సహాయం:వికీపీడియా పరిచయం
మీరెలా తోడ్పడవచ్చు
వెనకాడకండి – ఎవరైనా, దాదాపుగా ఏ పేజీనైనా సరిదిద్దవచ్చు; మెరుగుపరచాల్సిన పేజీని పట్టుకోండి, దాన్ని మెరుగుపరచండి! మీరు కంటెంటును చేర్చవచ్చు (మూలాలతో), బొమ్మలను ఎక్కించవచ్చు, అక్షర, వ్యాకరణ దోషాలను సవరించవచ్చు, పాఠ్యాన్ని మెరుగుపరచి, వ్యాసపు పఠనీయతను పెంచవచ్చు, లేదా అనేక ఇతర పనులు చెయ్యవచ్చు. మా విధానాలు కొత్త వాడుకరులను కొంత బెదర గొట్టడం మామూలే. కానీ మొదట్లోనే అన్నీ మీకు అర్థమై పోవాలనేమీ లేదు, కాకపోయినా ఫరవాలేదు; దిద్దుబాట్లు చేసేటపుడు కొద్దిగా లోకజ్ఞానం (ఆలోచన) పెడితే చాలు. ఒకవేళ పారపాటున అనుకోకుండా మీరు దేన్నైనా చెడగొట్టినా, ఆందోళన పడాల్సిందేమీ లేదు. మరొక వాడుకరి ఎవరైనా పరిశీలించి దాన్ని సరిచేస్తారు, మెరుగు పరుస్తారు. అంచేత ముందుకు సాగండి. వ్యాసాల్లో దిద్దుబాట్లు చేసి వికీపీడియాను ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ సమాచార వనరుగా నిలబెట్టండి!
మెరుగుదలకు సూచనలివ్వండి – ప్రతీ వ్యాసానికీ ఒక "చర్చ" పేజీ ఉంటుంది. అక్కడ మీరు వ్యాసాన్ని మెరుగుపరచేందుకు, తప్పులు సరిచేసేందుకూ సూచనలు ఇవ్వవచ్చు.
విరాళమివ్వండి – వికీపీడియా ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో రాసేవాళ్ళంతా స్వచ్ఛంద సేవకులే. కానీ దాని సర్వర్లను నడిపేందుకు అయ్యే ఖర్చుల కోసం వికీమీడియా ఫౌండేషను, విరాళాల పైనే ఆధారపడుతుంది. ప్రాజెక్టు నడిపేందుకు, నిర్వహణలకు, అభివృద్ధికీ అయ్యే ఖర్చుల కోసం విరాళమివ్వండి.
ఖాతాను సృష్టించుకోండి
అజ్ఞాతంగా దిద్దుబాట్లు చేసేందుకు అడ్డంకి ఏమీ లేదు, వికీపీడియా మీకు సదా ఆహ్వానం పలుకుతుంది. కానీ ఖాతాను తెరవడంలో అనేక ఉపయోగాలున్నాయి. దానికి పెద్దగా సమయం పట్టదు, ఇట్టే అయిపోతుంది. అది ఉచితం కూడా.
ఆలస్యమెందుకు, ఇప్పుడే ఎడిటరును వాడి చూడొచ్చుగా?
కింది పరీక్షా పేజీల్లో దిద్దుబాట్లు చేసి, దిద్దుబాటు చెయ్యడమంటే ఏంటో, అది ఎలా ఉంటుందో పరిశీలించండి:
లేదా లేదా
ఏదో కొంత పాఠ్యాన్ని టైపించి, అది బాగుందని మీకు అనిపిస్తే మార్పులను ప్రచురించుబొత్తాన్ని నొక్కండి. ఏదైనా చెడిపోద్దేమోనని భయపడకండి; ఈ పేజీలు ప్రయోగాలు చేసేందుకే ఉన్నాయి.
తెర వెనుక వ్యవహారం ఇంకా ఎంతో ఉంది
వికీపీడియాలో విజ్ఞాంసర్వస్వ వ్యాసాలతో పాటు దానికి దోహదపడే ఎన్నో తెరవెనుక పేజీలు, ఎన్నో సముదాయపు పేజీలూ ఉన్నాయి.
వికీప్రాజెక్టులు – ఒక్కో విషయంపై పేజీలు తయారు చేసేందుకు/నిర్వహణకూ చేపట్టిన ప్రత్యేక ప్రాజెక్టులు
సహాయం పేజీలు – ఏ పని ఎలా చెయ్యాలో చెప్పే సహాయక పేజీలు
సముదాయ పందిరి – సాముదాయికంగా ఏమేం పనులు చెయ్యాల్సి ఉందో చూపే పేజీ