సాక్షి గులాటి
స్వరూపం
సాక్షి గులాటి | |
---|---|
జననం | మార్చి 10, 1983 |
వృత్తి | నటి, మోడల్ |
ఎత్తు | 5 అడుగుల 8 అంగుళాలు[1] |
సాక్షి గులాటి భారతీయ సినిమా నటి, మోడల్. 2008లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కాంట్రాక్ట్ అనే హిందీ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.[2][3]
జీవిత విశేషాలు
[మార్చు]ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ లోని ఆర్మీ నేపథ్యానికి చెందిన పంజాబీ కుటుంబంలో 1983, మార్చి 10న సాక్షి జన్మించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్ (హోన్స్) డిగ్రీని పూర్తిచేసింది. నటన, కథక్, సల్సా వంటి నృత్యాలు,[2] ఈత, గుర్రపు స్వారీ మొదలైన వాటిల్లో శిక్షణ పొందింది.[4]
సినిమారంగం
[మార్చు]2007లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచింది. కాంట్రాక్ట్ (2008), ది ఫిల్మ్ ఎమోషనల్ అత్యాచార్ (2010), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు (2011),[5] చిత్రాంగద (2017)[6] వంటి చిత్రాలలో నటించింది.
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష |
---|---|---|---|
2007 | ఢిల్లీ హైట్స్ | స్వీటి (అతిథి పాత్ర) | హిందీ |
2008 | కాంట్రాక్ట్ | ఇయా (ప్రధాన పాత్ర) | హిందీ |
2010 | ది ఫిల్మ్ ఎయోషనల్ అత్యాచార్ | ఐశ్వర్య (అతిథి పాత్ర) | హిందీ |
2011 | కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు | కనిష్క (ప్రధాన పాత్ర) | తెలుగు |
2017 | చిత్రాంగద[7] | సంయుక్త (ప్రధాన పాత్ర) | తెలుగు |
2017 | దుశ్మన్ | రేహా (ప్రధాన పాత్ర) | పంజాబి |
మూలాలు
[మార్చు]- ↑ "SAKSHI GULATI - PROFILE". The Times of India. 3 September 2013. Archived from the original on 3 ఏప్రిల్ 2015. Retrieved 2 April 2020.
- ↑ 2.0 2.1 "Contract with Bollywood". The Hindu. 5 July 2008. Retrieved 2 April 2020.
- ↑ "Sakshi Gulati looks sexy in a photoshoot". Times Internet.
- ↑ "Telly actor Nishant Malkani celebrates birthday with friends". Mid Day. 3 September 2013. Retrieved 2 April 2020.
- ↑ "Sakshi Gulati". IMDb.
- ↑ "'Chitrangada' wrapped up". Y Talkies. 3 September 2013. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 2 April 2020.
- ↑ 123తెలుగు, సమీక్ష (10 March 2017). "చిత్రాంగద – అంజలి మాత్రమే ఆకట్టుకుంది!". www.123telugu.com. Retrieved 2 April 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)