శబల (ఖండ కావ్యం)
స్వరూపం
శబల | |
కృతికర్త: | తుమ్మల సీతారామమూర్తి చౌదరి |
---|---|
దేశం: | భారత దేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | ఖండ కావ్యం |
ప్రచురణ: | |
విడుదల: | 1955 |
శబల కవిలెంక తుమ్మల సీతారామమూర్తి చౌదరి రచించిన ఖండకావ్యం
రచన నేపథ్యం
[మార్చు]శబల గ్రంథం తెనుగు లెంక, అభినవ తిక్కన బిరుదాంకితుడైన తుమ్మల సీతారామమూర్తి చౌదరి 25.3.1955లో తొలిముద్రణ పొందింది. భారతి ప్రెస్ (తెనాలి)లో ప్రచురించారు.
ఇతివృత్తం
[మార్చు]శబల ఖండకావ్యం వివిధ పద్యకావ్య ఖండాల సంకలనం. శబల, సంక్రాంతి తలపులు, నా కథ-సీత, పశువైద్యం తదితర కావ్యఖండాలు ఈ కావ్యంలో ఉన్నాయి. అవన్నీ వేర్వేరు ఇతివృత్తాలను స్వీకరించి రచించినవి. సంక్రాంతి తలపులు కావ్యఖండంలో రైతు జీవితమును వర్ణించారు. నా కథ - సీత శీర్షికన రచించిన కావ్యఖండానికి సీతాదేవి తన కథను తాను చెప్పుకోవడం ఇతివృత్తం.
ఉదాహరణలు
[మార్చు]- ఘోర కదన వ్యాపార పారీణులై నుతికింజాలిన భూసురుల్గలరె తెన్గుం గడ్ద వర్జించినన్
- రైతు పుచ్చిన కొయ్యలో జిగురు పుట్టు నటుల్ వలి పాట పాడునని వ్రాసారు తుమ్మల వారు.
ఇతరుల మాటలు
[మార్చు]- ఈ కావ్యము పేరు సంక్రాంతి తలపులు (శబల గ్రంథంలో ఒక భాగం). ఇది నేటి యాంధ్ర భాషా కవిత్వములో శిరోభూషణమైన కవితా ఖండము.
- - విశ్వనాథ సత్యనారాయణ, సుప్రతిష్ఠుడైన కవి, రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత.