శుభాంగి గోఖలే
శుభాంగి గోఖలే | |
---|---|
జననం | ఖమ్గావ్, బుల్ఢానా, మహారాష్ట్ర | 1968 జూన్ 2
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | మోహన్ గోఖలే
(m. 1989; died 1999) |
పిల్లలు | సఖి గోఖలే |
శుభాంగి గోఖలే మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి. దూరదర్శన్ షో మిస్టర్ యోగిలో టైటిల్ రోల్ పోషించిన దివంగత హిందీ/మరాఠీ నటుడు మోహన్ గోఖలే భార్య.[1] ప్రశాంత్ దామ్లేతో కలిసి నటించిన సఖర్ ఖల్లియా మనుస్ అనే ప్రముఖ నాటకం 300 కంటే ఎక్కువ ప్రదర్శనలను పూర్తిచేసింది.
జననం, విద్య
[మార్చు]శుభాంగి 1968, జూన్ 2న మహారాష్ట్రలోని ఖమ్‌గావ్‌లో జన్మించింది.[2] శుభాంగి తండ్రి జిల్లా న్యాయమూర్తి కాగా, తల్లి గృహిణి. తన తండ్రి ఉద్యోగం కారణంగా జల్నా, మల్కాపూర్, బుల్దానా వంటి అనేక ఇతర జిల్లాలలో తన బాల్యం గడిచింది. ఔరంగాబాద్‌లోని ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నప్పుడు ఒక నాటకంలో పాల్గొంది. నటిగానే కాకుండా రచయిత్రిగా కూడా అనేక చిన్న కథలు, కథనాలు రాసింది. లపతగంజ్‌లో మిశ్రీ మౌసి పాత్ర, శ్రీయుత్ గంగాధర్ తిప్రేలో శ్యామల పాత్ర ఆమెకు పేరు తెచ్చాయి.[3] 2018 సఖర్ ఖల్లెలా మనుస్ అనే నాటకంలో ప్రశాంత్ దామ్లేతో కలిసి నటించింది.[4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]1989లో మోహన్ గోఖలేతో శుభాంగి వివాహం జరిగింది. వీరిద్దరూ కలిసి మిస్టర్ యోగి అనే టెలివిజన్ మినిసిరీస్‌లో నటించారు. వివాహం తర్వాత టెలివిజన్, నాటకరంగం నుండి దాదాపు పదేళ్ళపాటు విరామం తీసుకుంది. 1999లో తన భర్త మరణించాడు. ఆ తర్వాత శ్రీయుత్ గంగాధర్ తిప్రే అనే టెలివిజన్ సీరియల్ ద్వారా మళ్ళీ నటనారంగంలోకి వచ్చింది.
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర |
---|---|---|
2000 | హే రామ్ | రాణి |
2001 | మోక్ష: సాల్వేషన్ | |
2004 | అగా బాయి అరేచా! | శ్రీమతి. బెనారె |
2009 | బోక్యా సత్బండే | వైశాలి సత్బండే |
2009 | కోన్ ఆహే రే టికాడే | |
2009 | స ససుచ | కార్తీక్ తల్లి |
2010 | జెండా | |
2010 | క్షణభర్ విశ్రాంతి | జిజి |
2018 | దసరా[5] | రుద్ర తల్లి |
2021 | కార్ఖానిసంచి వారి: యాషెస్ ఆన్ ఏ రోడ్ ట్రిప్ | |
బస్తా | స్వాతి తల్లి |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ఛానల్ |
---|---|---|---|
1989 | మిస్టర్ యోగి | యోగేష్ భార్య | దూరదర్శన్ |
2000 | కోశిష్ – ఏక్ ఆషా[6] | కాజల్ తల్లి | జీ టీవీ |
2001-2004 | శ్రీయుత్ గంగాధర్ తిప్రే | శ్యామల తిప్రే | ఆల్ఫా టీవీ మరాఠీ |
2009-2010 | అగ్నిహోత్ర | రోహిణి రావు | స్టార్ ప్రవాహ |
2009-2014 | లపతగంజ్ | మిశ్రీ మౌసి | సోనీ సబ్ |
2011-2017 | చిడియా ఘర్ | మురగేశ్వరి దేవి | సోనీ సబ్ |
2013-2014 | ఏక లగ్నాచి తీస్రీ గోష్ట | శోభనా చౌదరి | జీ మరాఠీ |
2014-2015 | హమ్ హై నా | లక్ష్మి (అమ్మాజీ) మిశ్రా | సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ |
2016-2017 | కహే దియా పర్దేస్[7] | సరితా సావంత్ | జీ మరాఠీ |
2018 | బీచ్‌వాలే – బాపు దేఖ్ రహా హై[8] | రీటా | సోనీ సబ్ |
2019–ప్రస్తుతం | రాజా రాణిచి గా జోడి | కుసుమావతి ధలే-పాటిల్ | కలర్స్ మరాఠీ |
2021 | యేయు కాశీ తాషి మే నందయ్లా | శకుంతల (శకు) ఖాన్విల్కర్ | జీ మరాఠీ |
2022 | బస్ బాయి బాస్ లేడీస్ స్పెషల్ | అతిథి | జీ మరాఠీ |
మేడం సార్ | చిరుత అత్త | సోనీ సబ్ |
నాటకాలు
[మార్చు]- సూర్ రాహు దే
- సఖర్ ఖల్లెల మనుస్
మూలాలు
[మార్చు]- ↑ Chaturvedi, Vinita (6 June 2018). "I love to shop wherever I stage a play: Shubhangi Gokhale". The Times of India. Retrieved 2022-12-19.
- ↑ "Mohan Gokhale is dead". Rediff. 29 April 1999. Retrieved 2022-12-19.
- ↑ Chaturvedi, Vinita (25 May 2018). "Marathi audience is open to serious, experimental theatre: Shubhangi Gokhale". The Times of India. Retrieved 2022-12-19.
- ↑ Latkar, Ketaki (3 May 2018). "Sakhar Khallela Manus: Of millenials v/s Parents". The Times of India. Retrieved 2022-12-19.
- ↑ Gupta, Rachit (26 October 2018). "A jaded action movie with over-the-top stunts". The Times of India. Retrieved 2022-12-19.
- ↑ "Sandhya Mridul on Koshish-Ek Aashaa: Friends thought I could not pull off Kajal's role". Hindustan Times. 2 March 2017. Retrieved 2022-12-19.
- ↑ "वास्तवदर्शी भूमिकांचा ध्यास". Maharashtra Times. 20 October 2018. Archived from the original on 2019-12-30. Retrieved 2022-12-19.
- ↑ "Sony SAB Launches 'Beechwale – Bapu Dekh Raha Hai'". India West. 27 September 2018. Archived from the original on 2019-03-27. Retrieved 2022-12-19.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శుభాంగి గోఖలే పేజీ