Jump to content

సంగీర్తన విపిన్

వికీపీడియా నుండి
సంగీర్తన విపిన్
జననం (2002-11-06) 2002 నవంబరు 6 (వయసు 22)
జాతీయతబారతీయురాలు
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2023 - ప్రస్తుతం

సంగీర్తన విపిన్ (జననం 2002 నవంబర్ 6) కేరళకు చెందిన భారతీయ నటి.

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆమె కేరళలోని కాసర్‌గోడ్ నీలేశ్వర్‌లో విపిన్, సీమ దంపతులకు 2002 నవంబరు 6న జన్మించింది. చదువు కొనసాగిస్తూనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన ఆమె సినిమాల్లో నటిస్తూ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేస్తోంది.

కెరీర్

[మార్చు]

మలయాళంలో హైగుటా సినిమాతో నటనలో కెరీర్ మొదలుపెట్టింది. నరకాసుర (2023) చిత్రంతో తెలుగు సినిమాలోకి అరంగేట్రం చేసి జనక అయితే గనక (2024)తో ఆమె గుర్తింపు తెచ్చుకుంది.[1][2] ఆ తరువాత, తెలుగులో ఆపరేషన్ రావణ్, అసుర గణ రుద్ర సినిమాలు,[3] కాడువెట్టి అనే తమిళ సినిమా చేసింది.

మూలాలు

[మార్చు]
  1. Namaste Telangana (11 October 2023). "అబ్బురపరిచే నరకాసుర". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  2. Chitrajyothy (4 October 2024). "ఆ సెంటిమెంట్‌ ఫాలో అవుతున్నా". Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.
  3. NTV Telugu (18 July 2024). "వారం ముందే రాబోతున్న "ఆపరేషన్ రావణ్"." Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.

బయటి లింకులు

[మార్చు]