సనా గుహలు
సనా గుహలు | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు | 20°57′45″N 71°12′08″E / 20.9624188°N 71.2023475°E |
సనా గుహలు అనేవి మానవ నిర్మిత గుహలు. ఇవి గుజరాత్, సోమనాథ్ లోని ఒక కొండ పైన ఉన్నాయి. ఈ గుహలను సా.పూ 2 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ గుహల్లో అందమైన బొమ్మలు, స్తూపాలూ ఉన్నాయి.[1]
సనా గుహల పేరుతో రెండు చోట్ల గుహలు ఉన్నాయి. ఈ రెండూ గుజరాత్ లోని గిర్ సోమనాథ్ జిల్లాలోనే ఉన్నాయి. ఒకటి, ఊనా తాలూకాలో సనా వంకియా వద్ద ఉన్న సనా దుంగార్ బౌద్ధ గుహలు. ఈ ప్రదేశం ఊనా పట్టణం నుండి 28 కి.మీ. దూరం లోను, తులసి శ్యామ్ నుండి 35 కి.మీ., రజులా నుండి 35 కి.మీ. దూరం లోనూ ఉంది.[2]
రెండవది వెరావల్-సోమనాథ్ ప్రాంతంలో, వెరావల్ నుండి 7 కి.మీ. దూరంలోను, సోమనాథ దేవాలయం నుండి 2 కి., మీ. దూరం లోనూ ఉన్న సనా బౌద్ధ గుహలు. వీటిని సనా గుహలు అని అనరు. ప్రభాస్ పటాన్ లోని ప్రాచీన గుహలు అంటారు. ఈ రెండు గుహల మధ్య దూరం 105 కి.మీ. పేర్లలో ఉన్న సారూప్యత వలన, ఈ రెండు ప్రదేశాల్లో ఉన్న సామీప్యత వలనా ఈ రెండు గుహల గురించిన సమాచారం పత్రికల్లో కలగలిసి పోయింది.
సనా దుంగార్ బౌద్ధ గుహలు
[మార్చు]మెత్తటి రాతిలో తొలిచిన గుహలు ఇక్కడ 62 ఉన్నాయి. స్తూపాలు, చైత్యాలు, పిల్లోలు, బెంచిలు ఉన్నాయి. కొన్ని గుహలు గుమ్మటం ఆకారంలో ఉంటాయి. కొందరు చారిత్రికుల ప్రకారం ఈ గుహల నిర్మాణం సా.పూ. 2 వ శతాబ్దంలో మొదలైంది.[3] సా.శ. 1 వ శతాబ్దంలో వీటిని నిర్మించారని మరి కొందరు అంటారు.[4]
వర్షాకాలంలో ఇవి బౌద్ధ సన్యాసులకు ఆశ్రయం కలిగించాయి. కొండపై అనేక ఎత్తుల్లో వీటిని తొలిచారు. బౌద్ధాన్ని ప్రవచించే సూచికలను ఇక్కడ చూడవచ్చు.
ప్రభాస్ పటాన్ గుహలు
[మార్చు]ప్ర్భాస్ పటాన్ వద్ద ఉన్న బౌద్ధ గుహలు వాస్తు రీత్యా సరళమైనవి. ఇక్కడ రెండే గుహలు ఉన్నాయి. సా.శ. 3-4 శతాబ్దాల నాటి బౌద్ధ విహారంలో భాగంగా వీటిని భావిస్తున్నారు. ఇవి 8.7 మీ. x 9.45 మీ. పొడవు వెడల్పులతో, 2.5 మీ. ఎత్తుతో ఉన్నాయి. గుహలకు బయట చెక్కిన గూళ్ళ వరుస తప్పించి గుహలపై ఎటువంటి అలంకరణలనూ చెక్కలేదు.
మూలాలు
[మార్చు]- ↑ Sagar, Krishna Chandra (1992). Foreign influence on ancient India. New Delhi: Northern Book Centre. p. 150. ISBN 8172110286.
- ↑ Sagar, Krishna Chandra (1992). Foreign influence on ancient India. New Delhi: Northern Book Centre. p. 150. ISBN 8172110286.
- ↑ Tourism Corporation of Gujarat Limited. "Sana Caves". Tourism Corporation of Gujarat Limited. Archived from the original on 31 ఆగస్టు 2014. Retrieved 1 December 2013.
- ↑ Brancaccio, Pia (2010). The Buddhist Caves at Aurangabad: Transformations in Art and Religion. Brill Publishers. p. 63. ISBN 9004185259.