సాంబశివరావు నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాంబశివరావు నాయుడు

హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు పిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1962
రామచంద్రాపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు సత్యనారాయణ, సూర్యావతి
పూర్వ విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీ

సాంబశివరావు నాయుడు భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సాంబశివరావు నాయుడు 1962లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంలో సత్యనారాయణ, సూర్యావతి దంపతులకు జన్మించాడు. ఆయన రామచంద్రాపురంలో ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేసి, అమలాపురంలోని ఎస్కేబీఆర్‌ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1986లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.

వృత్తి జీవితం

[మార్చు]

సాంబశివరావు నాయుడు ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాక జానకిరామయ్య వద్ద జూనియర్‌గా చేరి వృత్తిలో మెళుకువలు నేర్చుకొని సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టి 1991లో జిల్లా జడ్జి పరీక్షల్లో ఉత్తీర్ణులై జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యాడు. ఆయన జూనియర్‌ సివిల్‌ జడ్జి, సీనియర్‌ సివిల్‌ జడ్జి, అదనపు జిల్లా జడ్జిగా హుజూరాబాద్, కరీంనగర్‌, వరంగల్‌, కొత్తగూడెం, తిరుపతిలో వివిధ హోదాల్లో పని చేసిన అనంతరం జిల్లా జడ్జిగా పదోన్నతి అందుకొని మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుల్లో జిల్లా జడ్జిగా పని చేసి 2019 నుండి హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు పిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[2][3] సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2022 మార్చి 22న ఆమోదించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (2 February 2022). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  2. 2.0 2.1 TV9 Telugu (2 February 2022). "తెలంగాణా హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జీల నియామకానికి సుప్రీం కోర్టు ఆమోదం." Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhra Jyothy (3 February 2022). "హైకోర్టుకు 12 మంది కొత్త న్యాయమూర్తులు". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  4. Sakshi (23 March 2022). "హైకోర్టుకు కొత్తగా 10 మంది జడ్జీలు". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.