షేక్ హసన్ సాహెబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షేక్ హసన్ సాహెబ్
జననం1 జనవరి 1928
మరణం24 జూన్‌ 2021
జాతీయత భారతదేశం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నాదస్వర విద్యాంసుడు
పిల్లలుషేక్‌ ఖాసీంబాబు
సన్మానాలుపద్మశ్రీ

షేక్‌ హసన్‌ సాహెబ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాదస్వర విద్యాంసుడు. ఆయనకు 2022లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.[1]

కుటుంబ నేపథ్యం

[మార్చు]

షేక్‌ హసన్‌సాహెబ్‌ ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గోసవీడు గ్రామంలో జన్మించాడు. ఆయన తన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన సన్నాయి వాయిద్య కళను పుణికిపుచ్చుకొని గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో షేక్‌ చినమౌలానా, ప్రకాశం జిల్లా కరువాదికి చెందిన షేక్‌ చినమౌలానా వద్ద శిక్షణ అందుకున్నాడు.

వృత్తి జీవితం

[మార్చు]

షేక్‌ హసన్‌ సాహెబ్‌ 1954లో ఆలిండియా రేడియోలో నాదస్వర విద్వాంసుడిగా చేరాడు. ఆయన 1950లో భద్రాచలం ఆలయంలో దేవస్థాన తొలి నాదస్వర ఆస్థాన విద్వాంసుడిగా చేరి 1996 వరకు నాదస్వర సుప్రభాత సేవతో భద్రాద్రి సీతారాముల వారికి సేవలందించాడు. షేక్‌ హసన్‌ సాహెబ్‌ యాదాద్రి ఆలయంలోనూ పని చేశాడు.[2][3]

పురస్కారాలు

[మార్చు]
  • 1962లో స్వర్ణ కంకణంతో సన్మానం
  • 2007లో త్యాగరాజ పురస్కారం
  • 2022లో పద్మశ్రీ పురస్కారం[4]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (26 January 2022). "జిల్లాకు పద్మం". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
  2. Sakshi (26 January 2022). "తెలుగు పద్మాలకు.. జేజేలు". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
  3. Andhrajyothy (26 January 2022). "సుస్వర నాదం!". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
  4. Andhrajyothy (26 January 2022). "తెలుగు వెలుగులకు పద్మాలు". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.