్నాలజీ మిషన్ ని అమలు చేస్తారు.

జాతీయ జనపనార బోర్డు

[మార్చు]

ముడి జనపనార కనీస సహాయ ధర క్వింటాలుకు 2004-05 లో 890 రూపాయల నుండి 2008 - 09 లో 1250 రూపాయల వరకు క్రమంగా పెంచారు. చాలినంత డిమాండు రావడానికి, పంచదార, ధాన్యాల ప్యాకేజీలలో తప్పనిసరిగా జనపనారని ఉపయోగించాలి. జనపనారని పండించే వారి ప్రయోజనాలని రక్షించడానికి, జనపనార డిమాండుని పెంచడానికి మొదటి సారిగా విస్తారమైన జాతీయ జనపనార పా లసీని ప్రకటించారు. జూట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాని పునరుద్ధ రించారు. జనపనార రంగ వికాసానికి జూట్ టెక్నాలజీ మిషన్ ని ప్రారంభించారు. జనపనార రంగంలో, వివిధ సంస్థల చర్యలలోని ఉమ్మడి శక్తిని తీసుకురావడానికి జాతీయ జనపనార బోర్డు స్థాపనని ప్రారంభించారు.

  • కనీసం 60% లబ్ధిదారులు షెడ్యూలకు లాలు / తెగలకి చెందిన వారై ఉండడం, ఈ పథకాన్ని అమలు చేయడంలో ఒక ముఖ్యమైన అవసరం.
  • గ్రాంటులలో ఆరోగ్యానుకూలమైన మరుగు దొడ్లు, పొగరాని పొయ్యిల ఖర్చు ఇమిడి ఉండాలి.
  • ఈ పథకం ప్రకారం, గృహాల కేటాయింపు కుటుంబంలోని స్త్రీల పేరుతో ముందుగా ఇవ్వాలి.
  • భౌతిక, మానసిక విక లాంగులకు, మాజీ సైనికోద్యోగులకు, వితంతువులకు, విడుదల చేయబడిన బానిస శ్రామికులకు ఈ పథకం కొంత కోటాని కేటాయించింది.

పింఛను, కుటుంబ, మాతృత్వ సహాకారం

[మార్చు]

జాతీయ సామాజిక సహాయ పథకం (ఎన్ ఎస్ ఎ పి )

[మార్చు]

1995 ఆగస్టు 15వ తేదీనుండి అమలులోకి వచ్చిన జాతీయ సామాజిక సహాయ పథకం (ఎన్ ఎస్ ఎ పి), రాజ్యాంగంలో ఆర్టికల్ 41, 42 లో ఉన్న ఆదేశిక సూత్రాలను నెరవేర్చడంలో ఒక ముఖ్యమైన కార్యసాధనంగా తెలియ చేస్తుంది. ఇది వృద్ధాప్యంలో ఉన్న పేదవారికి, సంపాదించే వారు, తల్లి మరణించిన వారికి సామాజిక సహాయం చేయడానికి నేషనల్ పాలసీ ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో మూడు విభాగాలు ఉన్నాయి. అవి

  • జాతీయ వృద్ధాప్య పింఛను పథకం (ఎన్ ఒ ఎ పి ఎస్)
  • జాతీయ కుటుంబ సహాయ పథకం (ఎన్ ఎఫ్ బి ఎస్)
  • జాతీయ మాతృత్వ సహాయ పథకం (ఎన్ ఎమ్ బి ఎస్)

భారత రాజ్యాంగం 41 వ ఆర్టికిల్ - పని, విద్య హక్కు కొన్ని కేసులలో ప్రభుత్వ సహకార హక్కు తన ఆర్థిక స్తోమత, వికాస పరిధిలో, పనికి, విద్యకు హక్కు కల్పించడానికి ఉపయుక్తమైన చర్యలను చేపడ్తు నిరుద్యోగము, వృద్ధ, రోగ, వికలాంగుల, ఇతర యోగ్యతకుమించిన అవసరాలలో ప్రభుత్వ సహకారం అందించి సార్థకమైన ఏర్పాట్లు రాష్ట్రం చేయాలి.

42 వ ఆర్టికిల్- పనిలో న్యాయమైన, మానవత్వముగల పరిస్థితులను, మాతృత్వ సహాయము పనిలో న్యాయమైన, మానవత్వముగల పరిస్థితులను, మాతృత్వ సహాయము కల్పించడానికి రాష్ట్రం ఏర్పాట్లు చేయాలి.

జాతీయ వృద్ధాప్య పింఛను పథకం ( ఎన్ ఒ ఎ పి ఎస్ )

[మార్చు]
  • ఈ పథకం క్రింద, జాతీయ వృద్ధాప్య పింఛను పథకానికి, కేంద్ర సహాయం ఈ క్రింది ఇచ్చిన సూత్రము ప్రకారము లభ్యమవు తుంది.
  • ధరఖాస్తుదారుని వయస్సు (మగ లేదా ఆడ) 65 సంవత్సరములు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి.
  • ధరఖాస్తుదారుడు, అతని/ఆమె స్వంత ఆదాయం లేదా కుటుంబ సభ్యుల లేదా ఇతర వనరుల ఆర్థిక సహాయంతో జీవనము సాగక ధరఖాస్తుదారుడు దిక్కులేనివాడై ఉండాలి.
  • వృద్ధాప్య పింఛను అర్హత నెలకి 75 రూపాయలు.

జాతీయ కుటుంబ సహాయ పథకం (ఎన్ ఎఫ్ బి ఎస్)

[మార్చు]

ఈ పథకం క్రింద, నష్టపోయిన కుటుంబంలో ప్రాథమికంగా సంపాదిస్తున్నవారు మరణించి నపుడు, దారద్ర్యరేఖ దిగువనున్న కుటుంబాల వారికి కొంత మొత్తాన్ని కుటుంబ సహాయంగా ఇస్తారు. ఈ పథకం క్రింద, ఈ క్రింద నిచ్చిన సూత్రాలను అనుసరించి కేంద్ర సహాయం చేస్తారు.

  • ప్రాథమికంగా సంపాదిస్తున్నవారు కుటుంబం సభ్యులై ఉండాలి, మగ లేదా ఆడవారై ఉండి మొత్తం కుటుంబం ఆదాయంలో వారి సంపాదన ఎక్కువై ఉండాలి.
  • 18 సంవత్సరాల కన్నా ఎక్కువ, 65 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సులో ప్రాథమిక సంపాదనా పరుని మరణం సంభవించి ఉండాలి.
  • భారత ప్రభుత్వంచే ముందుగా నిర్ణయించిన సూ త్రాల ప్రకారం, నష్టపోయిన కుటుంబం, ద్రారిద్ర్యరేఖకు దిగువన ఉండాలి.
  • ప్రాథమికంగా సంపాదనా పరుని, సహజంగా గాని లేదా అకస్మాత్తుగా గాని మరణానికిగల కారణానికి సంబంధం లేకుండా 10,000 రూపాయలు సహాయం లభిస్తుంది.
  • స్థానికంగా పరిశీలించిన తరువాత, చనిపోయిన వారి కుటుంబంలోని పెద్దవారికి కుటుంబ సహాయం లభిస్తుంది.

జాతీయ మాతృత్వ సహాయ పధకం ( ఎన్ ఎమ్ బి ఎస్)

[మార్చు]

ఈ పథకం క్రింద, దారిద్ర్య రేఖ దిగువనున్న ఇంటిలోని గర్భవతులకు ఈ క్రింది సూత్రాలననుసరించి కొంత మొత్తాన్ని డబ్బు రూపంలో సహాయాన్ని అందచేస్తారు.

  • 19 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ ఉన్న గర్భవతులకు మొదటి రెండు కాన్పుల వరకు ఈ సహాయం లభిస్తుంది.
  • భారత ప్రభుత్వముచే ముందుగా నిర్ణయించబడిన సూత్రాలననుసరించి లబ్ధిదారులు ద్రారిద్ర్యరేఖకు దిగువన ఉండాలి.
  • 500 రూపాయల సహాయం లభిస్తుంది.
  • కాన్పుకు 12-8 వారాల ముందు ఒకే మొత్తంగా మాతృత్వ సహాయం ఇవ్వబడుతుంది.
  • సరియైన సమయానికి మాతృత్వ సహాయం అందేలా చూడాలి. ఒకవేళ ఆలస్యం అయితే, ఈ సహాయాన్ని లబ్ధిదారునికి కాన్పు అయిన తరువాత కూడా ఇవ్వవచ్చు.

లక్ష్యాలు

[మార్చు]
  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతం లేదా భవి ష్యత్తులో ఇచ్చే సహాయమే కాకుండా, 100% స్పాన్సరు చేస్తున్న కేంద్ర జాతీయ సామాజిక సహాయ పథకం (ఎన్ ఎస్ ఎ పి), కనీస జాతీయ ప్రమాణ సామాజిక సహాయం అందిం చడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
  • ఏ మాత్రం అడ్డానికి లేకుండా, దేశంలో ప్రతీ చోటా సమానంగా అందరి లబ్ధిదారులకు సామాజిక రక్షణ కల్పించడానికి 100% కేంద్ర సహాయాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు.
  • సామాజిక సంరక్షణ పథకాలపై రాష్ట్రం తమ స్వంత వ్యయం పై కేంద్ర సహాయం మార్పుని తీసుకు రానీయదు. రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు స్వతంత్రంగా సామాజిక సహ కారం ఎక్కడైనా చేయదలచుకుంటే వారు వారి కవరేజిని విస్తరించవచ్చు
  • సామాజిక సహాయ ప్యాకేజిలని పేదరికాన్ని తగ్గించే, కనీస అవసరాల్ని కల్పించే పథకాలలో కలపడానికి అవకాశాలని జాతీయ సామాజిక సహాయ పథకం (ఎన్ ఎస్ ఎ పి) కల్పిస్తుంది. ఉదాహరణకి మాతృత్వ సహాయాన్ని, మాతృత్వ, పిల్లల సంరక్షణ పథకాలతో కలపవచ్చు.

పథకం అమలు పరచడం

[మార్చు]
  • పంచాయతి, పురపాలక సంఘాల సహ కారంతో రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా జాతీయ సామాజిక సహాయ పథకాలు (ఎన్ ఎస్ ఎ పి) అమలు చేయబడుతున్నవి.
  • జాతీయ సామాజిక సహాయ పథకం (ఎన్ ఎస్ ఎ పి) మార్గదర్శక సూత్రాల ప్రకారము ఎన్ ఎస్ ఎ పి లను అమలు చేయడానికి ప్రతి రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం నోడల్ డిపార్టుమెంటుని గుర్తించింది.
  • నోడల్ డిపార్ట్ మెంట్ యొ క్క సెక్రెటరి ఆ యొక్క రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతానికి నోడల్ సెక్రెటరీగా వ్యవహరించాలి
  • ఎన్ ఎస్ ఎ పి మీద, జిల్లాలలో జిల్లా స్థాయి కమిటీలు ఉన్నాయి.
  • తమ ప్రాంతాలలో ఎన్ ఎస్ ఎ పి క్రింద పథకాలని అమలు చేయడానికి, తమ జిల్లా మెజిస్ట్రేట్ /జిల్లా కలెక్టరు అధ్యక్షతన జిల్లా స్థాయి అమలు చేసే అధికారుల నియామకాన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రకటించాయి.
  • సహాయాల్ని అమోదించే ధరఖాస్తుల్ని పరి శీలించడం, లబ్ధిదారులకు ఆ సహాయాల్ని అందేలా చేసే బా ధ్యత జిల్లా కలెక్టరు లేదా నోడల్ బా ధ్యతలను అప్పగించిన అధికారులకు ఉంది.
  • సొమ్ము ఇచ్చే అధికారులు, ముందుగా నిర్ణయించిన సూత్రాల/నియమాల ప్రకారం డబ్బుని నగదు రూపంలో ఇవ్వడంతో పాటు ఇతర/వివిధ రకాలుగా చెల్లించే విధానాన్ని అనుసరించవచ్చు.
  • ఎన్ ఎస్ ఎ పి మూడు పథకాల క్రింద, లబ్ధిదారులను గుర్తించడంలో గ్రామ పంచాయితీలు / పురపాలక సంఘాలు చురుకైన పాత్ర వహించాలని అనుకుంటున్నారు.
  • తగిన విధంగా లబ్ధిదారులను లక్ష్యాల కనుగుణంగా పంచాయితీలు /ఇరుగు పొరుగు/ మొహల్లా కమిటీలచే లబ్ధిదారులను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ వృద్ధాప్య పింఛను పథకం, జాతీయ కుటుంబ సహాయ పథకం, జాతీయ మాతృత్వ సహాయ పథకం లక్ష్యాల్ని పంచాయితీలకు / పురపాలక సంఘాలకి తెలియ పరచాలి.
  • గ్రామీణ ప్రాంతాలలో గ్రామ సభా సమావేశాలు, పట్టణ ప్రాంతాలలో ఇరుగు పొరుగు/ మొహల్లా కమీటీ మీటింగులు వంటి ప్రజా మీటింగులలో కూడా జాతీయ వృద్ధాప్య పింఛను పథకం, జాతీయ కుటుంబ సహాయ పథకం, జాతీయ మాతృత్వ సహాయ పథకం క్రింద క్రేంద్ర సహాయాన్ని లబ్ధిదారులకు అందచేయవచ్చు/ ఇవ్వవచ్చు.
  • జాతీయ సామాజిక సహాయ పథకం యొక్క సమాచారం గురించి, వాటి క్రింద లభించే సహాయం గురించి చెప్పడం పంచాయితీల / పురపాలక సంఘాల బాధ్యత. ఈ పని లో, స్వచ్ఛంద సంస్థల పాత్రని, సహ కారాన్ని కూడా వారు ప్రోత్స హించవచ్చు.

వనరులు

[మార్చు]
  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]