షిహాన్ హుస్సేని
షిహాన్ హుస్సేని | |
---|---|
![]() | |
జననం | |
మరణం | 2025 మార్చి 25[1] | (వయసు: 60)
వృత్తి | నటుడు , కరాటే నిపుణుడు, శిల్పి |
క్రియాశీల సంవత్సరాలు | 1986 – 2025 |
కుటుంబం | ఇషాక్ హుస్సేని (సోదరుడు) |
షిహాన్ హుస్సేని భారతదేశానికి చెందిన కరాటే నిపుణుడు, నటుడు. ఆయన 1986లో కమల్ హాసన్ నటించిన పున్నగై మన్నన్ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసి ఆ తర్వాత రజనీకాంత్ నటించిన వేలైకరన్, బ్లడ్ స్టోన్ వంటి తమిళ సినిమాలలో నటించాడు. షిహాన్ హుస్సేని విజయ్ నటించిన బద్రి సినిమాలో ఆయన కరాటే కోచ్ పాత్ర పోషించాడు. ఆయన నటించిన చివరి సినిమా విజయ్ సేతుపతి నటించిన కాతువాకుల రెండు కాదల్,యు చెన్నై సిటీ గ్యాంగ్ స్టర్స్.
షిహాన్ హుస్సేని 2015 ఫిబ్రవరి 23న అక్రమ ఆస్తుల కేసులో జైలులో ఉన్న తన అమ్మ (జయలలిత) రాబోయే ఎన్నికల్లో గెలవాలని ప్రార్థిస్తూ 'అమ్మ' ఉన్న టీ-షర్టు ధరించి హుస్సేని తనను తాను శిలువ వేసుకున్నాడు.[2]
హుస్సేని 400 మందికి పైగా ఆర్చర్లకు శిక్షణ ఇచ్చాడు, 1979లో రికర్వ్ విల్లును, 1980లో కాంపౌండ్ విల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఆధునిక విలువిద్యను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించాడు.[3][4]
షిహాన్ హుస్సేని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చాడు.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
1986 | పున్నగై మన్నన్ | శ్రీలంక తమిళం
తెలుగులో డాన్స్ మాస్టర్ |
|
1987 | వేలైకరన్ | ||
1988 | బ్లడ్‌స్టోన్ | ఇంగ్లీష్ సినిమా | |
1988 | పరవైగల్ పలవితం | ||
1990 | ఉన్నై సొల్లి కుట్రమిల్లై | ధర్మరాజ్ | |
1993 | వేదన్ | ||
1997 | మై ఇండియా | ||
2001 | బద్రి | వెట్రి కోచ్ | |
2022 | కాతు వాకుళ రెండు కాదల్ | తెలుగులో కణ్మనీ రాంబో ఖతీజా
కరాటే శిక్షకుడు |
[5] |
2024 | చెన్నై సిటీ గ్యాంగ్‌స్టర్స్ |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | ఛానల్ | మూ |
---|---|---|---|---|---|---|
2022 | వెల్లుమ్ తిరమై | న్యాయమూర్తి | తమిళం | రియాలిటీ షో | కలర్స్ తమిళం |
మరణం
[మార్చు]షిహాన్ హుస్సేని రక్త క్యాన్సర్‌కు చికిత్స బాధపడుతూ మార్చి 25న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.[6][7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Karate expert Shihan Hussaini passes away after battling blood cancer". The Economic Times. 2025-03-25. Retrieved 2025-03-25.
- ↑ "The man who crucified himself for Jayalalithaa is starting a political party called 'AMMA'" (in ఇంగ్లీష్). The News Minute. 24 December 2016. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "Rs 5L given to ailing archery coach Hussaini" (in ఇంగ్లీష్). The New Indian Express. 17 March 2025. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "T.N. Govt. extends financial aid to ailing archery coach Shihan Hussaini" (in Indian English). The Hindu. 16 March 2025. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "This quirky rom-com has potential, but not potency" (in ఇంగ్లీష్). The New Indian Express. 30 April 2022. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "నటుడు, పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుసైని కన్నుమూత". Eenadu. 25 March 2025. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "Actor, karate expert Shihan Hussaini dies in Chennai after battling blood cancer" (in ఇంగ్లీష్). India Today. 25 March 2025. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "Tamil actor, martial artist Shihan Hussaini dies of blood cancer in Chennai, donated body for medical research". Hindustan Times. 25 March 2025. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.