Jump to content

శ్రీ భర్గ శతకము

వికీపీడియా నుండి
శ్రీ భర్గ శతకము
కృతికర్త: కూచిమంచి తిమ్మకవి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: భక్తిశతకము
విభాగం (కళా ప్రక్రియ): తెలుగు సాహిత్యం
ప్రచురణ: కూచిమంచి శ్రీరామమూర్తి
విడుదల: 1936

ఈ శతకాన్ని కూచిమంచి తిమ్మకవి (1690-1773) సా.శ.1729[1]లో రచించాడు. 101 పద్యాలు మత్తేభ శార్దూల విక్రీడితాలలో ఈ శతకంలో ఉంది. ఈ శతకాన్ని "భర్గా! పార్వతీవల్లభా!" అనే మకుటంతో వ్రాశాడు. ఈ పుస్తకం 1938లో పిఠాపురంలోని శ్రీ విద్వజ్జనమనోరంజనీ ముద్రాక్షరశాలలో ముద్రించబడింది. కూచిమంచి శ్రీరామమూర్తి దీనిని ప్రకటించాడు. ఈ శతకంలో నృపనింద (68-72,74,79,80 పద్యాలలో), లోభుల తత్వము (84,88-90 పద్యాలలో), ముష్కరనింద (92-95 పద్యాలలో), కుకవినింద (85-87 పద్యాలలో), గృహస్థధర్మము (97,98పద్యాలలో) తెలుపబడింది. సాంఘికమైన ఈ విషయాలే కాకుండా శివభక్తి, శివభక్తుల గాథలు కూడా ఈ శతకంలో వర్ణించబడింది.

మచ్చుతునకలు

[మార్చు]
మ|| అమరం ద్వత్పద పంకజాత యుగళి ధ్యాన క్రియాశ్రాంతసం
భ్రమలీలన్ విలసిల్లు డెందమొరులన్ బ్రార్థింపఁగా నేర్చునే
సుమనో నిర్ఝరిణీ సువర్ణకముల స్తోమాస వాలంపట
భ్రమరంబరుగునే తుమ్మకొమ్మలకు భర్గా! పార్వతీవల్లభా!
శా|| ఆజిన్ వైరి వరూధినీ మదన దీక్షారూఢిఁగ్రాలవలెన్
భోజుం బోలి సమస్త యాచక తతిం బోషించుచుండన్ వలెన్
తేజంబెప్పుడు నుర్విలోఁబ్రజకుఁ జెందింపన్ వలెన్ గానిచో
రాజావాఁడు, తరాజుగాక భువి భర్గా! పార్వతీవల్లభా!

మూలాలు

[మార్చు]
  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973

బయటి లింకులు

[మార్చు]

[1][permanent dead link] అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రిక