Jump to content

శ్రీ వేదాంతదీపిక

వికీపీడియా నుండి

ఈ మాసపత్రిక శ్రీవైష్ణవ సిద్ధాంత సభ తరఫున మద్రాసు నుండి వెలువడినది. 1928లో ప్రారంభమైనది. వంగీపురం వాసుదేవాచార్యులు దీనికి సంపాదకునిగా వ్యవహరించాడు. మొదటి సంచికలో జీవాత్మ, పరమాత్మ సంవాదము, శ్వేనకపోతోపాఖ్యానము, నచకేతస్సుర ప్రశ్నలు అనే వ్యాసాలు, సంపాదకీయాలు ఉన్నాయి. శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రము మూలముతో పరాశర భట్టరు చేసిన సంస్కృత భాష్యమును అనుసరించి ఆంధ్రవ్యాఖ్యానముతో ఈ పత్రికలో ప్రచురించారు. ఉపనిషత్తుల నుండి, ఆళ్వారుల పాశురముల నుండి సారతరమగు విషయాలు దీనిలో ఉన్నాయి.