Jump to content

శ్రీ సత్యసాయి విద్యా విహార్

వికీపీడియా నుండి

శ్రీ సత్యసాయి విద్యా విహార్ పాఠశాలను విశాఖపట్నం లో 1984 లో స్థాపించబడింది. శ్రీ సత్యసాయి విద్యా విహార్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ ఇ) కు అనుబంధంగా ఉన్న బాలబాలిక (కో-ఎడ్) పాఠశాలను శ్రీ సత్యసాయి ట్రస్ట్ నిర్వహిస్తోంది[1]. ఎల్ కె జి నుంచి 10 వ తరగతి వరకు ఆంగ్ల భాషలో సి బి ఎస్ ఇ వారి పద్ధతిలో ఇక్కడ బోధన జరుగుతుంది[2][3].

అవలోకనం

[మార్చు]

శ్రీ సత్యసాయి విద్యా విహార్ విశాఖపట్నం ఎంవిపి కాలనీలోని సెక్టార్ 8 లో ఉంది. విద్యార్థులలో ఆరోగ్యకరమైన పోటీ, వ్యక్తిత్వ నిర్మాణం, శారీరక సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి పాఠశాల క్రీడలు, ఆటలకు సమాన ప్రాముఖ్యత ఇస్తుంది. విద్య, క్రీడలు, ఆటలు, ఇతర సహ పాఠ్యాంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించి బంగారు పతకాలు, ట్రోఫీలు, షీల్డ్ లు అందజేస్తారు. శ్రీ సత్యసాయి విద్యా విహార్  ప్రత్యేకత సేవా భావన. పిల్లలకు చిన్న వయసు నుండే సేవ చేయడం ముఖ్యమైన విలువను నేర్పుతారు. ఇందులో భాగంగా నిరుపేదలకు బట్టలు, ఆహారం పంపిణీ వంటి సేవా కార్యక్రమాల్లో పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యం చేస్తున్నారు.

ఈ పాఠశాల 1.99 ఎకరాల (8,100 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో  నిర్మాణాన్ని  కలిగి ఉంది, ప్రక్కనే 'ఎల్' ఆకారంలో ఉన్న బ్లాక్ లో యోగా హాల్, సైన్స్ ల్యాబ్స్, వైస్ ప్రిన్సిపాల్ గది, కిండర్ గార్టెన్, ఇతర తరగతులు ఉన్నాయి. రీడింగ్ రూమ్, ఆర్ట్ రూమ్, ఇండోర్ స్పోర్ట్స్ రూమ్ ఉన్నాయి.  కంప్యూటర్ ల్యాబ్, ప్రిన్సిపాల్ గది, సందర్శకుల గది, ఆడియో విజువల్ రూమ్, ఆఫీస్ రూమ్ ఉన్నాయి. క్యాంపస్ లో, సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి ఒక ప్రార్థనా మందిరం ఉంది. ఈ పాఠశాల ప్రధానంగా శ్రీ సత్యసాయిబాబా బోధనల ఆధారంగా తన మిషన్ ను ప్రారంభించింది[4].

వసతులు

[మార్చు]

శ్రీ సత్యసాయి విద్యావిహార్ విశాలమైన గ్రంథాలయం (లైబ్రరీ) సదుపాయంతో, విద్యార్థులు, సిబ్బందికి అందుబాటులో ఉండేలా  మొత్తం 6000 పుస్తకాలను సేకరించింది. ఇందులో సుమారు 500 రిఫరెన్స్ పుస్తకాలు, 25 పత్రికలు కూడా ఉన్నాయి. గ్రంథాలయాన్ని లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, అటెండర్ నిర్వహిస్తారు[5].

మూలాలు

[మార్చు]
  1. "Sri Sathya Sai Vidya Vihar – Andhra Pradesh - CBSE School in Visakhapatnam, India". www.cbseschool.org. Retrieved 2023-12-18.
  2. "Sri Sathya Sai Vidya Vihar Visakhapatnam, Visakhapatnam: Admission, Fee, Affiliation". school.careers360.com (in ఇంగ్లీష్). Retrieved 2023-12-18.
  3. "Sri Sathya Sai Seva Organizations, Andhra Pradesh". SSSSOAP. Retrieved 2023-12-18.
  4. "Sri Satya Sai Vidya Vihar ,Visakhapatnam-about-us". preprimaryschools.com. Retrieved 2023-12-18.
  5. "Sri Sathya Sai Vidhya Vihar-Visakhapatnam, Andhra Pradesh, India". www.sathyasaischoolvizag.com. Retrieved 2023-12-18.