Jump to content

శ్రీధర్ బీచరాజు

వికీపీడియా నుండి
శ్రీధర్ బీచరాజు
జననంఅక్టోబర్ 7, 1973
కేసముద్రం, మహబూబాబాదు జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాద్
వృత్తికేంద్ర ప్రభుత్వ గేయ నాటక విభాగంలో ఉద్యోగి
ప్రసిద్ధిరంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు, నటశిక్షకుడు
భార్య / భర్తనెల్లుట్ల కవిత
పిల్లలుశ్రీకరణ్ (కుమారుడు), అముక్తమాల్యద (కుతురు)
తండ్రిసుదర్శన్ రావు
తల్లిసూర్యకళ

శ్రీధర్ బీచరాజు రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు, నటశిక్షకుడు. 2003లో విడుదలైన బ్యాక్ పాకెట్ సినిమాకు దర్శకత్వం వహించాడు.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

శ్రీధర్ 1973, అక్టోబర్ 7న సుదర్శన్ రావు, సూర్యకళ దంపతులకు మహబూబాబాదు జిల్లా లోని కేసముద్రంలో జన్మించాడు. కేసముద్రంలోని ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన శ్రీధర్ హన్మకొండ జూనియర్ కళాశాలలో ఇంటర్, వరంగల్ సి.కే.ఎం. కళాశాలో డిగ్రీ పూర్తిచేశాడు. అనంతరం హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థలశాస్త్రం (బి.ఏ.)లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఎం.ఏ.లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు.

ఉద్యోగం - నివాసం

[మార్చు]

1998-99 మధ్యకాలంలో తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల విద్యార్థులకు నటనలో శిక్షణ ఇచ్చిన శ్రీధర్ 1999లో కేంద్ర ప్రభుత్వ గేయ నాటక విభాగంలో ఉద్యోగిగా చేరాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసముంటున్నాడు.

వివాహం - పిల్లలు

[మార్చు]

నెల్లుట్ల కవితతో 1999, మే 7న శ్రీధర్ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు శ్రీకరణ్ (కుమారుడు), అముక్తమాల్యద (కుతురు).

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

రంగస్థల విద్యను అభ్యసించిన శ్రీధర్ అనేక నాటకాలలో నటించడమేకాకుండా, కొన్ని నాటికలకు దర్శకత్వం వహించాడు. తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ సభ్యులుగా ఉన్నాడు.[2]

నటించినవి

[మార్చు]
  1. మరో మొహంజదారో
  2. గోగ్రహణం
  3. జంబూద్వీపం
  4. ఎవరిని ఎవరు క్షమించాలి
  5. అసంపూర్ణ శిల్పాలు
  6. ఇదంతే
  7. నాటకం
  8. గార్ధభాండం
  9. నియోగిని
  10. ఘటనం సర్వ జనీనం
  11. ప్రతాప రుద్రమ (అంబదేవుడు, విద్యారణ్యస్వామి)[3]

దర్శకత్వం వహించినవి

[మార్చు]
  1. అంతర్యుద్ధం
  2. అతిథులోస్తున్నారు జాగ్రత్త
  3. నువ్వునేను ఫిఫ్టీఫిఫ్టీ

టీవి, సినిమారంగం

[మార్చు]

మంచుపర్వతం, ఊహలపల్లకి, ఓ అమ్మకథ, బృందావనం వంటి టీవీ ధారవాహిలకు దర్శకత్వం వహించిన శ్రీధర్, 2003లో విజయ్ సాయి, సోనిరాజ్, సుమన్ తల్వార్, రాళ్లపల్లి, తనికెళ్ల భరణి, జయలలిత, సివిఎల్ నరసింహరావు, అనంత్, సుదర్శన్, కళ్ళు చిదంబరం, వినోద్ బాల తదితరలు నటించిన బ్యాక్ పాకెట్ సినిమాకు దర్శకత్వం వహించాడు. టీవీ రచయితల సంఘం నిర్వాహక కార్యదర్శిగా ఉన్నాడు.[4]

అవార్డులు - పురస్కారాలు

[మార్చు]
  1. సాహిత్య శిరోమణి పురస్కారం - భారత్‌ కల్చరల్‌ అకాడమీ (2015 ఆగస్టు 30)[5]
  2. ఉత్తమ నటుడు (ప్రత్యేక బహుమతి) - అసంపూర్ణ శిల్పాలు - పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 1996
  3. ఆంధ్ర నాటక పితామహ ధర్మవరం రామకృష్ణమాచార్యులు గోల్డ్ మెడల్

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "బ్యాక్ పాకెట్". telugu.filmibeat.com. Retrieved 7 October 2017.
  2. నమస్తే తెలంగాణ (April 29, 2017). "మళ్లీ నాటకం వేయాలని ఉంది." Retrieved 7 October 2017.
  3. ఈనాడు, హైదరాబాదు (31 December 2020). "'ప్రతాప రుద్రమ' అరుదైన ఘనత". www.eenadu.net. Archived from the original on 31 December 2020. Retrieved 31 December 2020.
  4. నమస్తే తెలంగాణ (June 29, 2016). "టీవీ రచయితల సంఘం అధ్యక్షుడిగా నాగబాల సురేష్‌కుమార్". Retrieved 7 October 2017.
  5. ఆంధ్రజ్యోతి (August 30, 2015). "నేడు సాహిత్య శిరోమణి పురస్కారాల ప్రదానం". Retrieved 7 October 2017.[permanent dead link]

ఇతర లంకెలు

[మార్చు]