శ్రీకృష్ణ తులాభారం (1955 సినిమా)
స్వరూపం
శ్రీకృష్ణ తులాభారం (1955) (1955 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.ఎస్.రావు |
---|---|
నిర్మాణం | కడారు నాగభూషణం |
సంగీతం | హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి , బాబు రావు |
నిర్మాణ సంస్థ | రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ |
భాష | తెలుగు |
శ్రీ కృష్ణ తులాభారం 1955 డిసెంబరు 3న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాజ రాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ పతాకం కింద కడారు నాగభూషణం నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. ఎస్.వరలక్ష్మి, శ్రీరంజని జూనియర్, సూర్యకళ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి, బాబూరావులు సంగీతాన్నందించారు.[1]
తారాగణం
[మార్చు]- ఎస్. వరలక్ష్మి,
- శ్రీరంజని Jr,
- సూర్య కళ,
- సూర్యకాంతం,
- కె. రఘురామయ్య,
- పి. సూరిబాబు,
- రేలంగి వెంకటరామయ్య,
- సి.హెచ్.వి నారాయణరావు,
- ఎ.వి. సుబ్బారావు,
- పి. వెంకట్ రావు,
- ఎం.సి. రాఘవన్,
- వంగర,
- ప్రభావతి,
- కుమారి కమల,
- రాజసులోచన,
- సి. వరలక్ష్మి,
- లక్ష్మి,
- జయశ్రీ,
- లీలా రాణి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: సి.ఎస్.రావు
- స్టూడియో: శ్రీ రాజ రాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ
- నిర్మాత: కడారు నాగభూషణం;
- సినిమాటోగ్రాఫర్: కమల్ ఘోష్, తంబు;
- ఎడిటర్: ఎన్.కె. గోపాల్;
- స్వరకర్త: హెచ్.ఆర్. పద్మనాబ శాస్త్రి, బాబూరావు;
- గీతరచయిత: దైత గోపాలం
పాటలు
[మార్చు]- అండపిండవేదోండ సంహతుల నెల్ల గుప్తగతి (పద్యం) - పి. సూరిబాబు
- అతివరో నన్ను తూచెడు ధనాధుల నీకడ (పద్యం) - కె. రఘురామయ్య
- అన్నులమిన్నా ఓ అన్నులమిన్నా భీష్మసుత ప్రార్థన (పద్యం) - కె. రఘురామయ్య
- ఇక నే గీచిన గీటు దాటనని ఎన్నేసార్లు నాదండ ఇచ్చకములు (పద్యం) - ఎస్. వరలక్ష్మి
- ఇతని పాదమె సుడి పతితజనావన సారభాగీరధి (పద్యం) - పి. సూరిబాబు
- ఇదియే పారిజాతము ఇదే నిన్నింతవరకు తోడి (పద్యం) - కె. రఘురామయ్య
- ఈ లోలాక్షులు నీ ప్రియోత్తమను నన్నీలీల నెన్నేని (పద్యం) - ఎస్. వరలక్ష్మి
- ఎంత మోస మాహా నాధా ఎంత చేసితౌరా - ఎస్. వరలక్ష్మి
- ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి (పద్యం) - కె. రఘురామయ్య
- ఏమి తపంబొనర్చి జనియించివాడనో నేడు (పద్యం) - పి. సూరిబాబు
- ఏమిది సత్యభామా ఇటులేటికి మంగళసూత్ర (పద్యం) - జిక్కి
- కస్తూరీకా తిలకమ్ముల పోనాడి ఊర్ద్వపుండ్ర (పద్యం) - కె. రఘురామయ్య
- కృష్ణా ముకుందా మురారె - పి. సూరిబాబు,ఎస్. వరలక్ష్మి, జిక్కి బృందం
- గోపాల మాంపాలయా కృపాలయా గోపీ విధేయ - పి. సూరిబాబు
- జరిగినది జరుగనున్నది జరుగెడునది (పద్యం) - పి. సూరిబాబు
- జలజాక్షి యిది పారిజాత ప్రసూనంబు నరులకు (పద్యం) - పి. సూరిబాబు
- తల్లీ తులసీ దయగనుమమ్మా కొల్లగ నిన్నే కొలిచెదమమ్మా - జిక్కి
- ధనధాన్యాదికములు గని తనిసిన తనియుదురుగాని (పద్యం) - ఎస్. వరలక్ష్మి
- నందకుమారా పుట్టిన దినంబని నే డతి వైభవంబుగా (పద్యం) - జిక్కి
- నందగోపాలుడే తనవాడైతే అందని ఫలమున్నదా - ఎస్. వరలక్ష్మి
- నాధుడే జగన్నాధుడే ఏమనుచు నీవతని - జిక్కి, ఎస్. వరలక్ష్మి
- నీ మాహత్యం ఒక్కింతయున్ గనక అంగీభూతచేతస్తనై (పద్యం) - ఎస్. వరలక్ష్మి
- ప్రమదలకూడి మాడగనే వారిమనోగతులెల్ల (పద్యం) - కె. రఘురామయ్య
- ప్రాణసఖీ నీ ప్రేమ యిదే భావమునే గనవా దాసుని - కె. రఘురామయ్య
- ఫలమో ఘనరసంబో పత్రమో పుష్పమో కొనుచు (పద్యం) - జిక్కి
- బలే మంచి చౌకబేరము ఇది సమయము - పి. సూరిబాబు, ఎస్. వరలక్ష్మి బృందం
- భజ భజ మానస భగవంతం వననిధి వరతనయా కాంతం (1) - పి. సూరిబాబు
- . భజ భజ మానస భగవంతం వననిధి వరతనయా కాంతం (2) - పి. సూరిబాబు
- భామా యిటుల పలుకతగునే కమనీయ విలాసములచే - కె. రఘురామయ్య
- మధుర మురళీధరా దేవా గానలోల కనులారగ నిను గన - జిక్కి
- మీరజాలగలడా నాయానతి వ్రతవిధానమహిమన్ సత్యాపతి - ఎస్. వరలక్ష్మి
- మెట్టినదినమని సత్యయు బుట్టిన దినమనుచు (పద్యం) - కె. రఘురామయ్య
- వేదశిఖలపై నిలచు నా పాదయుగళి అట్టి నా (పద్యం) - కె. రఘురామయ్య
- వేదాల దొంగను వెతికి పట్టెడువేళ మీనమై యెవ్వఁడు (పద్యం) - పి. సూరిబాబు
- వ్రతములోనర్చు కాలమున వారిరుహాస్యలు శక్తియుక్తి (పద్యం) - ఎస్. వరలక్ష్మి
- శన్నో మిత్రశ్య౦ వరుణ: శన్నోభవత్పర్యమాన్ (శ్లోకం) -
- సరసుడ బిగువింక చాలునురా సరసకు నను జేర్చి - పి. సుశీల
- సర్వేశ్వరుండగు శౌరికింకరు సేయు ధనమున్నది (పద్యం) - పి. సూరిబాబు
- సూర్యాన్వయాంభోది సుభ్రాంశుడైన సత్రాజిత్తునింట (పద్యం) - పి. సూరిబాబు
- సేవలు గొంటయే కాని సేవించుయెరుంగ (పద్యం) - పి. సూరిబాబు
మూలాలు
[మార్చు]- ↑ "Sri Krishna Thulabharam (1955)". Indiancine.ma. Retrieved 2022-12-25.