సరోజిని బాబర్
సరోజిని బాబర్ (सरोजिनी बाबर) (1920 జనవరి 7 – 2008 ఏప్రిల్ 20 [1]) భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన మరాఠీ రచయిత్రి, రాజకీయవేత్త.
విద్య
[మార్చు]1920 జనవరి 7న మహారాష్ట్ర, సాంగ్లీ జిల్లా, బగానిలో జన్మించారు.[2] ఇస్లాంపూర్ లో ఉన్నత విద్యను పూర్తి చేసిన తరువాత, 1944లో ఎస్. పి. కళాశాల, పూణే నుండి బి. ఎ. ని పొందింది. తర్వత జీజామాత ఉన్నత పాఠశాలో ఉపాధ్యాయురాలిగా కొంతకాలం కొనసాగించి, ఎం.ఎ. చేయాలని ఉద్యోగానికి రాజినమ చేసింది.[3] ఆమె ముంబయి విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ.,[4] "మరాఠీ సాహిత్యానికి మహిళా రచయితల సహకారం" కోసం పిహెచ్‌డి [5][6] కూడా పొందింది.
రాజకీయవేత్తగ
[మార్చు]ఆమె 1952 – 1857 వరకు, 1963 – 1966 వరకు మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభ సభ్యురాలిగా, 1968 – 1974 వరకు భారత రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. మహారాష్ట్ర రాష్ట్ర జానపద కమిటీ, మహారాష్ట్ర సాహిత్య పరిషత్, మహారాష్ట్ర లోక్ సాహిత్య పరిషత్ కు ఛైర్‌పర్సన్ గా ఉన్నారు.[1]
జానపద నిపుణురాలుగా
[మార్చు]1950 నుండి చాలా సంవత్సరాల వరకు సరోజిని సమాజ్ శిక్షణ్ మాలా (समाज शिक्षण माला) పత్రికకు పాత్రికేయురాలుగా పనిచేసింది.
1953లో సాహిత్యం ద్వారా మరాఠీ ప్రజల సాంస్కృతిక సుసంపన్నత కోసం మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర రాజ్య లోక్సహిత్య సమాఖ్య (ఎంఆర్ఎల్ఎస్) ను ఏర్పాటు చేసింది. 1961 – 1993 వరకు ఎంఆర్ఎల్ఎస్ కు సరోజిని నాయకత్వం వహించింది.
జానపద రచయిత్రిగ
[మార్చు]ఆమె మహారాష్ట్రకు చెందిన జానపద కళ, సాహిత్య రంగంలో నిపుణురాలు. ఆమె గ్రామీణ మహిళల యొక్క వివిధ అంశాలపై విస్తృతమైన పరిశోధన చేసింది.[7]
ఆమె సమాజోద్యానానికి సంబంధించి 550 పుస్తకాలు, స్వతంత్రంగా 87 పుస్తకాలు, 7 నవలలు, 11 కథా సంకలనాలు, 26 లలిత వ్యాస సంకలనాలు, 4 బాల వాంగ్య, నాటక సంకలనాలు, 2 కవితా సంకలనాలు, ఇంత పెద్ద గ్రంథ సంపద రచయిత-సంపాదకురాలిగా ఉంది.[6]
గౌరవాలు, పురస్కరలు
[మార్చు]- 1982: మహాత్మా ఫులే కృషి విద్యాపీఠం నుండి డిఎస్ సి (DSc) అందుకుంది.[3]
- 1984: గౌరీవ్వర్తి యోజన (गौरववृत्ती योजना) పురస్కరం లభించింది.[8]
- 1997: తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠ్, పూణే నుండి డి.లిట్. (D.Litt.) అందుకుంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Staff (2008-04-24). "RS pays homage to former member Sarojini Babar". oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-29.
- ↑ "लोकसाहित्याच्या पूजक : सरोजिनी बाबर". Lokmat (in మరాఠీ). 2019-08-31. Retrieved 2024-01-30.
- ↑ 3.0 3.1 3.2 "सरोजिनी बाबर (Sarojini Babar)". मराठी विश्वकोश (in మరాఠీ). 2019-07-31. Retrieved 2024-01-30.
- ↑ "Sarojini Babar". map.sahapedia.org (in ఇంగ్లీష్). Retrieved 2024-01-30.
- ↑ "लोकसाहित्यात उमललेली 'सरोजिनी'". Maharashtra Times (in మరాఠీ). Retrieved 2024-01-30.
- ↑ 6.0 6.1 "लोकसंस्कृतीचा गहिवर". Loksatta (in మరాఠీ). 2019-01-12. Retrieved 2024-01-30.
- ↑ "Former Rajya Sabha member Sarojini Babar dead". Hindustan Times (in ఇంగ్లీష్). 2008-04-20. Retrieved 2024-01-30.
- ↑ "गौरववृत्ती". महाराष्ट्र राज्य साहित्य आणि संस्कृती मंडळ (in మరాఠీ). 2018-12-15. Retrieved 2024-01-31.
- Pages using the JsonConfig extension
- CS1 మరాఠీ-language sources (mr)
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description matches Wikidata
- Articles containing Marathi-language text
- Articles containing English-language text
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- మహిళలు
- 20వ శతాబ్దపు భారతీయ రచయిత్రులు
- మరాఠీ రచయితలు
- 2008 మరణాలు
- 1920 జననాలు