Jump to content

షామ్ లాల్ శర్మ

వికీపీడియా నుండి
షామ్ లాల్ శర్మ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
నియోజకవర్గం జమ్మూ ఉత్తర

వ్యక్తిగత వివరాలు

జననం 1960
రాజకీయ పార్టీ బీజేపీ
వృత్తి రాజకీయ నాయకుడు

షామ్ లాల్ శర్మ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జమ్మూ ఉత్తర నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

షామ్ లాల్ శర్మ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2014 శాసనసభ ఎన్నికల్లో అఖ్నూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజీవ్ శర్మ చేతిలో 9380 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ యూనిట్ సీనియర్-వైస్ ప్రెసిడెంట్ పని చేసి 2018లో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాడు.[2] ఆయన 2024 లోక్‌సభ ఎన్నికలలు ముందు మార్చి 30న 2019లో బీజేపీలో చేరాడు.

షామ్ లాల్ శర్మ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జమ్మూ ఉత్తర నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ కుమార్ సధోత్రపై 27363 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. షామ్ లాల్ శర్మకు 47219 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ కుమార్ సధోత్రకి 19856 ఓట్లు వచ్చాయి.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Hindustantimes (10 September 2024). "BJP Jammu North candidate Sham Lal has assets worth crores, fleet of cars". Retrieved 23 October 2024.
  3. The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
  4. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Jammu Nort". Retrieved 19 October 2024.
  5. "Jammu North Assembly Election Results 2024: BJP's Sham Lal Sharma defeats JKNC's Ajay Kumar Sadhotra with 20797 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.