సంగీత పాఠశాల

సంగీత పాఠశాల అనేది సంగీతానికి సంబంధించిన అన్ని కోణాలపై అధ్యయనం,శిక్షణ, పరిశోధనలలో ప్రత్యేకతలు కలిగి బోదించే లేదా నేర్పే సంస్థ.దీనిని సంగీత కళాశాల లేదా సంగీత అకాడమీ లేదా కన్జర్వేటరి (అమెరికన్ ఆంగ్లంలో) లేదా కన్జర్వేటోరియం (ఆస్ట్రేలియన్ ఆంగ్లంలో) లేదా కన్జర్వేటోయిర్ అని కూడా పిలుస్తారు.ఇది సంగీతాన్ని వృత్తిగా భావించే యువతకు సంగీత వాద్యాలను ఎలా వాయించాలి, గానం ఎలా చేయాలి, సంగీతాన్ని ఎలా కూర్చాలి, సంగీత శాస్త్రం, సంగీత చరిత్ర, సంగీతం సిద్ధాంతాలను ఎలా అధ్యయనం చేయాలో ఇక్కడ నేర్పుతారు.ఒక రకంగా చెప్పాలంటే ఇది ఉన్నత విద్య కోవకు చెందుతుంది. సంగీతం, సంగీత విద్య వేలాది సంవత్సరాలుగా ఉనికిలో ఉన్నప్పటికీ ప్రారంభ చరిత్ర ఊహాజనితంగానే మిగిలింది.[1]చరిత్రకారులు, చరిత్రను రికార్డు చేయడం ప్రారంభించినప్పుడు కూడా, సంగీత విద్య కంటే సంగీతం చాలా తరచుగా ప్రస్తావించబడింది.
చరిత్ర
[మార్చు]
పాశ్చాత్త దేశాలలో
[మార్చు]
సంగీత పాఠశాలకు మారుపేరుగా పూర్వం ఆంగ్లంలో ఉద్బవించిన కన్సర్వేటరీ పదం సంగీతంలో, సంగీత ప్రదర్శన, సంగీత కూర్పులో నేర్పే విద్య కోసం ఏర్పడిన సంస్థకు వాడబడింది.ఈ పదం ఇటాలియన్ కన్జర్వేటోరియో నుండి ఉద్భవించింది.ఇది పునరుజ్జీవనోద్యమ కాలంలో, అంతకు ముందు ఒక రకమైన అనాథాశ్రమాన్ని తరచుగా ఆసుపత్రికి అనుసంధానించబడిందని సూచిస్తుంది. (అందువల్ల ఈ పదం అటువంటి సంస్థలకు కూడా వర్తిస్తుంది).నేపాల్ లోని అబ్బాయిలకు, వెనిస్ లోని అమ్మాయిలకు సంగీత భోధన ఇవ్వటానికి కన్సర్వేటరీలు రాష్ట్ర ఖర్చుతో స్థాపించబడ్డాయి. ఈ విధంగా కన్జర్వేటోరీలు ఆచరణాత్మక సంగీతంలో శిక్షణ కోసం అమర్చిన మొదటి లౌకిక సంస్థలు. మధ్య యుగంలో గాయక పాఠశాలలు, చర్చిలతో జతచేయబడ్డాయి. విశ్వవిద్యాలయాలలో సంగీతం గణితంతో పోల్చదగిన సైద్ధాంతిక విషయంగా పరిగణించారు.ఓస్పెడేల్ డెల్లా పియెట్ వెనిస్ లో 1346 లో స్థాపించబడిన,.నేపాల్ లో కన్జర్వేటోరియో డీ పోవేరి డి గెసే క్రిస్టో 1589 లో స్థాపించబడినటువంటి సంస్థలు శిక్షణను అందించాయి.17 , 18 వ శతాబ్దపు ఇటాలియన్ ఒపెరాలోని ప్రముఖ స్వరకర్తలలో అధ్యాపక సభ్యులుగా ఎక్కువమంది ఉన్నారు.[2]
భారతదేశంలో
[మార్చు]మద్రాస్ లలిత కళల చరిత్రలో సంగీత పాఠశాలకు మారుపేరుగా భావించే మ్యూజిక్ అకాడమీ ఒక మైలురాయిలాంటిది.ఇది 1927 డిసెంబరులో మద్రాసులో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సెషన్ శాఖలో ఉద్భవించింది.దానితో పాటు ఒక సంగీత సమావేశం జరిగింది.చర్చల సమయంలో, మ్యూజిక్ అకాడమీ ఆలోచన ఉద్భవించింది.1928 ఆగస్టు 18 న సర్ సిపి రామస్వామి అయ్యర్, ఎస్ప్లానేడ్ లోని వైఎంసిఎ ఆడిటోరియంలో ప్రారంభించారు.ఇది కర్ణాటక సంగీతానికి ప్రమాణాన్ని నిర్ణయించే సంస్థగా భావించబడింది.ఈప్రక్రియలో మ్యూజిక్ అకాడమీ 1929 లో సంగీతంపై వార్షిక సమావేశాలను నిర్వహించడం ప్రారంభించింది.ఇది ప్రపంచంలోని అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమాలలో ఒకటైన మద్రాసు, డిసెంబరు సంగీత ఉత్సవానికి నాంది పలికింది.[3]
నిర్వచనం
[మార్చు]సంగీత పాఠాలు అనేవి సంగీతం నేర్చుకోవటంలో, వాద్యాలు ఉపయోగించటంలో, గానం చేయడంలో ఇచ్చే ఒక రకమైన అధికారిక సూచనలు ఇచ్చే సంస్థగా చెప్పుకోవచ్చు.[4]
బోధన
[మార్చు]సాధారణంగా, సంగీత పాఠాలు తీసుకునే విద్యార్థి వారాలు లేదా సంవత్సరాల వ్యవధిలో 30 నిమిషాల నుండి ఒక గంట వరకు ఒకరితో ఒకరు శిక్షణా సెషన్ల కోసం సంగీత ఉపాధ్యాయుడిని కలుస్తారు.స్వర పాఠాల కోసం, విద్యార్థులను ఎలా కూర్చోవాలి లేదా ఎలా నిలబడాలి, ఊపిరి ఎలా పీల్చుకోవాలి, మంచి స్వర స్వరం కోసం తల, ఛాతీ, నోటిని ఎలా ఉంచాలో ఉపాధ్యాయులు వివరిస్తూ చూపిస్తారు.వాయిద్య పాఠాల కోసం, పరికరంతో ఎలా కూర్చోవాలి లేదా నిలబడాలి, వాద్యం ఎలా పట్టుకోవాలి, వాద్యం నుండి స్వరాలు, శబ్దాలను ఉత్పత్తి చేయడానికి వేళ్లు, ఇతర శరీర భాగాలను ఎలా మార్చాలో ఉపాధ్యాయులు చూపిస్తారు.సంగీత ఉపాధ్యాయులు సాంకేతిక వ్యాయామాలు, సంగీత సాధనకు అవసరమైన మెళుకువలు,ఇతర కార్యకలాపాలను గురించి విద్యార్థులకు బోదించి వారి సంగీత నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడతారు.చాలా సంగీత పాఠాలు ఒకదానికొకటి అయితే, కొంతమంది ఉపాధ్యాయులు ఇద్దరు నుండి నలుగురు విద్యార్థుల వరకు సమూహాలుగా ఏర్పరిచి బోధిస్తారు.ప్రాథమిక బోధన కోసం, పియానో , ఎకౌస్టిక్ గిటార్ వంటి పరికరాలు పెద్ద సమూహ పాఠశాలలో కొన్ని వాద్యాలు ద్వారా బోధిస్తారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Wallin, Nils Lennart; Merker, Björn; Brown, Steven (2001). The Origins of Music (in ఇంగ్లీష్). MIT Press. ISBN 978-0-262-73143-0.
- ↑ "Conservatory | musical institution". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-08-14.
- ↑ "History – Music Academy". musicacademymadras.in. Retrieved 2020-08-14.
- ↑ 4.0 4.1 "What does music lessons mean?". www.definitions.net (in ఇంగ్లీష్). Archived from the original on 2017-08-21. Retrieved 2020-08-14.