శర్వాణి పిళ్ళై
స్వరూపం
శర్వాణి పిళ్ళై | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1998-ప్రస్తుతం |
శర్వాణి పిళ్ళై, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. అవంతిక అనే మరాఠీ సీరియల్ లో, 1998లో వచ్చిన తూ తిథే మీ అనే సినిమాలో నటించి గుర్తింపు పొందింది.[1]
టెలివిజన్
[మార్చు]శర్వాణి తొలిరోజుల్లో దామిని, అవంతిక, తుజా నీ మఝా ఘర్ శ్రీమంతచా, అంబట్ గౌడ్ వంటి టెలివిజన్ సీరియళ్ళలో నటించింది. హిందీ సిట్కామ్ అయిన దునియాలో కూడా పనిచేసింది. ప్రస్తుతం ముల్గి జాలి హో ప్రధాన పాత్రలో కనిపించింది.[2]
ప్రాంతీయ సినిమాలు
[మార్చు]తూ తిథే మీ సినిమాలో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. "నిషాని దావా అంగ్తా" అనే మరాఠీ సినిమాలో కూడా పనిచేసింది.[3]
బాలీవుడ్
[మార్చు]పరేష్ రావల్, అజయ్ దేవగన్ నటించిన అతిథి తుమ్ కబ్ జావోగే సినిమాలో కూడా శర్వాణి నటించింది.[4]
మరాఠీ నాటకం
[మార్చు]మకడచ్యా హాతీ షాంపైన్, అలీబాబా అని చలిషితలే చోర్ అనే ఆమె మరాఠీ నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించింది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | దర్శకుడు |
---|---|---|
1998 | తూ తిథే మీ | సంజయ్ సుర్కర్ |
2008 | జోగ్వా | రాజీవ్ పాటిల్ |
2010 | పంగిరా | రాజీవ్ పాటిల్ |
2011 | డియోల్ | ఉమేష్ కులకర్ణి |
2010 | అతిథి తుమ్ కబ్ జావోగే (హిందీ చిత్రం) | ధీర్ |
2018 | అసేహి ఏకదా వ్హావే | సుశ్రుత్ భగవత్ |
మూలాలు
[మార్చు]- ↑ "Sharvani Pillai: I'm happy to play a strong character on screen - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-06-16.
- ↑ "orkut". orkut.com. Archived from the original on 19 September 2013. Retrieved 2022-06-16.
- ↑ "'A kiss and a tale' | m 4 MOVIE". mformovie.in. Archived from the original on 2014-02-01. Retrieved 2022-06-16.
- ↑ bgbnd (2006-10-20). "Friday Review Bangalore / Theatre : Seemingly farcical". The Hindu. Archived from the original on 4 February 2014. Retrieved 2022-06-16.