Jump to content

శామ్యూల్ గోల్డ్‌విన్ జూనియర్

వికీపీడియా నుండి
శామ్యూల్ గోల్డ్‌విన్ జూనియర్
జననం
శామ్యూల్ జాన్ గోల్డ్‌విన్ జూనియర్

(1926-09-07)1926 సెప్టెంబరు 7
మరణం2015 జనవరి 9(2015-01-09) (వయసు 88)
సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్‌, లాస్ ఏంజిల్స్‌, కాలిఫోర్నియా, యుఎస్
వృత్తినిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1948–2015
జీవిత భాగస్వామి
జెన్నిఫర్ హోవార్డ్
(m. 1950; div. 1968)
పెగ్గీ ఇలియట్‌
(m. 1969; div. 2005)
ప్యాట్రిసియా స్ట్రాన్‌
(m. 2010)
పిల్లలు6, (టోనీ గోల్డ్‌విన్, జాన్ గోల్డ్‌విన్, లిజ్ గోల్డ్‌విన్)
తల్లిదండ్రులు

శామ్యూల్ జాన్ గోల్డ్‌విన్ జూనియర్ (1926, సెప్టెంబరు 7 - 2015, జనవరి 9) అమెరికన్ సినిమా నిర్మాత.

జననం

[మార్చు]

శామ్యూల్ గోల్డ్‌విన్ జూనియర్ 1926, సెప్టెంబరు 7న శామ్యూల్ గోల్డ్‌విన్ - ఫ్రాన్సిస్ హోవార్డ్ దంపతులకు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జన్మించాడు. తండ్రి సినిమా దర్శకుడు కాగా, తల్లి సినీనటి. కొలరాడో స్ప్రింగ్స్, కొలరాడోలోని ఫౌంటెన్ వ్యాలీ స్కూల్, వర్జీనియా విశ్వవిద్యాలయంలో చదివాడు.[1] తన తల్లి ఒత్తిడితో క్యాథలిక్‌గా పెరిగాడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1950లో ప్రముఖ రచయిత, స్క్రీన్ ప్లే రచయిత సిడ్నీ హోవార్డ్ కుమార్తె జెన్నిఫర్ హోవార్డ్ తో గోల్డ్‌విన్ వివాహం జరిగింది. వీరికి నటుడు టోనీ గోల్డ్‌విన్, స్టూడియో ఎగ్జిక్యూటివ్ జాన్ గోల్డ్‌విన్‌తో సహా నలుగురు పిల్లలు ఉన్నారు. గోల్డ్‌విన్ దంపతులు 1968లో విడాకులు తీసుకున్నారు. పెగ్గీ ఇలియట్‌ను రెండవ వివాహం చేసుకున్నాడు. వారికి లిజ్ గోల్డ్‌విన్‌తో సహా ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండవ వివాహం కూడా విడాకులతో ముగిసింది. మరణ సమయంలో తన మూడవ భార్య, ప్యాట్రిసియా స్ట్రాన్‌ను వివాహం చేసుకున్నాడు.[3]

సినిమారంగం

[మార్చు]

ప్రపంచ యుద్ధం II సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీలో పనిచేసిన తర్వాత, లండన్‌లో నాటకరంగంలో నిర్మాతగా, న్యూయార్క్‌లోని సిబిఎస్ లో ఎడ్వర్డ్ ఆర్. ముర్రో దగ్గర పనిచేశాడు.[3] తరువాత తన తండ్రి బాటలో మోషన్ పిక్చర్ నిర్మాణ సంస్థలైన ఫార్మోసా ప్రొడక్షన్స్, ది శామ్యూల్ గోల్డ్‌విన్ కంపెనీ, శామ్యూల్ గోల్డ్‌విన్ ఫిల్మ్‌లను స్థాపించాడు.[4]

సినిమాలు (కొన్ని)

[మార్చు]

కింది అన్ని సినిమాలకు నిర్మాతగా ఉన్నాడు.

సినిమా

[మార్చు]
సంవత్సరం సినిమా విభాగం ఇతర వివరాలు
1948 గుడ్ టైం గర్ల్ అసోసియేట్ నిర్మాత
1955 మాన్ విత్ ది గన్
1956 ది షార్క్ ఫైటర్స్
1958 ది ప్రౌడ్ రెబెల్
1960 ది అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్‌బెర్రీ ఫిన్
1964 ది యంగ్ లవర్స్
1970 కాటన్ కాఫ్మ్స్ టు హార్లెమ్
1972 కమ్ బ్యాక్, చార్లెస్టన్ బ్లూ
1979 ది విజిటర్ ఎక్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్
1983 ది గోల్డెన్ సీల్
1985 ఒన్స్ బీటెన్ ఎక్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్
1987 ఎ ప్రేయర్ ఫర్ ది డైయింగ్
ఫాటల్ బ్యూటీ ఎక్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్
1988 మిస్టిక్ పిజ్జా ఎక్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్
1990 స్టెల్లా
1991 రాక్-ఎ-డూడుల్ ఎక్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్
1993 ది ప్రోగ్రాం
1996 ది ప్రీచర్స్ వైఫ్
2001 టోర్టిల్లా సూప్ ఎక్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్
2003 మాస్టర్ అండ్ కమాండర్: ది ఫార్ సైడ్ ఆఫ్ ది వరల్డ్
2013 ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టి నిర్మాతగా ఆఖరి చిత్రం
ఇతర విభాగాలు
సంవత్సరం సినిమా పాత్ర
1952 కిల్లర్ వాక్స్ ప్రెజెంటర్: ఒరిజినల్ ప్లే
1955 మాన్ విత్ ది గన్ ప్రెజెంటర్
1958 ప్రౌడ్ రెబెల్
దర్శకుడిగా
సంవత్సరం సినిమా
1964 ది యంగ్ లవర్స్

కృతజ్ఞతలు

సంవత్సరం సినిమా పాత్ర
1997 వెల్ కం టు వూప్ వూప్‌ ప్రత్యేక కృతజ్ఞతలు
2016 వూజ్ డ్రైవింగ్ డౌగ్ నిర్మాతల కృతజ్ఞతలు

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు విభాగం ఇతర వివరాలు
1956 స్నీక్ ప్రివ్యూ
1967 ఆఫ్ టు సీ ది విజార్డ్‌
1987 59వ అకాడమీ అవార్డులు టెలివిజన్ ప్రత్యేకం
1988 60వ అకాడమీ అవార్డులు టెలివిజన్ ప్రత్యేకం
ఏప్రిల్ మార్నింగ్ ఎక్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ టెలివిజన్ సినిమా
1996-97 ఫ్లిప్పర్ ఎక్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్

మరణం

[మార్చు]

గోల్డ్‌విన్ తన 88 సంవత్సరాల వయస్సులో 2015, జనవరి 9న గుండెపోటుతో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్‌లో మరణించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Maurer, David A. (May 4, 2014). "Yesteryears: UVa alumnus Samuel Goldwyn Jr. passed along sterling advice to alma mater". The Daily Progress. Retrieved 2023-06-06.
  2. Goldstein, Patrick (October 2, 2001). "The Master Storyteller and the Truth He Chose Not to Tell". Los Angeles Times.
  3. 3.0 3.1 "Samuel Goldwyn Jr., Hollywood Scion, Dies at 88". The New York Times. January 9, 2015. Retrieved 2023-06-06.
  4. Dagan, Carmel (January 9, 2015). "Samuel Goldwyn Jr. Dies at 88". Variety (magazine). Penske Media Corporation. Retrieved 2023-06-06.
  5. "Samuel Goldwyn Jr Dead; Producer, Executive & Son Of Movie Mogul Was 88". Deadline.com. January 9, 2015. Retrieved 2023-06-06.

బయటి లింకులు

[మార్చు]