శెట్టిపల్లె రఘురామిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్‌.రఘురామిరెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014- 2020
1999 - 2004
1985 - 1989
నియోజకవర్గం మైదుకూరు

వ్యక్తిగత వివరాలు

జననం 20 జూన్ 1946
నక్కలదిన్నె గ్రామం , చాపాడు మండలం , వైఎస్ఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ,కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు శెట్టిపల్లె చిన్న నాగిరెడ్డి , సుబ్బమ్మ
జీవిత భాగస్వామి ప్రభావతమ్మ
సంతానం నాగిరెడ్డి, అశోక్‌రెడ్డి, దుశ్యంత్‌రెడ్డి, సుధా

శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు మైదుకూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఎస్‌.రఘురామిరెడ్డి 20 జూన్ 1946లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వైఎస్ఆర్ జిల్లా , చాపాడు మండలం , నక్కలదిన్నె గ్రామం లో శెట్టిపల్లె చిన్న నాగిరెడ్డి , సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన విజవాడలో పదవ తరగతి పూర్తి చేసాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

ఎస్‌.రఘురామిరెడ్డి 1982లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారిగా ప్రొద్దుటూరు సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఆయన 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. ఎల్. రవీంద్రా రెడ్డి పై ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీ లోకి అడుగు పెట్టాడు.

ఆయన 1989లో ఓటమి పాలై తిరిగి 1994లో ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎస్‌.రఘురామిరెడ్డి 2004, 2009లో ఓటమి పాలయ్యాడు. ఆయన 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[4] ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో మైదుకూరు నుండి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ చేతిలో 20950 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]

పోటీ చేసిన స్థానం

[మార్చు]
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2024 పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం శెట్టిపల్లె రఘురామిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ
2019 శెట్టిపల్లె రఘురామిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం
2014 శెట్టిపల్లె రఘురామిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం
2009 డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం
2004 డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం
1999 శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్
1994 డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం
1989 డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం
1985 శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (24 May 2019). "కడప జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
  2. Bharat, E. T. V. (2024-06-04). "ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి ఆధిక్యం". ETV Bharat News. Retrieved 2024-06-05.
  3. Sakshi (18 March 2019). "కడప బరిలో..వైఎస్సార్‌ సీపీ దళం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  4. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  5. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Mydukur". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.