శివుని వేయి నామములు- 401-500
శివ సహస్రనామ స్తోత్రములోని తరువాతి నూరు నామముల అర్ధాలు:
శ్లోకము 41
[మార్చు]సిద్ధయోగీ = సిద్ధించిన యోగము కలవాడు
మహర్షిః = ఋషులలో గొప్పవాడు
సిద్ధార్థః = సిద్ధించిన ప్రయోజనము కలవాడు
సిద్ధసాధకః = సిద్ధమగునట్లు సాధించువాడు
భిక్షుః = భిక్షాటనము చేయువాడు
భిక్షురూపః = భిక్షుకుల రూపమున ఉన్నవాడు
విపణః = వస్తువుల క్రయవిక్రయములు చేయువాడు
మృదుః = మెత్తనైనవాడు
అవ్యయః = నాశము లేనివాడు
శ్లోకము 42
[మార్చు]మహాసేనః = గొప్ప సేన కలవాడు
విశాఖః = కుమారస్వామి (సేనాపతి) తానే అయినవాడు
షష్టిభాగః = కాలమును అరవై భాగములుగ విభజించినవాడు
గవాంపతిః = గోవుల యొక్క పతి (వృషభము) తానే అయినవాడు
వజ్రహస్తః = వజ్రాయుధము చేతియందు కలవాడు
విస్రంభః = స్వేచ్ఛగా సంచరించువాడు
చమూస్తంభః = సేనా సమూహమును నిరోధించువాడు
శ్లోకము 43
[మార్చు]వృత్తావృత్తకరః = వృత్తం (యుద్ధభూమిలో రథంతో మండలాకారం ఏర్పడటం), ఆవృత్తం (శత్రుసైన్యాన్ని నశింపజేసి ఎట్టి గాయం లేకుండా తిరిగిరావటం) రెంటిని నైపుణ్యంగా చేయువాడు
తాలః = తాళ స్వరూపము తానే అయినవాడు
మధుః = వసంత ఋతువు రూపము తానే అయినవాడు
మధుకలోచనః = తుమ్మెదల వంటి నల్లని కనుపాపలు కలవాడు
వాచస్పత్యః = వాగ్దేవి యొక్క భర్త అయిన బ్రహ్మ తానే అయినవాడు
వాజసనః = శుక్ల యజుర్వేద శాఖా ప్రవర్తకుడు (వాజసనుడు) తానే అయినవాడు
నిత్యం ఆశ్రిత పూజితః = ఎల్లప్పుడు తనను ఆశ్రయించిన వారిచేత పూజింపబడినవాడు
శ్లోకము 44
[మార్చు]బ్రహ్మచారీ = వేద మార్గమునందు సంచరించువాడు
లోకచారీ = లోకమునందు సంచరించువాడు
సర్వచారీ = సమస్త ప్రదేశములందు సంచరించువాడు
విచారవిత్ = ఆలోచనా పరిజ్ఞానము కలవాదు
ఈశానః = ఈశానుడు (శివుడు)
ఈశ్వరః = ఐశ్వర్యము కలవాడు
కాలః = మృత్యురూపము తానే అయినవాడు
నిశాచారీ = రాత్రులందు సంచరించువాడు
పినాకభృత్ = పినాకమను పేరుగల ధనుస్సును ధరించినవాడు
శ్లోకము 45
[మార్చు]నిమిత్తస్థః = ప్రకృతి సన్నివేశములందు ఉండువాడు
నిమిత్తం = ప్రకృతి సన్నివేశములు తానే అయినవాడు
నందిః = నందిరూపము తానే అయినవాడు
నాందీకరః = ఆనందము కలుగజేయువాడు
హరిః = విష్ణు రూపమైనవాడు
నందీశ్వరః = వృషభరూపము తానే అయినవాడు
నందీ = ఆనందరూపము తానే అయినవాడు
నందనః = ఆనందము కలుగజేయువాడు
నందివర్ధనః = ఆనంద స్థితిని వృద్ధి చేయువాడు
శ్లోకము 46
[మార్చు]భగహారీ = ఐశ్వర్యమును హరించువాడు
నిహంతా = చంపువాడు
కాలః = కాలరూపము తానే అయినవాడు
బ్రహ్మా = సృష్టికర్తయైన బ్రహ్మ తానే అయినవాడు
పితామహః = తానే బ్రహ్మ అయినవాడు
చతుర్ముఖః = నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మ తానే అయినవాడు
మహాలింగః = గొప్పదైన లింగాకారమున ఉన్నవాడు
చారులింగః = సుందరమైన లింగాకారమున ఉన్నవాడు
శ్లోకము 47
[మార్చు]లింగాధ్యక్షః = లింగాకారములన్నిటికి అధిపతి
సురాధ్యక్షః = దేవతలకు అధిపతి
యోగాధ్యక్షః = సమస్త యోగశాస్త్రమునకు అధిపతి
యుగావహః = సమస్త కాలమును ఆవహించియుండువాడు
బీజాధ్యక్షః = సృష్టియొక్క మూలమునకు అధిపతి
బీజకర్తా = సృష్టియొక్క మూలమును కలుగజేయువాడు
అధ్యాత్మానుగతః = ఆత్మజ్ఞానమును అనుసరించినవాడు
బలః = బలరూపము తానే అయినవాడు
శ్లోకము 48
[మార్చు]ఇతిహాసః = పూర్వచరిత్ర కలవాడు
సకల్పః = సృష్టితో మొదటి నుండియు కలసియున్నవాడు
గౌతమః = గౌతమ ఋషి తానే అయినవాడు
నిశాకరః = చంద్రుడు తానే అయినవాడు
దంభః = మిక్కిలి అట్టహాసము కలిగినవాడు
అదంభః = అట్టహాసము లేనివాడు
వైదంభః = దంభము లేనివాడు
వశ్యః = భక్తులకు అధీనుడైనవాడు
వశకరః = ఆకర్షణ గుణము కలవాడు
కలిః = కలి పురుషుడు తానే అయినవాడు
శ్లోకము 49
[మార్చు]లోకకర్తా = లోకమును నడిపించువాడు
పశుపతిః = నరరూపములో ఉన్న జంతువులకు అధిపతి
మహాకర్తా = గొప్పవాడై లోకములను నడిపించువాడు
అనౌషధః = ఔషధములు అక్కరలేనివాడు
అక్షరం = నాశములేని
పరమం = శ్రేష్టమైన
బ్రహ్మ = జగత్తునకు మూలమైన బ్రహ్మ పదార్ధము తానే అయినవాడు
బలవాన్ = బలము కలవాడు
శక్తః = సమర్థుడైనవాడు
శ్లోకము 50
[మార్చు]నీతిః = నియమ (ధర్మ) శాస్త్రము తానే అయినవాడు
అనీతిః = నియమము లేనివాడు
శుద్ధాత్మా = పరిశుద్ధమైన ఆత్మ కలవాడు
శుద్ధః = పరిశుద్ధమైన; శుచియైనవాడు
మాన్యః = గౌరవింప తగినవాడు
గతాగతః = జరిగినది, జరుగబోవునది తానే అయినవాడు
బహుప్రసాదః = మిక్కిలి అనుగ్రహము కలవాడు
సుస్వప్నః = మంచి కలగా కనిపించువాడు
దర్పణః = ప్రకృతియొక్క ప్రతిబింబము చూపించువాడు
అమిత్రజిత్ = శత్రువులను జయించినవాడు