Jump to content

షరీజ్ అహ్మద్

వికీపీడియా నుండి
షరీజ్ అహ్మద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షరీజ్ అహ్మద్
పుట్టిన తేదీ (2003-04-21) 2003 ఏప్రిల్ 21 (వయసు 21)
ఆమ్‌స్టర్‌డ్యామ్, నెదర్లాండ్స్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుLegbreak googly
పాత్రబౌలరు
బంధువులుMusa Ahmed (brother)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 81)2022 జూన్ 2 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2023 జూన్ 30 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.18
తొలి T20I (క్యాప్ 53)2022 జూలై 11 - PNG తో
చివరి T20I2022 అక్టోబరు 27 - ఇండియా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.18
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 లిఎ T20
మ్యాచ్‌లు 11 9 11 9
చేసిన పరుగులు 64 31 64 31
బ్యాటింగు సగటు 9.14 15.50 9.14 15.50
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 30 16* 30 16*
వేసిన బంతులు 388 132 388 132
వికెట్లు 13 7 13 7
బౌలింగు సగటు 31.07 22.00 31.07 22.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/43 2/15 5/43 2/15
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 1/– 3/– 1/–
మూలం: Cricinfo, 7 September 2023

షరీజ్ అహ్మద్ (జననం 2003 ఏప్రిల్ 21) ఒక డచ్ క్రికెట్ ఆటగాడు. [1] అతను 2022 నుండి నెదర్లాండ్స్ జాతీయ క్రికెట్ జట్టుకు ఆడుతున్నాడు. అతను రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ బౌలర్.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అహ్మద్ 2003 ఏప్రిల్ 21న ఆమ్‌స్టర్‌డామ్‌లో జన్మించాడు [2] అతను తోటి నెదర్లాండ్స్ ఇంటర్నేషనల్ ఆటగాడు మూసా అహ్మద్‌కు తమ్ముడు. వారి తండ్రి నదీమ్ అహ్మద్, పాకిస్తాన్‌లోని లాహోర్ నుండి వలస వచ్చి, నెదర్లాండ్స్‌లో ఉన్నత స్థాయి క్లబ్ క్రికెట్ ఆడాడు. అతను, అతని కుమారులు ఆమ్‌స్టర్‌డామ్‌లోని గ్రోయెన్ ఎన్ విట్ CC కోసం ఆడారు. [3]

జూనియర్ కెరీర్

[మార్చు]

2020 అక్టోబరులో, అహ్మద్ అండర్-18 స్థాయిలో అతని ప్రదర్శనలకు గాను, డచ్ అకాడమీ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు. [4] తరువాతి సెప్టెంబరులో, అతను 2022 ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం యూరప్ గ్రూప్‌లో అండర్-19 క్వాలిఫికేషన్ మ్యాచ్‌ల కోసం డచ్ జట్టులో భాగమయ్యాడు. [5] గ్రూప్‌లో నెదర్లాండ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు. [6]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2022 ఫిబ్రవరిలో, న్యూజిలాండ్ పర్యటన కోసం డచ్ పరిమిత ఓవర్ల స్క్వాడ్‌లలో స్థానం పొందిన తర్వాత అహ్మద్ తన తొలి సీనియర్ అంతర్జాతీయ పిలుపు అందుకున్నాడు. [7] 2022 మేలో, వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం డచ్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో అతను ఎంపికయ్యాడు. [8] అతను 2022 జూన్ 2న వెస్టిండీస్‌పై వన్‌డే రంగప్రవేశం చేసాడు. [9]

2022 జూలైలో, అతను జింబాబ్వేలో 2022 ICC పురుషుల T20 ప్రపంచ కప్ గ్లోబల్ క్వాలిఫైయర్ B టోర్నమెంట్ కోసం నెదర్లాండ్స్ ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఎంపికయ్యాడు. [10] అతను పాపువా న్యూ గినియాపై 2022 జూలై 11న తన తొలి T20I మ్యాచ్‌ ఆడాడు. [11] అతను న్యూజిలాండ్‌తో జరిగిన 1వ T20I లో 2/15తో నెదర్లాండ్స్‌కు అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. [12]


2023 మార్చిలో, అతను జింబాబ్వేతో జరిగిన సిరీస్ కోసం నెదర్లాండ్స్ వన్‌డే జట్టులో ఎంపికయ్యాడు. [13] రెండవ వన్‌డేలో, 2023 మార్చి 23న, అతను అంతర్జాతీయ క్రికెట్‌లో తన తొలి ఐదు వికెట్ల పంటను సాధించాడు. [14]

మూలాలు

[మార్చు]
  1. "Shariz Ahmad". ESPN Cricinfo. Retrieved 4 June 2022.
  2. "ICC Men's T20 World Cup 2022 Media Guide" (PDF). International Cricket Council. 2022. p. 92. Archived from the original (PDF) on 2023-06-27. Retrieved 23 March 2023.
  3. Bose, Shuvaditya (30 October 2022). "From Lahore, With Love: Shariz Ahmad, Pak-Origin Netherlands Bowler at T20 WC". The Quint. Retrieved 14 February 2023.
  4. "Men's Winter and Academy squads". Royal Dutch Cricket Association. Retrieved 4 June 2022.
  5. "Netherlands spinners combine to beat Ireland in U19 Qualifier". Emerging Cricket. 20 September 2021. Retrieved 4 June 2022.
  6. "ICC Under-19 World Cup Qualifier Europe Region, 2021 - Netherlands Under-19s: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 4 June 2022.
  7. "O'Dowd, Myburgh and Van Beek back for Netherlands' tour of New Zealand". Emerging Cricket. 22 February 2022. Retrieved 23 February 2022.
  8. "Dutch mens cricket squad announced for ICC Super League Series against West Indies". Royal Dutch Cricket Association. Retrieved 4 June 2022.
  9. "2nd ODI, Amstelveen, June 02, 2022, West Indies tour of Netherlands". ESPN Cricinfo. Retrieved 4 June 2022.
  10. "Squad announcement for T20 World Cup Qualifier in Zimbabwe". Royal Dutch Cricket Association. Retrieved 4 July 2022.
  11. "3rd Match, Group B, Bulawayo, July 11, 2022, ICC Men's T20 World Cup Qualifier". ESPN Cricinfo. Retrieved 11 July 2022.
  12. "New Zealand edge Netherlands in first T20 clash". The Daily Star. 4 August 2022. Retrieved 4 August 2022.
  13. "Selection announced for Men's World Cup qualifiers in Zimbabwe and South Africa". Royal Dutch Cricket Association. Retrieved 6 March 2023.
  14. "Zimbabwe vs Netherlands, 2nd ODI - Zimbabwe Bowled Out For 271". Cricketnmore (in ఇంగ్లీష్). Retrieved 2023-03-23.