Jump to content

షబ్బీర్ అలీ (ఫుట్‌బాల్ క్రీడాకారుడు)

వికీపీడియా నుండి
షబ్బీర్ అలీ
ఆగస్ట్ 2017లో షబ్బీర్ అలీ
వ్యక్తిగత సమాచారం
జనన తేదీ (1956-01-26) 1956 జనవరి 26 (వయసు 68)
జనన ప్రదేశం హైదరాబాదు, హైదరాబాదు రాష్ట్రం, భారతదేశం
ఆడే స్థానం స్ట్రైకర్
సీనియర్ కెరీర్*
సంవత్సరాలు జట్టు Apps (Gls)
0000–1972 హైదరాబాద్ ఆర్సెనల్ క్లబ్
1972 టాటా స్పోర్ట్స్ హైదరాబాద్
1978–1979 కింగ్‌ఫిషర్ ఈస్ట్ బెంగాల్ (35)
1973–1984 మహమ్మదీయ స్పోర్టింగ్ క్లబ్ (కోల్‌కతా)
1984–1985 విక్టోరియా స్పోర్టింగ్ ఢాకా
జాతీయ జట్టు
1974–1984 భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు 66 (23[1])
Teams managed
1985–1992 మహమ్మదీయ స్పోర్టింగ్ క్లబ్ (కోల్‌కతా)
1992–1993 రాజస్థాన్ క్లబ్
1993–1995 పీర్‌లెస్ ఎస్.సి
1997–2000 సల్గోకర్ ఎస్.సి
2000–2001 మహీంద్రా యునైటెడ్
2004 చర్చిల్ బ్రదర్స్ ఎస్.సి.
2005 సల్గోకర్ ఎస్.సి
2007–2010 మహమ్మదీయ స్పోర్టింగ్ క్లబ్ (కోల్‌కతా)
2011–ప్రస్తుతం సదరన్ సమితి
  • Senior club appearances and goals counted for the domestic league only.
† Appearances (Goals).

షబ్బీర్ అలీ (జననం 1956 జనవరి 26) (ఆంగ్లం: Shabbir Ali) ఒక భారతీయ ఫుట్‌బాల్ మేనేజర్. మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు.[2]  భారతీయ క్రీడలలో అత్యున్నత పురస్కారం అయిన ధ్యాన్ చంద్ అవార్డుతో షబ్బీర్ అలీని  2011లో భారత ప్రభుత్వం సత్కరించింది.[3][4]  ధ్యాన్ చంద్ అవార్డుకు ఎంపికైన మొదటి ఫుట్‌బాల్ క్రీడాకారుడు అవడం విశేషం.[5]

క్లబ్ కెరీర్

[మార్చు]

1956 జనవరి 26న హైదరాబాదులో జన్మించిన షబ్బీర్ అలీ 1970, 1980లలో భారతదేశంలో అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.[6] అతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్ట్రైకర్ గా గొప్ప గోల్ స్కోరర్. షబ్బీర్ అలీ చిన్న వయస్సులోనే 1974లో ఇరాన్‌తో సంయుక్తంగా బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి నాయకత్వం వహించి కీర్తిప్రతిష్ఠలు సంపాదించాడు. అతనిని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రశంసించడం గమనార్హం.[7]

కొన్ని సంవత్సరాలు బొంబాయిలోని టాటా స్పోర్ట్స్ క్లబ్‌తో ఆడిన తర్వాత, షబ్బీర్ అలీని 1970ల చివరలో అగ్రశ్రేణి కలకత్తా క్లబ్, ఈస్ట్ బెంగాల్ ఆకర్షించింది. తరువాత అతను మొహమ్మదీన్ స్పోర్టింగ్‌లో చేరాడు. 1980ల మధ్యలో ఆ క్లబ్ కు గొప్ప పేరుతెచ్చిపెట్టి షబ్బీర్ అలీ పదవీ విరమణ చేసాడు.[8][9]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

షబ్బీర్ అలీ భారతదేశ జాతీయ జట్టుకు 1972, 1984ల మధ్య 13 సంవత్సరాల పాటు సేవలందించాడు. ఆ సమయంలో ఆసియా యూత్, ఆసియా క్రీడలు, ప్రీ-ఒలింపిక్స్, ఆసియా కప్, మెర్డెకా కప్ టోర్నమెంట్, నెహ్రూ గోల్డ్ కప్, కింగ్స్ కప్ లాంటి ఎన్నో టీర్నీల్లో పాల్లొన్నారు. అతను ఆసియా యూత్, ప్రీ-ఒలింపిక్స్, నెహ్రూ కప్, మెర్డెకా, కింగ్స్ కప్ టోర్నమెంట్లలో భారతదేశానికి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

అతని కెరీర్లో అత్యుత్తమ క్షణాలలో ఒకటి 1976లో కౌలాలంపూర్‌లో జరిగిన మెర్డెకా అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్, అందులో మొదటి 35 నిమిషాల్లోనే ఇండోనేషియాపై హ్యాట్రిక్ సాధించాడు. హ్యాట్రిక్ సాధించిన భారతీయులలో షబ్బీర్ అలీ సాధించిన హ్యాట్రిక్ అత్యంత వేగవంతమైనది.[10][11][12]

అతను భారతదేశం తరపున 72 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 1972 నుండి 1984 వరకు తన కెరీర్లో 23 గోల్స్ చేశాడు. ఒక్కో మ్యాచ్‌కు స్ట్రైక్ రేట్ ఆధారంగా అత్యధిక ర్యాంక్ గోల్ స్కోరర్‌లలో షబ్బీర్ అలీ ఒకడు.[13]

ఫుట్‌బాల్ అకాడమీ

[మార్చు]

2021 మార్చి 1న షబ్బీర్ అలీ హైదరాబాదులో తనపేరున ఫుట్‌బాల్ అకాడమీని ప్రారంభించాడు. ఆ అకాడమీ తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో అనుబంధంగా పనిచేస్తుంది.[14]

మూలాలు

[మార్చు]
  1. Dey, Subrata. "India - Record International Players". www.rsssf.com. Rec.Sport.Soccer Statistics Foundation. Archived from the original on 21 March 2019. Retrieved 22 August 2021.
  2. "Shabbir Ali". Archived from the original on 19 August 2014. Retrieved 6 September 2011.
  3. "National sports awards announced". The Hindu. 19 August 2011. Archived from the original on 17 July 2021. Retrieved 25 January 2012.
  4. Gagan Narang confirmed for Khel Ratna award Archived 8 అక్టోబరు 2012 at the Wayback Machine NDTV, Press Trust of India on 18 August 2011.
  5. "Shabbir Ali Wins Dhyan Chand Award". www.outlookindia.com/. Archived from the original on 17 July 2021. Retrieved 2020-09-06.
  6. "Watch: Shabbir Ali, the overlooked football legend". englishamp.etvbharat.com. Archived from the original on 24 October 2021. Retrieved 24 October 2021.
  7. "Shabbir Ali". Archived from the original on 19 August 2014. Retrieved 6 September 2011.
  8. "Football in Bangladesh - Azam Mahmood". Bdsportsvision.com. Archived from the original on 2011-09-17. Retrieved 2012-11-01.
  9. Das, Rudra Narayan (29 November 2011). "Player Biography : Shabbir Ali – Only Footballer To Win Dhyan Chand Award". indianfooty.net. Indian Football Network. Archived from the original on 23 August 2012. Retrieved 6 September 2021.
  10. "Thais fight back". The Straits Times. 17 August 1976. Archived from the original on 16 July 2018. Retrieved 15 July 2018.
  11. Ganesh, Arjun (21 January 2018). "Shabbir back steering dreams". Deccan Herald. Archived from the original on 15 November 2019. Retrieved 15 November 2019.
  12. "Shabbir Ali: The Hyderabadi footballer who represented city's golden era of the sport". The Siasat Daily. Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
  13. Football Is My Language - Shabbir Ali Archived 10 సెప్టెంబరు 2021 at the Wayback Machine Indianfootball.de. Retrieved 10 September 2021
  14. Former India football captain Shabbir Ali launches academy Archived 6 సెప్టెంబరు 2021 at the Wayback Machine sportstar.thehindu.com. Retrieved 6 September 2021