శొంఠి శ్రీనివాసమూర్తి
శొంఠి శ్రీనివాసమూర్తి | |
---|---|
జననం | శొంఠి శ్రీనివాసమూర్తి 1914, ఆగస్టు 8 లేపాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా |
మరణం | 1979 |
వృత్తి | ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | కవి |
మతం | హిందూ |
తండ్రి | గుండప్ప |
తల్లి | వెంకమాంబ |
శొంఠి శ్రీనివాసమూర్తి (జ. 1914, ఆగస్టు 8 - 1979) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి.[1]
జననం, కుటుంబ నేపథ్యం
[మార్చు]శొంఠి శ్రీనివాసమూర్తి 1914, ఆగస్టు 8న శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షిలో జన్మించాడు. తల్లి వెంకమాంబ, తండ్రి గుండప్ప.[2]
విద్యాభ్యాసం, ఉద్యోగం
[మార్చు]శ్రీనివాసమూర్తి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ శిక్షణ పొంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1964లో పదవీ విరమణ పొందాడు.[2]
సాహిత్య ప్రస్థానం
[మార్చు]శ్రీనివాసమూర్తి కి బాల్యం నుండే భారత, భాగవత, రామాయణ పద్య కావ్యాలను చదవడంలో ఆసక్తి ఉండేది. విద్యార్థి దశలోనే ఇతడు పద్యాలు రాయడం ప్రారంభించాడు.[2]
శ్రీశైల యాత్ర, శతక రచన
[మార్చు]శ్రీనివాసమూర్తి అనుకోకుండా శ్రీశైలం వెళ్లడం జరిగింది. అక్కడ ముఖ్యమైన క్షేత్రాలను, తీర్థాలను సందర్శించి, శ్రీ భ్రమరాంబ, మల్లికార్జునులను దర్శించాడు. అప్పుడే అతనికి "శ్రీశైల మల్లేశ్వరా" అనే మకుటంతో ఒక శతకం రాయాలనే సంకల్పం కలిగింది. కొన్ని రోజులలోనే శతకాన్ని పూర్తి చేసి, భక్తుల ఆర్థిక సహాయంతో దానిని ముద్రించాడు.[2]
కుటుంబం
[మార్చు]శ్రీనివాసమూర్తి కుమారుడు శొంఠి వెంకటాచలం హిందూపురం పట్టణంలోని నేతాజీ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ రాయలసీమ రచయితల చరిత్ర మూడవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
- ↑ 2.0 2.1 2.2 2.3 కల్లూరు అహోబలరావు (1981-08-01). రాయలసీమ రచయితల చరిత్ర-మూడవ సంపుటి.
- ↑ కల్లూరు అహోబలరావు (1981-08-01). రాయలసీమ రచయితల చరిత్ర-మూడవ సంపుటి.