Jump to content

షర్బానీ ముఖర్జీ

వికీపీడియా నుండి
షర్బానీ ముఖర్జీ
2018లో షర్బానీ ముఖర్జీ
జననం
భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1977 - 2015
తల్లిదండ్రులురోనో ముఖర్జీ

షర్బానీ ముఖర్జీ ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా హిందీ చిత్రాలలో, కొన్ని మలయాళ భాషా చిత్రాలలో కూడా నటించింది.[1]

నేపథ్యం

[మార్చు]

ఆమె రోనో ముఖర్జీ కుమార్తె, ముఖర్జీ-సమర్త్ కుటుంబంనకుచెందినది.[2] ఆమె బాబాయిలు దేబ్ ముఖర్జీ, జాయ్ ముఖర్జీ, షోము ముఖర్జీ. ఆమె తాత, సషాధర్ ముఖర్జీ, ఒక సినిమా నిర్మాత. ఆమె నాయనమ్మ సతీరాణి దేవి అశోక్ కుమార్, అనూప్ కుమార్, కిషోర్ కుమార్ ల సోదరి. ఆమె బంధువులు నటీమణులు రాణి ముఖర్జీ, కాజోల్, తనీషా, దర్శకుడు అయాన్ ముఖర్జీ, ప్రఖ్యాత ఎంఐటి బీజగణిత జియోమీటర్ దవేష్ మౌలిక్. ఆమె సోదరుడు సామ్రాట్ ముఖర్జీ కూడా బాలీవుడ్, బెంగాలీ నటుడు. [3]

కెరీర్

[మార్చు]

షర్బానీ ముఖర్జీ బోర్డర్‌ సినిమాతో తెరంగేట్రం చేసింది. షాజియా మన్సూర్ పాడిన "ఘర్ ఆజా సోనియా" పాటలో ఆమె సమీర్ సోనీ సరసన కనిపించింది. పలు యాడ్స్‌లో కూడా నటించింది.[4] 2008 నాటికి ఆమె తన దృష్టిని మోలీవుడ్‌ వైపు మార్చింది, ఆమె తొలి మలయాళ చిత్రం రాకిలిపట్టు ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన మిస్టరీ-థ్రిల్లర్ చిత్రం, జ్యోతిక, టబు, ఇషిత్తా అరుణ్‌లతో కలిసి నటించింది. ఆమె సూఫీ పరంజ కథ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది.[5] ఇది మలయాళ నవతరంగం నిర్వచించే చలనచిత్రాలలో ఒకటిగా విస్తృతంగా పరిగణించబడుతుంది.[6]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనిక
1997 బార్డర్ ఫూల్కన్వార్ హిందీ అరంగేట్రం
2000 స్నేగితియే రాధిక తమిళం ద్విభాషా చిత్రం మలయాళంలో రాకిలిప్పటుగా చిత్రీకరించబడింది
2001 మిట్టి పూజ హిందీ
2002 అన్ష్: ది డెడ్లీ పార్ట్ శ్వేత హిందీ
2003 కైసే కహూన్ కే... ప్యార్ హై ప్రియా హిందీ
2003 ఆంచ్ విద్య హిందీ
2006 ధరతీ కహే పుకార్ కే రజని భోజ్‌పురి
2007 రాకిలిపట్టు రాధిక మలయాళం మలయాళ రంగ ప్రవేశం
2008 మోహన్ దాస్ కస్తూరి హిందీ
2010 332 ముంబై టు ఇండియా తనూ హిందీ
2010 సూఫీ పరంజ కథ కార్తీ, సుహార మలయాళం
2010 ఆత్మ కథ మేరీ మలయాళం
2015 నముక్కొరే ఆకాశం మలయాళం

మూలాలు

[మార్చు]
  1. "To play a 60-year-old was not that difficult - Times of India". The Times of India.
  2. "Cousins Rani Mukherjee and Kajol to be neighbours"
  3. "കാര്‍ത്തിയ്ക്ക് ശര്‍ബാനിയുടെ അഴക്‌, Interview - Mathrubhumi Movies". Archived from the original on 19 December 2013. Retrieved 19 December 2013.
  4. "ശര്‍ബാനി പറഞ്ഞത്‌, Interview - Mathrubhumi Movies". Archived from the original on 19 December 2013. Retrieved 19 December 2013.
  5. Lekshmy Rajeev (25 February 2010). "Voice for Religious Unity". The Hindu. Retrieved 14 August 2015.
  6. Nagarajan, Saraswathy (2019-12-19). "The 25 best Malayalam films of the decade: 'Premam', 'Maheshinte Prathikaram', 'Kumbalangi Nights' and more". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-07-11.