సంగమేశ్వరాలయం సంగం (నెల్లూరు జిల్లా)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
నెల్లూరు జిల్లా సంగంలోని పెన్నానది ఒడ్డున కామాక్షితాయి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటి. దక్షిణ కాశీగా పిలువబడే ఈ ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది. ఈ ఆలయంలో శివలింగానికి భక్తులే స్వయంగా పూజలు చేస్తారు.
స్థల పురాణం
[మార్చు]స్థల పురాణం ప్రకారం పరుశురాముడు తన తండ్రి జమదగ్నిమహర్షి ఆజ్ఞ మేరకు తన తల్లి రేణుకాదేవిని సంహరించిన తరువాత ఆ పాప పరిహారం కోసం సంగంలోని సంగమ స్థానంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. దాంతో ఈ ఆలయంలోని సంగమేశ్వరుడిని దర్శిస్తే సర్వపాపహరణం అనే నమ్మకం భక్తుల్లో ఉంది.
బ్రహ్మోత్సవాలు 2022
[మార్చు]ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. సంగం పెన్నానది ఒడ్డున ఉన్న శ్రీ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు 2022 ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 15 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో శ్రీ కామాక్షిదేవీ సమేత సంగమేశ్వరస్వామి ప్రతి నిత్యం రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.[1]
పెన్నానది
[మార్చు]త్రివేణి సంగమంగా ప్రాచుర్యం కలిగిన పెన్నానది, బీరాపేరు, బోగ్గేరులి ఇచ్చట కలుస్తున్నందున దీన్ని త్రివేణి సంగమంగా కొంత మంది అభివర్ణిస్తుంటారు. అదే సంగం అయినది. 1886లో నిర్మించబడిన పెన్నా ఆనకట్ట ద్వారా కనిగిరి రిజర్వాయర్ కు, కావలి, కనపూరు కాల్వలకు నీటి సౌకర్యం ఒనకూరుతున్నది.
మూలాలు
[మార్చు]- ↑ "నేటి నుంచి సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-04. Retrieved 2022-04-04.