Jump to content

సదర్ దివానీ అదాలత్

వికీపీడియా నుండి

సదర్ దివానీ అదాలత్ (ఉర్దూ: سدار دیوانی عدالت, బెంగాలీ: সদর দেওয়ানি আদালত ) 1772లో బ్రిటిష్ ఇండియాలో వారెన్ హేస్టింగ్స్ చేత కలకత్తాలో రెవిన్యూ వ్యాజ్యాలను పరిష్కరించడానికి స్థాపించబడిన అత్యున్నత న్యాయస్థానం. దీనికి 1780లో, తిరిగి 1793లో బ్రిటిష్ పార్లమెంటు సంస్కరణలు తెచ్చింది. ఈ న్యాయస్థానంలో గవర్నర్ జనరల్, ఈస్ట్ ఇండియా కంపెనీ కౌన్సిల్ సభ్యులు న్యాయాధిపతులుగా ఉండేవారు. వీరు స్థానిక న్యాయమూర్తులు, రెవెన్యూ అధికారుల సహాయంతో పనిచేసేవారు.

పదోత్పత్తి, అర్ధాలు.

[మార్చు]

ఉర్దూ పదాల యొక్క అర్ధాలు

  • సద్దర్ అనే పదం అక్షరాలా "రొమ్ము" ను సూచిస్తుంది. అలాగే ఈ పదానికి ఇంటి ముందు ప్రాంగణం, ప్రభుత్వ ప్రధాన స్థానం, అధ్యక్షత అనే అర్ధాలున్నాయి. ఇది మోఫుసిల్ లేదా దేశం యొక్క అంతర్గత ప్రాంతం అనే భావనకు వ్యతిరేకార్ధం కల పదము.
  • దివాన్ అనేది ఇస్లామిక్ ప్రపంచం అంతటా స్వీకరించబడిన ఒక పురాతన పర్షియన్ పదం, దీని అర్థం శక్తివంతమైన ప్రభుత్వ అధికారి, మంత్రి లేదా పాలకుడు.
  • అద్దౌలత్ పదం, "న్యాయం", "సమానత్వం", న్యాయస్థానాన్ని సూచిస్తుంది. దివానీ అద్దౌలత్ అనే పదం సామాజిక న్యాయస్థానాన్ని సూచిస్తుంది. ఫౌజ్‌దారీ అద్దౌలత్ అనేది క్రిమినల్ న్యాయస్థానాన్ని సూచిస్తుంది.

చరిత్ర

[మార్చు]

భారతదేశంలో హిందూ మతస్థులకు ఆస్థి వ్యవహారాలలో హిందూ చట్టాలను వర్తింపచేయటానికి ఈ న్యాయస్థానం ఏర్పరచబడింది. అప్పటి వరకు హిందువులపై కూడా ముస్లింల నేర చట్టంతో పాటు ముస్లిం ఆస్తి చట్టాలను వర్తింపజేసేవారు. ఈ న్యాయస్థానం ఏర్పడిన తర్వాత కూడా నేర చట్టాలలో ముస్లిం చట్టాలను వర్తింపజేయడం కొనసాగింది.  [full citation needed][full citation needed]

బ్రిటిష్ ఇండియాలోని ప్రతి జిల్లాలో, 500 రూపాయల వరకు ఖచ్చితమైన అధికార పరిధి కలిగిన అధీన రెవెన్యూ న్యాయస్థానాలు స్థాపించబడ్డాయి. ఇందులో న్యాయమూర్తులుగా సంబంధిత జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టరు, రిజిస్ట్రార్ ఉండేవారు. వీరికి సహాయంగా స్థానిక అధికారులు పనిచేసేవారు. 500 రూపాయలకు మించిన కేసులను, సదర్ దివానీ అదాలత్ కు అప్పీలు చేసుకునే అనుమతి ఇవ్వబడింది.  [full citation needed][full citation needed]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • సదర్ ఫౌజ్దారీ అదాలత్
  • భారతదేశ న్యాయవ్యవస్థ

సూచనలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]