Jump to content

శాంతా హుబ్లికర్

వికీపీడియా నుండి
శాంతా హుబ్లికర్
జననం
రాజమ్మ

(1914-04-14)1914 ఏప్రిల్ 14
అదరగుంచి, హుబ్బల్లి, కర్ణాటక
మరణం1992 జూలై 17(1992-07-17) (వయసు 78)
వృత్తి
  • actress
  • singer
క్రియాశీల సంవత్సరాలు1934–1963
జీవిత భాగస్వామిబాపుసాహెప్ గీతే (1939-1977)
పిల్లలు1

శాంతా హుబ్లికర్ (1914 ఏప్రిల్ 14 - 1992 జూలై 17), కర్ణాటకకు చెందిన సినిమా నటి, గాయని. 1934 నుండి 1963 వరకు మరాఠీ, హిందీ, కన్నడ సినిమాలలో నటించింది. శాంతా పాడిన పాటటలో ఆద్మీ[1] సినిమాలో అబ్ కిస్ లియే కల్కీ బాత్, మనోస్ సినిమాలోని కషాలా ఉద్యాచి బాత్[2] పాటలు విపరీతమైన ప్రజాదరణ పొందాయి.

జననం

[మార్చు]

శాంతా హుబ్లికర్ 1914 ఏప్రిల్ 14న కర్ణాటకలోని హుబ్బల్లి సమీపంలోని అదరగుంచి అనే గ్రామంలో జన్మించింది.[3] కన్నడ, మరాఠీ, హిందీ భాషలలో ప్రావీణ్యాన్ని సంపాదించుకుంది. తన 18వ ఏట సినిమాల్లో పనిచేయడానికి కొల్హాపూర్‌కి వచ్చింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

శాంతకు 1939లో పూణేకు చెందిన వ్యాపారవేత్త బాపుసాహెప్ గీతేతో వివాహం జరిగింది.

సినిమారంగం

[మార్చు]

1934లో మొదటిసారిగా భేడీ రాజ్‌కుమార్/థాక్సేన్ రాజ్‌పుత్ర సినిమాలో చిన్న పాత్రలో నటించింది. కన్హోపాత్ర (1937) సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ప్రభాత్ ఫిల్మ్ కంపెనీలో చేరి 1938లో మఝా ముల్గా/మేరా లడ్కా అనే మరాఠీ-హిందీ ద్విభాషా సినిమాలో నటించింది.[4] తన గానం, నటన ద్వారా దర్శకుడు వి. శాంతారాంని మెప్పించింది. దాంతో వి. శాంతారాం తీసిన ఆద్మీ/మనూస్‌ (హిందీ, మరాఠీ) సినిమాల్లో వేశ్య పాత్రలో నటించే అవకాశం వచ్చింది.[5]

ఆద్మీ సినిమా విజయం తర్వాత శాంత, 1942[6] తన ఏకైక కన్నడ చిత్రం జీవన నాటకంతోపాటు ఇతర సినిమాలలో నటించింది.

ఆత్మకథ

[మార్చు]

శాంత మరాఠీలో కషాలా ఉద్యాచి బాత్ అనే పేరుతో తన స్వీయచరిత్రను రాసింది. ఈ పుస్తకాన్ని శ్రీవిద్యా పబ్లికేషన్స్ ప్రచురించింది.[7]

పుస్తకం

[మార్చు]

కన్నడ భాషలో ప్రముఖ రచయిత ఏఎన్‌ ప్రహ్లాదరావు 'శాంత హుబ్లీకర్' అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకాన్ని రాష్ట్రోత్తహన పరిషత్ ప్రచురించింది. 

మరణం

[మార్చు]

1977లో భర్త మరణించిన తర్వాత కొంతకాలం ఒంటరి జీవితాన్ని గడిపింది. ఆ తరువాత పూణేలోని ఒక వృద్ధాశ్రమంలో చేరింది. 1992 జూలై 17న మరణించింది.[8]

సినిమాలు

[మార్చు]

శాంతా హుబ్లికర్ సినిమాలు.[9]

  • భేడ్కా రాజ్‌కుమార్ (1934)
  • కన్హోపాత్ర (1937)
  • మేరా లడ్కా (1937)
  • మనోస్/ఆద్మీ (1939)[10]
  • ఘర్ కీ లాజ్ (1941)
  • పహిలా పల్నా (1942)
  • జీవన నాటక (1942)
  • మలన్ (1942)
  • కుల్ కలాంక్ (1945)
  • జీవన్ ఛాయా (1946)
  • సౌభాగ్యవతి భావ్ (1958)
  • ఘర్ గృహస్తి (1958)
  • హాలీడే ఇన్ బొంబాయి (1963)

మూలాలు

[మార్చు]
  1. "Shantaram's 'Aadmi'". indiavideo.org.
  2. Shukla, Rupali (7 September 2014). "V Shantaram's revolutionary film 'Manoos' completes 75 years". Bennett, Coleman & Co. Ltd. Times of India. Retrieved 2022-05-29.
  3. "Imprints and Images of Indian Film Music". facebook.com.
  4. "Prabhat Films List". Prabhat films.com. Archived from the original on 2012-07-22. Retrieved 2022-05-29.
  5. "Still of Shanta Hublikar". Arts and Culture.google.com.
  6. "Celebrity Shanta Hublikar". Chiloka.com.
  7. "Shanta Hublikar's autobiography "Kashala Udyachi Baat"". Srividya publication(Amazon.in). Jan 1, 2017.
  8. "Shanta Hublikar lifestory". MarathiSrushti.com.
  9. "Shanta hublikar filmography". cinestaan.com. Archived from the original on 2021-01-16. Retrieved 2022-05-29.
  10. "Trailblazing Marathi Movie Manoos Completes 75 Years - NDTV Movies". NDTVMovies.com.

బయటి లింకులు

[మార్చు]