శివలెంక శంభు ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివలెంక శంభుప్రసాద్
సతీమణి కామాక్షమ్మ, వారి పెంపుడు కుక్కతో యవ్వనంలో శంభుప్రసాద్
జననం(1911-01-26)1911 జనవరి 26
ఎలకుర్రు, కృష్ణా జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ
మరణం1972 జూన్ 8(1972-06-08) (వయసు 61)
చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లుఅయ్యవారు
విద్యాసంస్థ
వృత్తివిలేఖరి, ఎం. పి, ఎం. ఎల్. సి
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామికామాక్షమ్మ
తల్లిదండ్రులు
  • ఎస్. శివబ్రహ్మం (తండ్రి)

శివలెంక శంభు ప్రసాద్ (1911 - 1972) ప్రముఖ పత్రికా సంపాదకులు.[1]

వీరు కృష్ణా జిల్లా ఎలకుర్రులో జన్మించారు. వీరు జాతీయ కళాశాల, థియోసాఫికల్ హైస్కూలులో చదివి శాంతినికేతన్ లో పట్టభద్రులయ్యారు. వీరు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి కుమార్తెను పెళ్ళాడి, అతని తర్వాత 1938 సంవత్సరంలో ఆంధ్ర పత్రిక, భారతి పత్రికలకు సంపాదకులుగా 34 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా నిర్వహించి వృద్ధి చేశారు. తెలుగు పత్రికా రంగంలో ఎన్నో క్రొత్త రీతులను ప్రవేశపెట్టారు. వీరు ప్రెస్ ట్రస్టు ఆఫ్ ఇండియా డైరెక్టరుగా కొంతకాలం వ్యవహరించారు. పడక కుర్చీ భావాలు శీర్షికతో వ్యంగ్య వ్యాసాలు, తెలుగు వెలుగులు శీర్షికతో ప్రముఖులైన ఆంధ్రుల పరిచయాలు వీరి రచనలలో ఉత్తమమైనవి.

వీరు కొంతకాలం రాజ్యసభ సభ్యులుగాను, కొంతకాలం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగాను ఉన్నారు..

మూలాలు

[మార్చు]
  1. "ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక". ఆంధ్రపత్రిక. ఆంధ్రపత్రిక. 1960–1961. Retrieved 2 January 2015.{{cite news}}: CS1 maint: date format (link)