సంసద్ భవన్
నూతన పార్లమెంటు భవనం New Parliament House | |
---|---|
నవ్ సంసద్ భవన్ | |
సాధారణ సమాచారం | |
స్థితి | భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించాడు |
రకం | శాసనసభ భవనం |
ప్రదేశం | న్యూఢిల్లీ |
చిరునామా | ప్లాట్ నెం. 118, సంసద్ మార్గ్ |
దేశం | భారతదేశం |
భౌగోళికాంశాలు | 28°37′02″N 77°12′36″E / 28.61722°N 77.21000°E |
సంచలనాత్మక | 2020 అక్టోబరు 1 |
నిర్మాణ ప్రారంభం | 2020 డిసెంబరు 10 |
పూర్తి చేయబడినది | మే 2023 |
ప్రారంభం | 2023 మే 28 |
వ్యయం | ₹862 crore (US$110 million) |
క్లయింట్ | సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) |
యజమాని | భారత ప్రభుత్వం |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | 4 |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | బిమల్ పటేల్ |
ఆర్కిటెక్చర్ సంస్థ | హెసీపి డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ |
ప్రధాన కాంట్రాక్టర్ | టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, టాటా గ్రూప్ |
ఇతర విషయములు | |
సీటింగు సామర్థ్యం | 1,272 (లోక్‌సభ : 888 రాజ్యసభ : 384) |
నూతన పార్లమెంటు భవనం, అనేది భారతదేశం సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా న్యూఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం. ఇది ప్రస్తుత భారత పార్లమెంటు భవనానికి ఎదురుగా ఉంది. కొత్త పార్లమెంటు భవనానికి 2020 డిసెంబరు 10న భారత ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసాడు.[1]
1927లో నిర్మించిన ప్రస్తుత పార్లమెంటు భవనంలో నేటి అవసరాలకు తగినంత స్థలం లేకపోవడంతో పాటు తగినన్ని సౌకర్యాలు కొరవడడంతో నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదం తెలిపాయి.
వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని 2023 సెప్టెంబరు 19న నూతన భవనంలో పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. పాత భవనంలోని సెంట్రల్ హాల్ నుంచి పాదయాత్రగా ప్రధాని నరేంద్రమోదీతో సహా సభ్యులందరూ భారత పార్లమెంటు కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా అడుగుపెట్టారు. భారత జాతీయగీతం పాడిన తర్వాత లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సెంట్రల్ హాల్‌లో ఉండే రాజ్యాంగ పుస్తకాన్ని కూడా నూతన పార్లమెంటుకు తరలించారు.[2]
నేపథ్యం
[మార్చు]సుమారు 100 ఏళ్ల నాటి నిర్మాణం కావడంతో ప్రస్తుత పార్లమెంటు భవనంలో పలు సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా చాలా పాతభవనం కారణంగా నిర్మాణ సమస్యలతో పాటు సభ్యులు, వారి సిబ్బందికి స్థలం సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.[3] అందుకని 2010 ప్రారంభంలో ప్రస్తుత కాంప్లెక్స్ స్థానంలో కొత్త పార్లమెంటు భవనం కోసం ప్రతిపాదనలు వెలువడ్డాయి. ప్రస్తుత భవనానికి అనేక ప్రత్యామ్నాయాలను సూచించేందుకు 2012లో అప్పటి స్పీకర్ మీరా కుమార్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే, పాత భవనం భారతదేశ జాతీయ వారసత్వానికి ముఖ్యమైందిగా పరిగణించబడుతుంది. కావున ఈ నిర్మాణాన్ని రక్షించడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి.[4]
ప్రారంభోత్సవం
[మార్చు]కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దీనిని 2023 మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించాడు.[5][6] అలాగే సెంగోల్ను లోక్‌సభ స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ కుర్చీకి కుడివైపున ప్రతిష్ఠించాడు.[7][8] అంతేకాకుండా భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చి 75 సంవత్సరములు పూర్తీ చేసుకున్న సందర్భముగా రూ. 75 స్మారక నాణేన్ని కూడా విడుదల చేసాడు.[9] త్రిభుజాకారంలో ఉన్న కొత్తభవనం ముద్రించి ఉన్న స్టాంపు, ప్రత్యేక పోస్టల్ కవర్ ని కూడా విడుదల చేసాడు.
సంయుక్త పార్లమెంటు సమావేశం నిర్వహించే కొత్త పార్లమెంటు భవనంలో ఇకమీదట అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి.రానున్నాయి.
కాలక్రమ వివరాలు
[మార్చు]- 2019 సెప్టెంబరు: సెంట్రల్ విస్టా అవెన్యూ పునరాభివృద్ధి మాస్టర్ ప్లాన్‌ను భారత ప్రభుత్వం రూపొందించింది.[10]
- 2020 సెప్టెంబరు: టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ CPWD ద్వారా ₹862 కోట్లకు కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును చేజిక్కించుకుంది.
- 2020 అక్టోబరు : అహ్మదాబాద్‌కు చెందిన HCP డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్కిటెక్చరల్ కన్సల్టెన్సీ పనిని గెలుచుకుంది.
- 2020 డిసెంబరు 10: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసాడు.
- 2021 డిసెంబరు: కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ డిసెంబరు 2న కొనసాగుతున్న పార్లమెంట్ సెషన్‌లో కొత్త పార్లమెంట్ భవనం భౌతిక పురోగతి 35% వద్ద ఉందని, 2022 అక్టోబరు నాటికి పూర్తి చేయాలని షెడ్యూల్ చేయబడింది.
- 2022 జూలై 11: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనం పైన జాతీయ చిహ్నం విగ్రహాన్ని ఆవిష్కరించాడు.
- 2022 ఆగస్టు 4: కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు 70% పూర్తయ్యాయని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ లోక్‌సభలో తెలిపారు.
- 2022 ఆగస్టు 28: కొత్త పార్లమెంట్ ప్రధాన నిర్మాణం పూర్తయిందని టాటా ప్రాజెక్ట్ CEO ప్రకటించాడు.[11]
- 2023 జనవరి 5: లోక్‌సభ సెక్రటేరియట్ కొత్త పార్లమెంటు భవనాన్ని యాక్సెస్ చేయడానికి ఎంపీల కోసం కొత్త గుర్తింపు కార్డులను సిద్ధం చేయడం ప్రారంభించింది. కొత్త భవనంలో వినియోగించే దృశ్యశ్రవణ పరికరాలపై కూడా ఎంపీలకు శిక్షణ ఇస్తున్నారు.[12]
- 2023 జనవరి 10: కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జనవరి చివరి నాటికి పూర్తి అవుతుందని అంచనా వేశాయి ప్రభుత్వ వర్గాలు.[13]
- 2023 జనవరి 31: CPWD అధికారిక సమాచారం మేరకు దాదాపు రూ. 24.65 కోట్లతో కొత్త పార్లమెంట్ భవనం యాంత్రిక గృహ నిర్వహణ కోసం బిడ్లను ఆహ్వానించింది.[14]
- 2023 మార్చి 30: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించాడు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను పరిశీలించడంతో పాటు గంటకు పైగా ఆయన వివిధ పనులను పరిశీలించాడు.[15]
- 2023 మే 16: కొత్త పార్లమెంట్ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెలాఖరులోగా ఇది సిద్ధమయ్యే అవకాశం ఉందని సమాచారం.[16]
- 2023 మే 18: దేశ రాజధానిలో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.[17]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "కొత్త పార్లమెంటు భవనానికి డిసెంబర్ 10న ప్రధాని మోదీ శంకుస్థాపన: స్పీకర్ ఓం బిర్లా వెల్లడి". BBC News తెలుగు. Retrieved 2023-03-31.
- ↑ "Indian Parliament: భారత పార్లమెంటు చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం | new chapter begins in history of indian parliament". web.archive.org. 2023-09-19. Archived from the original on 2023-09-19. Retrieved 2023-09-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Delhi may see a new Parliament building". The Times of India. 13 July 2012. Archived from the original on 15 July 2012. Retrieved 13 December 2013.
- ↑ Firstpost (13 July 2012). "Speaker sets up panel to suggest new home for Parliament". Firstpost. Retrieved 15 August 2012.
- ↑ "Prime Minister to inaugurate new Parliament building on May 28". The Hindu (in Indian English). 2023-05-18. ISSN 0971-751X. Retrieved 2023-05-22.
- ↑ "New Parliament Inauguration: We have 25 years of 'amrit kaal khand' to make India a developed nation, says PM Modi". The Economic Times. Retrieved 2023-05-29.
- ↑ "New Delhi: Sengol has historical background from various kingdoms of Tamil Nadu says Malai temple President | News - Times of India Videos". The Times of India. Retrieved 2023-05-27.
- ↑ Online |, E. T. (2023-05-28). "PM Modi installs historic 'Sengol' in the new Parliament building's Lok Sabha". The Economic Times. Retrieved 2023-05-29.
- ↑ "PM Modi releases Rs 75 coin on new Parliament inauguration day: Features, how to get it". The Indian Express. 2023-05-28. Retrieved 2023-05-29.
- ↑ ""Rs 20,000 crore on Central Vista amid pandemic?" Cente dispels myths". NDTV. 6 June 2021.
- ↑ PTI (2022-08-28). "Main structure of new Parliament completed, finishing work in progress: Tata Projects CEO". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-08-28.
- ↑ Srivastava, Ritesh (2021-05-13). "What is 'Central Vista' and why it is being opposed; Zee explains the controversial project". Zee News. Retrieved 6 June 2021.
- ↑ "Construction of new Parliament building expected to be completed by January end". mint. 2023-01-09. Retrieved 2023-01-10.
- ↑ PTI; PTI (2023-01-30). "CPWD invites bids for mechanised housekeeping of new Parliament building". ThePrint. Retrieved 2023-01-31.
- ↑ "PM Modi reviews new parliament construction during surprise visit". Hindustan Times. 2023-03-30. Retrieved 2023-03-30.
- ↑ PTI (2023-05-16). "New Parliament building getting final touches, no official word yet on inauguration". ThePrint. Retrieved 2023-05-17.
- ↑ "Parliament: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు | pm modi to inaugurate new parliament building on may 28". web.archive.org. 2023-05-19. Archived from the original on 2023-05-19. Retrieved 2023-05-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)