షెహబాజ్ షరీఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షెహబాజ్ షరీఫ్
షెహబాజ్ షరీఫ్


జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత
పదవీ కాలం
20 ఆగష్టు 2018 – 10 ఏప్రిల్ 2022
రాష్ట్రపతి మామునూన్ హుస్సేన్
ఆరిఫ్ అల్వి
ముందు ఖుర్షిద్ అహ్మద్ షా

జాతీయ అసెంబ్లీ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
13 ఆగష్టు 2018
నియోజకవర్గం ఎన్.ఏ -132 (లాహోర్-X)

పంజాబ్ ముఖ్యమంత్రి
పదవీ కాలం
8 జూన్ 2013 – 8 జూన్ 2018
గవర్నరు మొహమ్మద్ సర్వర్
మాలిక్ ముహమ్మద్ రఫీక్ రజ్వానా ]]
ముందు నజం సేథీ (ఆపద్ధర్మ)
తరువాత హాసన్ ఆస్కారి రిజ్వి (ఆపద్ధర్మ)
పదవీ కాలం
8 జూన్ 2008 – 26 మార్చి 2013
గవర్నరు మఖ్డోం అహ్మద్ మెహమూద్
లతీఫ్ ఖోసా
సల్మాన్ తసీర్
ముందు దోస్త్ ముహమ్మద్ ఖోసా
తరువాత నజం సేథీ
పదవీ కాలం
20 ఫిబ్రవరి 1997 – 12 అక్టోబర్ 1999
గవర్నరు షాహిద్ హమీద్
జుల్ఫీకర్ అలీ ఖోసా
ముందు మైన్ ముహమ్మద్ ఆఫ్జాల్ హయత్ (ఆపద్ధర్మ)
తరువాత చౌధరీ పెర్వైజ్ ఇలాహి (2002)

అధ్యక్షుడు,  పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
13 మార్చి 2018
ముందు నవాజ్ షరీఫ్
పదవీ కాలం
2009 – 2011
ముందు నిసార్ అలీ ఖాన్
తరువాత నవాజ్ షరీఫ్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-09-23) 1951 సెప్టెంబరు 23 (వయసు 73)
లాహోర్, పాకిస్తాన్
రాజకీయ పార్టీ  పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ - నవాజ్‌
జీవిత భాగస్వామి
బేగం నుస్రత్
(m. 1973)
,
టెహ్మినా దూరాని
(m. 2003)
సంతానం 4

షెహబాజ్‌ షరీఫ్‌ పాకిస్తాన్ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ -నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) అధ్యక్షుడు, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు. షెహబాజ్‌ షరీఫ్‌ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ పార్టీ తరఫున జాతీయ అసెంబ్లీలో 2018 ఆగస్టు 20 నుండి 2022 ఏప్రిల్ 10 వరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించాడు. ఆయన పంజాబ్ ప్రావిన్స్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

పాకిస్థాన్‌లో 22 ఏప్రిల్ 10న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ఖాన్‌ పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో సాధారణ మెజారిటీ సాధించలేకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో పాక్ ప్రధానిగా ప్రతిపక్షాలు బలపర్చిన పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ పార్టీ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ పాక్‌ కొత్త ప్రధానిగా 22 ఏప్రిల్ 11న ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

షెహబాజ్‌ షరీఫ్‌ 1951 సెప్టెంబరు 23న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు. ఆయన లాహోర్ ప్రభుత్వ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. షాబాజ్ షరీఫ్ కుటుంబం భారత్ నుంచి వచ్చి పాకిస్థాన్ లో స్థిరపడ్డారు, అతని తండ్రి ముహమ్మద్ షరీఫ్ వ్యాపారవేత్త. వ్యాపారం నిమిత్తం తరచూ కాశ్మీర్ వెళ్లేవాడు. తరువాత అతని కుటుంబం పంజాబ్ లోని అమృత్సర్ లో స్థిరపడింది. బ్రిటీష్ రాజ్ నుండి స్వాతంత్ర్యం పొందిన సమయంలో 1947లో భారతదేశం పాకిస్తాన్ విభజించబడినప్పుడు, ముహమ్మద్ షరీఫ్ తన కుటుంబంతో లాహోర్ లో స్థిరపడ్డారు.

రాజకీయ జీవితం

[మార్చు]

షెహబాజ్‌ షరీఫ్‌ 1988లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1988 నుండి 1990 వరకు పంజాబ్ శాసనసభ సభ్యుడు, షాబాజ్ 1990 నుండి 1993 వరకు జాతీయ అసెంబ్లీ సభ్యుడు గెలిచాడు. షెహబాజ్‌ షరీఫ్‌ పంజాబ్ ప్రావిన్స్ (పాకిస్తాన్) కి 1997 ఫిబ్రవరిలో తొలిసారి పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1999 అక్టోబరు వరకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. షెహబాజ్ షరీఫ్ ను 1999లో అప్పటి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటు తర్వాత, ఖైదు చేయబడ్డాడు. తరువాత ఆయ‌నను సౌదీ అరేబియాకు బహిష్కరించారు. ష‌రీఫ్ 2007లో పాకిస్థాన్ కు తిరిగి వచ్చి 2008 జూన్ నుండి రెండవసారి, తరువాత 2013 నుండి 2018 వరకు మూడవసారి పంజాబ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశాడు.

షెహబాజ్‌ షరీఫ్‌ 2017లో జాతీయ రాజకీయాల్లోకి వచ్చి పనామా పేపర్లకు సంబంధించిన కేసులో ఆయ‌న సోద‌రుడు నవాజ్ షరీఫ్ దోషిగా తేల‌డంతో 2018 ఫిబ్రవరిలో  పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

మనీలాండరింగ్ ఆరోపణలు

[మార్చు]

షెహబాజ్ షరీఫ్ 2019 డిసెంబరులో, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయనను, అతని కుమారుడు హంజాకు చెందిన 23 ఆస్తులను స్తంభింపజేసింది. అదే కేసులో 2020 సెప్టెంబరులో అతనిని ఎన్ఎబి అరెస్టు చేయగా, 2021 ఏప్రిల్లో మనీలాండరింగ్ కేసులో లాహోర్ హైకోర్టు అతన్ని బెయిల్‌పై విడుదల చేసింది.

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (11 April 2022). "పాక్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌!" (in ఇంగ్లీష్). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  2. TV9 Telugu (10 April 2022). "పాకిస్తాన్‌ ప్రధానిగా షాబాజ్ షరీఫ్.. రేపు ప్రమాణ స్వీకారం." Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)