సమాలోచన
స్వరూపం
సమాలోచన 1977 లో వెలువడిన తెలుగు సాంస్కృతిక పక్ష పత్రిక. దీన్ని రాజమహేంద్రవరం నుండి విద్వాన్ బులుసు సీతారామశాస్త్రి ప్రచురించేవాడు.
చరిత్ర
[మార్చు]సమాలోచన పత్రిక 1977 నవంబరు 1 న మొదలైంది. విద్వాన్ బులుసు సీతారామశాస్త్రి రాజమహేంద్రవరం నుండి ఈ పక్ష పత్రికను ప్రచురించాడు. 1989 జూలై 29 న ఆయన మరణించాక పత్రిక ప్రచురణ బి.వి., అండ్ కో చేపట్టింది. బి.రవికాంత్ సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు.
రచనలు
[మార్చు]ఈ పత్రిక సంక్షిప్తం గాను, సౌమనస్యంతోనూ ఉండే విమర్శనాత్మక రచనలకు స్వాగతము పలికింది. రచనలు సరళ గ్రాంథికములో గానీ, శిష్ట వ్యావహారికంలో గానీ ఉండవచ్చునని ప్రకటించింది. వివాదాస్పదములుగాని, చట్టబద్దమైన, మత, రాజకీయ, ఆర్థిక, విజ్ఞాన, పారమార్థిక, సాహిత్యాలకు సంబంధించి వివిధ ప్రక్రియలకు చెందిన ఏ రచనలనైనా ప్రచురిస్తామని ప్రకటించింది.[1]