సర్వదర్శన సంగ్రహం
స్వరూపం
సర్వదర్శన సంగ్రహం (సంస్కృతం: सर्वदर्शनसंग्रहः) మాధవ విద్యారణ్యుడిచే రచించబడిన అతి ప్రాచీన హైందవ నాస్తిక తత్వం. ఇందులో
- చార్వాక దర్శనం
- బౌద్ధ దర్శనం
- ఆర్హత దర్శనం
- రామానుజ దర్శనం
- పూర్ణప్రజ్ఞ దర్శనం
- నకులీశ పాశుపతదర్శనం
- శైవ దర్శనం
- ప్రత్యభిజ్ఞా దర్శనం
- రసేశ్వర దర్శనం
- ఔలూక్య దర్శనం
- అక్షపాద దర్శనం
- జైమినీయ దర్శనం
- పాణిని దర్శనం
- సాంఖ్య దర్శనం
- పాతంజల దర్శనం
కలవు.
రచయిత గురించి
[మార్చు]మాధవ విద్యారణ్యుడు విజయనగర సామ్రాజ్యంలో హరిహరునికి, బుక్క రాయకీ రాచగురువు, మహర్షి. శృంగేరీ శారదా పీఠానికి 12వ జగద్గురువుగా 1380-1386 వరకూ వ్యవహరించారు. హంపి లో గానీ, వరంగల్లులో గానీ వీరు జన్మించి ఉండవచ్చునని ఒక అభిప్రాయము కలదు.
గ్రంథం
[మార్చు]అన్ని అధ్యాయములలోను విద్యారణ్యుడు దైవముపై నున్న నమ్మకాన్ని ప్రశ్నిస్తాడు. ఈ మతాలను కనుగొన్నవారి వాక్కులను నేరుగా ప్రస్తావిస్తూనే వీటన్నింటికీ భిన్నంగా నాస్తికత్వాన్ని ప్రబోధిస్తాడు.
కాలగర్భంలో కలిసిపోయిన చార్వాకుని బోధనలకు ఇందులోని మొదటి అధ్యాయమైన చార్వాకదర్శనం ఒక చక్కని మూలం.
కొన్ని ముఖ్యమైన బోధనలు
[మార్చు]చార్వాక దర్శనము
[మార్చు]- ఏ జీవికైనను మరణము తప్పదు. చనిపోయిన తర్వాత మరల ప్రాణం రాదు. కనుక జీవించినంత కాలము (అప్పు తీసుకొనైనా సరే, నేతిని సేవించి) సుఖముగ జీవించవలెను.
- ఐహిక భోగాలు, భౌతికవాద సుఖములలో దు:ఖము పొంచి ఉన్నది కావున వీటిని పరిత్యజించాలి అనేది మూర్ఖమైన భావన. పొట్టు/మురికి ఉన్నంతమాత్రాన, ధాన్యాన్ని సేవించట మానేయం కదా?
- వేదాలు, యజ్ఞోపవీతాలు, భస్మలేపనాలు బుద్ధిహీనుల/అమానుషుల పొట్ట నింపటానికి సృష్టించబడినవి
- అగ్నిలో వేడిమి, నీటిలో చలువ, ప్రొద్దుటే వీచే పిల్లగాలిలో తాజాదనం; వాటి వాటి స్వభావరీత్యా ప్రాప్తించినవే. దీనికి ఎవ్వరూ (భగవంతుడు) కారకులు కారు.
- స్వర్గం, నరకం, మోక్షం, ఆత్మ, పరలోకఫలాలు; ఇవేవీ లేవు. వర్ణాశ్రమ భేధాలతో చేసే క్రియల వలన తర్వాతి కాలంలో వాటి వల్ల ఫలితాలు కలుగుతాయన్నది కూడా ఒట్టి మాటే!
- జ్యోతిష్టోమాది యజ్ఞంలో ఏ పశువునైతే వధిస్తారో అది స్వర్గానికేగుతుందని తెలిపెదరు. ఇదే సత్యమైతే ఏదో ఒక యజ్ఞం చేసి మీ తల్లిదండ్రులను కూడా కాళికి బలివ్వచ్చు కదా? అలా చేస్తే వారికి కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది కదా?
- చనిపోయిన వ్యక్తి పేరుపై శ్రాద్ధం నిర్వహించటం వలనే అతని ఆత్మ శాంతించేటట్లయితే మనం దూరప్రదేశాల ప్రయాణానికి వెళ్ళినపుడు కూడా భోజనం ఎందుకు తీసుకువెళ్ళటం?
వంటలన్నీ ఇంట్లోనే వండేసి నివేదించేస్తే ఆ భోజనం దానంతకై అదే మనకు ఆకలి వేసినపుడు మన ఆకలిని తీరుస్తుంది.
- స్వర్గంలో ఉన్న వారి ఆత్మలకు శాంతి, భూమిపై వారి శ్రాద్ధాలతోనే జరిగేటట్లైతే ఇంటి పై కప్పుపై ఉన్న వారి ఆకలిని క్రింది అంతస్థు నుండే తీర్చవచ్చు కదా?
- ఈ దేహాన్ని విడిచి పరలోకము వెళ్ళగలిగినవారు వారు ప్రేమించే బంధువుల, స్నేహితుల దేహాలలోకి ఎందుకు తిరిగిరారు?
- వేదాల కర్తలు ముగ్గురు. వారే విదూషకులు, దొంగలు, రాక్షసులు. పండితులుగా చెప్పుకొనే వీరు, వీరి నానా రకాల జర్ఫరి, తుర్ఫరి వంటి వాక్యాలతోనే వేదాలను నింపేశారు.
- అశ్వమేథ యాగం చేసేవాడు ధర్మపత్నిని త్యజించి తలను నరికివేయాలి. ఇవన్నీ విదూషకులు రచించారు. స్వర్గ నరకాది విషయాలు ధూర్తులు రచించారు. ఏయే శాస్త్రాల్లోనైతే మద్యమాంసాలు నైవేద్యంగా సమర్పించాలని రాయబడ్డాయో, వాటిని రాక్షసులు రచించారు. తమను తాము పండితులుగా చెప్పుకొనే వీరందరూ ఈ రచనలను తమ పొట్ట నింపుకోవటానికి చేశారు. చార్వాకుడు ఇటువంటి వారిని, వీరి రచనలనే ఖండించాడు. సర్వప్రాణులకు జ్ఞానుగ్రహాన్ని ప్ర్రాప్తింపజేసేందుకు కృషి చేసి ఈ మతాన్ని విస్తరింపజేశాడు. ఈ చార్వాక మతాన్నే అందరూ అనుసరించాలి. ఇదే అన్ని మతాలలోకెల్లా శ్రేష్ఠమైన మతము.
బౌద్ధ దర్శనం
[మార్చు]- వర్షం, ఎండలతో ఆత్మకు ఏమి పని ఉన్నది? వాటి ప్రభావం మనిషి యొక్క చర్మము పైన మాత్రమే ఉంటుంది. ఆత్మయే చర్మము వలె ఉన్నపుడు, వాటి ప్రభావం ఆశాశ్వతం. చర్మమే ఆత్మ వలె ఉన్నపుడు, దానిపై వాటి ప్రభావమనేదే ఉండదు.
ఆర్హత దర్శనం
[మార్చు]- మతపరమైన యాచకుడు, ప్రేమికుడు, శునకములచే ఒకే స్త్రీ శవంగా, కామాన్ని తీర్చెడిదిగా, మాంసపు ముద్దగా మూడు విధములుగా అర్థం చేసుకొనబడుతుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]ఇతర లింకులు
[మార్చు]
- సర్వదర్శన సంగ్రహం (దేవనాగరిలో)
- Sarva-darsana-sangraha of Madhavacharya
- The Project Gutenberg EBook of The Sarva-Darsana-Samgraha, by Madhava Acharya
- Vivarana Prameya Sangrah by Vidyaranya Swami (Sanskrit Text with Hindi Translation) at archive.org
- Sarva-Darsana-Samgraha by Madhavacharya (Vidyaranya Swami) - tr by E.B.Cowell (1882) at archive.org