దిద్దుబాటు కోసం పేజీని తెరిచినపుడు VisualEditor పరికరాలపట్టీ తెరకు పై భాగాన 'కలం' రూపంలో కనిపిస్తుంది.
అనే బొత్తాలు మీరు చేసిన మార్పులను రద్దు చెయ్యి, మళ్ళీ చెయ్యి అనే రెండు పనులు చేసేందుకు పనికొస్తాయి
పేరాగ్రాఫు లేదా శీర్షిక డ్రాప్ డౌన్ మెనూ ద్వారా పాఠ్యానికి ప్రామాణికమైన ఆకృతిని ఇవ్వవచ్చు. ఉదాహరణకు , ఉపశీర్షికలనూ సృష్టించడం. మామూలు పాఠ్యానికి "పేరాగ్రాఫు" అని, ప్రధాన విభాగాలకు "శీర్షిక" అనీ, ఉపవిభాగాలకు "శీర్షిక 2", "శీర్షిక 3", వగైరా... అనీ పేర్లు.
A అనే డ్రాప్ డౌన్ మెనూలో అదనపు అంశాలైన బొద్దు (B), ఇటాలిక్ (I), క్రీగీత (U), సూపర్స్క్రిప్టు (x2), సబ్స్క్రిప్టు (x2) ఉంటాయి. మీరు ఎంచుకున్న పాఠ్యానికి ఈ ఫార్మాటింగు వర్తింపజేస్తుంది. ఉదాహరణకు, వ్యాసం పేజీలో వ్యాస శీర్షిక పేరు మొదటిసారి వచ్చినప్పుడు దాన్ని బొద్దుగా రాయాలి.
మెనూ ద్వారా బులెట్ల, అంకెల జాబితాలను చేర్చవచ్చు. Ω మెనూలో స్పెషలు క్యారెక్టర్లు ఉంటాయి.