Jump to content

సాక్షి ధోని

వికీపీడియా నుండి
సాక్షి ధోని
భర్త ఎం.ఎస్. ధోని, కూతురు జీవాతో కలసి సాక్షి ధోని
జననం
సాక్షి సింగ్ రావత్

(1988-11-19) 1988 నవంబరు 19 (వయసు 36)
ఇతర పేర్లుసాక్షి సింగ్ ధోని
వృత్తిసినిమా నిర్మాత
జీవిత భాగస్వామిమహేంద్రసింగ్ ధోని
పిల్లలుజీవా ధోని (కుమార్తె)
తల్లిదండ్రులు
  • ఆర్.కె. సింగ్ (తండ్రి)
  • షీలా సింగ్ (తల్లి)
బంధువులుఅభిలాషా బిష్త్ (సోదరి), అక్షయ్ సింగ్ (సోదరుడు)

సాక్షి సింగ్ ధోని (జననం 1988 నవంబరు 19) భారతీయ సినిమా నిర్మాత. ఆమె భారతీయ క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోనీ భార్య. వీరిరువురు కలసి ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ ని స్థాపించి మొదటి సినిమాగా ఎల్‌జీఎంను నిర్మించారు. దీనికి రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించాడు. హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా నటించిన ఈ సినిమా 2023 ఆగస్టు 4న విడుదల కానుంది.[1]

ఎల్‌జీఎం(లెట్స్‌ గెట్‌ మారీడ్‌) సినిమాను త‌మిళంలో నిర్మించినా, ఈ చిత్రాన్ని తెలుగులోకి డ‌బ్ చేసి జె.పి.ఆర్‌.ఫిల్మ్స్‌, త్రిపుర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ విడుద‌ల చేస్తున్నాయి.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఆమె అస్సాంలోని గౌహతి నగరంలో 1988 నవంబరు 19న ఆర్.కె. సింగ్, షీలా సింగ్ దంపతులకు సాక్షి సింగ్ రావత్ గా జన్మించింది. ఆమెకు అభిలాషా బిష్త్ అనే సోదరి, అక్షయ్ సింగ్ అనే సోదరుడు ఉన్నారు.

ఆమె ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వెల్హామ్ బాలికల పాఠశాల, జార్ఖండ్‌లోని రాంచీలో జవహర్ విద్యా మందిర్‌లలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ నుండి హోటల్ మేనేజ్‌మెంట్‌లో పట్టభద్రురాలైంది. ఆమె కోల్‌కతాలోని తాజ్ బెంగాల్‌లో ఇంటర్న్‌గా పనిచేసింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె డెహ్రాడూన్‌లో 2010 జూలై 4న ఎం ఎస్ ధోనీని వివాహం చేసుకుంది. వీరికి జీవా ధోని అనే ఒక కుమార్తె ఉంది.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "LGM: ధోనీ 'ఎల్‌జీఎమ్‌' సిద్ధం | lgm post production work started". web.archive.org. 2023-07-24. Archived from the original on 2023-07-24. Retrieved 2023-07-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "MS Dhoni's wife Sakshi Singh Rawat is an incurable romantic with little interest in cricket". Archived from the original on 19 October 2016. Retrieved 3 July 2021.
  3. "Dhoni to wed tonight". The Hindu (in Indian English). PTI. 4 July 2010. ISSN 0971-751X. Retrieved 26 October 2021.{{cite news}}: CS1 maint: others (link)
  4. "Mahendra Singh Dhoni Becomes Father to a Baby Girl". NDTV. 6 February 2015.