సయ్యద్ ముఖాసిర్‌షా
సయ్యద్ ముఖాసిర్ షా | |||
| |||
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 1979-1980 1980-1985 | |||
ముందు | ఎన్.వెంకటసుబ్బయ్య | ||
---|---|---|---|
తరువాత | ఎ.చక్రపాణి | ||
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఉపాధ్యక్షుడు
| |||
పదవీ కాలం 1970-1974 1974-1979 | |||
ముందు | ఎర్రం సత్యనారాయణ | ||
తరువాత | కంచెర్ల కేశవరావు | ||
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1968-1985 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆదిలాబాద్, తెలంగాణ | 1932 మార్చి 15||
మరణం | 1992 అక్టోబరు 17 | (వయసు 60)||
మతం | ముస్లిమ్ |
సయ్యద్ ముఖాసిర్‌షా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ అధ్యక్షుడు.
విశేషాలు
[మార్చు]సయ్యద్ ముఖాసిర్‌షా 1932, మార్చి 15న ఆదిలాబాద్ జిల్లాలో సయ్యద్ ముదాసిర్ షా, అజీజ్ ఉన్నీసా బేగం దంపతులకు జన్మించాడు. ఇతడు హైదరాబాదులోని బద్రుక కళాశాల నుండి బి.కామ్. పట్టాను పొందాడు.
ఇతడు 1968 జూలై 1 నుండి 1974 జూన్ 30 వరకు, 1974 జూలై 1 నుండి 1980 జూన్ 30 వరకు ఆదిలాబాదు స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికైనాడు. తరువాత 1980 జూలై 1 నుండి 1985 మే 31 వరకు శాసనమండలిలో నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నాడు.
ఇతడు 1970 డిసెంబరు 17న శాసనమండలి ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై ఆ పదవిలో 1979 మార్చి 24 వరకు పనిచేశాడు. 1979 మార్చి 26న శాసనమండలి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై 1980 జూన్ 30 వరకు, తిరిగి 1980 జూలై 1 నుండి 1985 మే 31వరకు పనిచేశాడు.
ఇతడు 1970-71 మధ్య కాలంలో ప్రభుత్వ లెక్కల కమిటీ సభ్యుడిగా, 1971-72, 1972-73 సంవత్సరాల మధ్యకాలంలో విశేషాధికారాల కమిటీ, అర్జీల కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు.
ఇతడు లండన్‌లో జరిగిన 31వ కామన్‌వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు హాజరయ్యాడు. ఇంకా ఇతడు ఇంగ్లాండు, పశ్చిమ జర్మనీ, సౌదీ అరేబియా దేశాలను సందర్శించాడు.
ఇతడు 1992 అక్టోబరు 17న తన 60వ యేట మరణించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "శ్రీ సయ్యద్ ముఖాసిర్ షా". లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్. Centre for Good Governance. Retrieved 11 May 2020.[permanent dead link]