శరత్ మండవ, దక్షిణ భారతసినిమాదర్శకుడు, స్క్రీన్ ప్లేరచయిత, సినిమాటోగ్రాఫర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తమిళ, తెలుగు సినిమాలకు పనిచేశాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన కో 2 అనే తమళ సినిమాకు దర్శకత్వం వహించాడు.[1] 2012లో అజిత్ కుమార్ హీరోగా వచ్చిన బిల్లా 2 సినిమాకు కథా, స్క్రీన్ ప్లే కథ రచయితగా పనిచేశాడు.[2]2012 జూలై 13న డేవిడ్ బిల్లా పేరుతో విడుదలైన తెలుగు వెర్షన్ సినిమాకు డైలాగ్స్ కూడా రాశాడు.[3]
తన సాఫ్ట్‌వేర్ వృత్తిని విడిచిపెట్టి సినిమారంగానికి వచ్చిన శరత్ మండవ, లండన్ లోని ఫిల్మ్ స్కూల్, కెంట్ (యునైటెడ్ కింగ్‌డమ్) లోని స్ట్రెయిట్ కర్వ్ ఫిల్మ్ స్కూల్ లో స్క్రిప్ట్ రైటింగ్ కోర్సు చేసాడు. ఆ తరువాత కొన్ని సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్, సహ రచయితగా పనిచేశాడు. 2016లో వచ్చిన కో 2 అనే తమిళ సినిమాకి దర్శకత్వం వహించాడు. తెలుగులో పోటుగాడు సినిమాతోపాటు కొన్ని తెలుగు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాడు.