Jump to content

సమంత

వికీపీడియా నుండి
(సమంత అక్కినేని నుండి దారిమార్పు చెందింది)
సమంత
జననం
సమంత రుతు ప్రభు

(1987-04-28) 1987 ఏప్రిల్ 28 (వయసు 37)
స్టెల్లా మారిస్ కాలేజ్, చెన్నై
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2007 - ఇప్పటివరకు
జీవిత భాగస్వామిఅక్కినేని నాగ చైతన్య (2017-2021)
తల్లిదండ్రులునీనెట్ ప్రభు, జోసెఫ్ ప్రభు[1]
సంతకం
Samantha

సమంత (జ. 28 ఏప్రిల్, 1987) తెలుగు, తమిళ్ భాషల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.

మరోపక్క ఈగ ఏకకాల తమిళ నిర్మాణం నాన్ ఈ, ఎటో వెళ్ళిపోయింది మనుసు ఏకకాల తమిళ నిర్మాణం నీదానే ఎన్ పొన్వసంతం సినిమాలతో తమిళంలో గుర్తింపు సాధించిన సమంత ఆపై అంజాన్ (2014), కత్తి (2014) సినిమాలతో తమిళనాట కూడా ప్రముఖ కథానాయికగా ఎదిగింది. 2013లో రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది. సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ యొక్క రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది.[2]

ప్రారంభ జీవితం

[మార్చు]

సమంత 1987 ఏప్రిల్ 28న జోసెఫ్ ప్రభు, నినెట్టే ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో-ఇండియన్ కాగా, తల్లి సిరియన్ మలయాళీ.[3] ఆమె తమిళనాడు చెన్నై పల్లవరం పరిసరాల్లో, ఇద్దరు అన్నలు జొనాథ్, డేవిడ్ లతో కుటుంబంలో చిన్న సంతానంగా పుట్టి పెరిగింది.[4] ఆమె తమిళం, తెలుగు భాషలు రెండింటినీ అనర్గళంగా మాట్లాడగలదు.[5][6] ఆమె హోలీ ఏంజిల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదువుకుంది. ఆ తరువాత, ఆమె స్టెల్లా మారిస్ కాలేజీలో వాణిజ్యంలో డిగ్రీ పూర్తి చేసింది.[5][7] ఆమె అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ముగిసే సమయానికి, మోడలింగ్ లో నిమగ్నమైంది, ముఖ్యంగా నాయిడు హాల్ తో కలిసి పనిచేసింది, దీని ద్వారా ఆమెను మొదటిసారి చిత్రనిర్మాత రవి వర్మన్ గుర్తించాడు.[8]

నటించిన చిత్రాలు

[మార్చు]

తెలుగు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2010 ఏ మాయ చేశావే జెస్సీ 'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి,
'విజేత', సినీ"మా" అవార్డ్ - ఉత్తమ నూతన నటి,
'విజేత', నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్,
'విజేత', టీ.ఎస్.ఆర్ - టీవీ 9 అవార్డ్ 2011 - ఉత్తమ నటి,
పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి
2010 బృందావనం ఇందు
2011 దూకుడు ప్రశాంతి పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
పేర్కొనబడింది, దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్ సైమా- ఉత్తమ నటి
2012 ఈగ బిందు తమిళంలో "నాన్ ఈ" పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది,
'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
'విజేత', టీ.ఎస్.ఆర్ - టీవీ 9 అవార్డ్ 2012 - ఉత్తమ నటి,
'విజేత', సినీ"మా" అవార్డ్ - ఉత్తమ నటి
2012 ఎటో వెళ్ళిపోయింది మనసు నిత్య
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గీత
2013 జబర్‌దస్త్ శ్రేయ
2013 సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అతిథి పాత్ర
2013 అత్తారింటికి దారేది శశి
2013 రామయ్యా వస్తావయ్యా ఆకర్ష
2014 ఆటోనగర్ సూర్య శిరీష
2014 మనం ప్రియ/కృష్ణవేణి
2014 రభస
2017 అ ఆ అనసూయ విజేత, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
పేర్కొనబడింది, దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్ SIIMA - ఉత్తమ నటి
2017 24
2018 మహానటి మధురవాణి మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమలో ప్రజావాణి పత్రిక విలేఖరి.
2018 యూ టర్న్ రచన మిస్టరీ - థ్రిల్లర్ చిత్రం
2018 సీమరాజా
2019 ఓ బేబీ
2020 జాను జానకి దేవి/ జాను సమంత చేసిన జాను పాత్రను తమిళంలో నటి త్రిష చేయబడింది.
2022 యశోద
2022 శకుంతల
2021 పుష్ప: ది రైజ్ నర్తకి "ఊ అంటావా ఊ ఊ అంటావా" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2022 కాతువాకుల రెండు కాదల్ ఖతీజా బేగం తమిళం
యశోద యశోద తెలుగు
2023 శాకుంతలం శకుంతల
ఖుషి ఆరాధ్య

తమిళం

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2010 విన్నైతాండి వరువాయా నందిని అతిథి పాత్ర
2010 బాణ కాథడి ప్రియ పేర్కొనబడింది, విజయ్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి
2011 మాస్కోవిన్ కావేరి కావేరి
2012 నడునిశి నాయగల్ అతిథి పాత్ర
2012 నాన్ ఈ బిందు తెలుగులో "ఈగ" పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది
2013 నీదానే ఎన్ పొన్వసంతం నిత్య ఎటో వెళ్ళిపోయింది మనసు యొక్క ఏకకాల నిర్మాణం,
ఇందులో నానీ పోషించిన వరుణ్ పాత్రను తమిళ నటుడు జీవా పోషించాడు
'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
'విజేత', వికటన్ అవార్డ్ - ఉత్తమ నటి,
'విజేత', విజయ్ అవార్డ్ - ఉత్తమ నటి
2014 అంజాన్ జీవా చిత్రీకరణ జరుగుతున్నది
2014 కత్తి వేణి చిత్రీకరణ జరుగుతున్నది

పెళ్ళి - విడాకులు

[మార్చు]

అక్టోబర్‌ 2017, 6, 7 తేదీలలో సమంత, నాగ చైతన్యల పెళ్లి గోవాలో హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే వారిరువురు 2 అక్టోబరు, 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయాన్ని నాగ చైతన్య  ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.[9]

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (29 November 2024). "సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత." Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "The Family Man season 2 Trailer: Manoj Bajpayee to face Samantha Akkineni this time!". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-05-19. Archived from the original on 2021-05-25. Retrieved 2021-05-25.
  3. Chowdhary, Y. Sunita (12 May 2012). "Away from the rat race". The Hindu. Archived from the original on 29 January 2016. Retrieved 11 November 2012.
  4. "Samantha raised in Pallavaram". Firstpost. Archived from the original on 13 August 2014. Retrieved 14 August 2014.
  5. 5.0 5.1 Y. Sunita Chowdury (1 March 2010). "Poised on the edge". The Hindu. Archived from the original on 26 July 2010. Retrieved 1 March 2010.
  6. Prakash, B (7 March 2010). "It wasn't a liplock really: Samantha". The Times of India. Archived from the original on 8 March 2010. Retrieved 7 March 2010.
  7. "South Star Samantha Found Her Old Report Cards, Posted Them on Facebook". Archived from the original on 16 July 2016. Retrieved 16 July 2016.
  8. "Ravi Varman Interview". Behindwoods. 2008. Archived from the original on 5 June 2012. Retrieved 28 June 2008.
  9. "సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: గర్భంతో ఉన్న ఒక మహిళ ఫొటోతో సమంత ఇన్‌స్టా స్టోరీ." BBC News తెలుగు. Retrieved 2021-10-02.
  10. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 29 June 2020.
  11. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  12. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  13. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.

బయటి లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సమంత పేజీ


"https://te.wikipedia.org/w/index.php?title=సమంత&oldid=4374490" నుండి వెలికితీశారు