షాబాన్
షాబాన్ ఇస్లామీయ కేలండర్ లో 8వ నెల.
ప్రాముఖ్యత
[మార్చు]పన్నెండు నెలల్లో షాబాన్ నెలకు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే షాబాన్ నెలని మహాప్రవక్త ముహమ్మద్(స) గారు తన నెలగా పేర్కొన్నారు. హజ్రత్ అబూ హురైరా(రజి) ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త(స) గారు ఒక సందర్భంలో ఇలా ఉపదేశించారు : షాబాన్ నా నెల. రజబ్ అల్లాహ్ నెల, రంజాన్ నా జాతి నెల. షాబాన్ నెల మానవులను పాపాల నుండి దూరం చేస్తుంది, రమజాన్ నెల పరిశుభ్రం చేస్తుంది.
షాబాన్ నెల గురించి మహాప్రవక్త(స) గారు ఒక నెల ముందు నుంచే ప్రార్థించేవారు. ‘ఓ అల్లాహ్! మాకు రజబ్, షాబాన్ నెలలో సమృద్ధిని, శుభాలను ప్రసాదించు. రమ జాన్ నెల వరకు చేర్పించు’ అని వేడుకునే వారు. మరో హదీసులో ఈ విధంగా ప్రస్తావించబడిరది: రజబ్, రమజాన్ మధ్య గల నెల షాబాన్ నెల. ప్రజలు దీని ప్రాము ఖ్యత నుండి అలక్ష్యంలో ఉన్నారు. ఈ నెలలో దాసుల కృత్యాలు అల్లాహ్ వద్దకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి నా కర్మఫలాలు దేవుని వద్దకు తీసుకుని వెళ్ళే సమయంలో నేను ఉపవాస దీక్షలో ఉండటాన్ని ఇష్టపడతాను అని మహా ప్రవక్త(స) గారు సెలవిచ్చారు.
మహాప్రవక్త(స)గారు షాబాన్ మాసంలో ప్రత్యేక ఉపవాసాలను పాటించేవారు. హజ్రత్ ఆయిషా(రజి) గారు ఇలా సెల విచ్చారు. నేను మహాప్రవక్త(స) గారిని రమజాన్ నెల తప్ప మరే నెలలో మొత్తం నెల ఉపవాసాలుండటాన్ని ఎప్పుడు చూడ లేదు. షాబాన్ మాసంలో అత్యధికంగా ఉపవాసాలు పాటించడం మరే నెలలో చూడలేదు. (బుఖారి, ముస్లిం) హజ్రత్ అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త(స) గారు ఈ విధంగా సెలవిచ్చారు: షాబాన్ నెల సగ భాగం తర్వాత ఉపవాసాలు పాటించకండి. అంటే షాబాన్ నెల చివరి పదిహేను రోజులు ఉపవాసాలు పాటించకూడదు. ఎందుకంటే ముస్లింలు ప్రతి విషయంలో మహాప్రవక్త(స)ని అనుసరిస్తారు. అదే విధంగా షాబాన్ ఉపవాసాల విషయంలో కూడా నన్నే అనుసరించి ఎక్కువ ఉప వాసాలు పాటిస్తే శారీరక బలహీనత ఏర్పడి రాబోయే రమజాన్ నెల ఉపవాసాలకు కావలసిన శక్తి లోపిస్తుంది. రమజాన్ నెల ఉపవాసాలు విధిగా పాటించాల్సి వుంటుంది. కాబట్టి తన జాతి గురించి ఎల్ల ప్పుడు, ప్రతిక్షణం తపించే విశ్వకారుణ్య మూర్తి మహాప్రవక్త(స) గారు షాబాన్ నెల ఉపవాసాల ద్వారా రమజాన్ నెల ఉప వాసాల్లో ఎలాంటి ఆటంకం జరగకూడదనే ఉద్దేశ్యంతో చాలా స్పష్టంగా ఇలా సెల విచ్చారు. ‘ఇజన్‌తసఫ షాబాను ఫలా తసూమూ’ (బులూగుల్ మరామ్ 139` తిర్మిజి 155/1) షాబాను మాసం సగభాగం తర్వాత ఉప వాసాలు పాటించకండి. అంటే షాబాన్ నెల మొదటి పదిహేను రోజులు ఉప వాసాలు పాటించి చివరి పదిహేను రోజులు ఉపవాసాలు విరమించాలి. హజ్రత్ ఆయిషా(రజి) ఉల్లేఖనం ప్రకారం తన వద్ద ఒక స్త్రీ రజబ్ నెల ఉపవాసాల గురించి ప్రస్తావన చేయగా ఆమె (రజి) గారు ఇలా సెలవిచ్చారు: ఒకవేళ నీకు రమజాన్ నెల ఉపవాసాల తర్వాత వేరే నెలలో ఉపవాసాలను పాటించాలనే ఆసక్తి వుంటే షాబాన్ నెలలో ఉపవాసా లను పాటించు. ఎందుకంటే ఈనెల గురించి అనేక శుభాలు ప్రస్తావించ బడ్డాయి. (కంజుల్ ఆమాల్ 341/4) దీని సారాంశం ఏమిటంటే షాబాన్ నెలలో ఉపవాసాలను పాటించవచ్చు, పూర్తిగా నిషేధించబడలేదు. ఇంకా ఇది మహా గొప్పకార్యం కూడాను. షాబాన్ నెల ప్రాముఖ్యత గురించి హజ్రత్ అబ్దుల్ ఖాదిర్ జిలాని(రహ్మ)గారి వాక్యాలను ఇక్కడ ప్రస్తావించడం చాలా అవసరం. ఆయన ఇలా సెలవిచ్చారు: ఈ నెలలో శుభాలు సమృద్ధిగా ప్రసాదించబడతాయి. పుణ్యాలు ప్రసాదించబడతాయి. పాపాలు దూరం చేయబడతాయి. కాబట్టి ప్రతి తెలివి గల విశ్వాసి ఈ నెలలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. అశ్రద్ధ వహించ కూడదు. ఇంకా రమజాన్ నెలను స్వాగ తించే విధంగా తనకు తాను సంసిద్ధులుగా చేసుకోవాలి. అల్లాహ్ తో విన్నవించు కోవాలి, పశ్చాత్తాపపడాలి. ఈ నెలలో ఎక్కువ ప్రార్థనలు చేసి దైవ సామీప్యాన్ని పొందాలి.
షాబాన్ నెలలో జరిగిన కొన్ని ముఖ్య ఘటనలు
[మార్చు]- 01 Sha'aban, birth of Zaynab bint ‘Alī
- 03 Sha'aban, birth of Husayn ibn ‘Alī
- 04 Sha'aban, birth of ‘Abbās ibn ‘Alī
- 05 Sha'aban, birth of ‘Alī ibn Husayn
- 05 Sha'aban, death of Hazrat Fizza, the hand-maiden (Qaneez) of Fatimah
- 07 Sha'aban, birth of Qāsim ibn Hasan
- 11 Sha'aban, birth of ‘Alī al-Akbar
- 11 Sha'aban 1293 AH, Abdulhamid II became sultan/caliph of the Ottoman Empire
- 15 Sha'aban, night of prayer known as Lailat al-Baraat or Nifsu Sha'aban observed by many Sunni Muslims
- 15 Sha'aban, birth of the last Twelver Imām, Muhammad al-Mahdi
- 22 Sha'aban 1314 AH, death of Khwaja Muhammad Usman Damani, a Sufi master of Naqshbandi tradition
- 23 Sha'aban 492 AH, Jerusalem was conquered by the First Crusade
- 27 Sha'aban, 1313 AH: Birth of Sayyad Laal Shah Hamdani, a prominent Naqshbandi shaykh