Jump to content

శంబంగి వెంకట చిన అప్పలనాయుడు

వికీపీడియా నుండి
శంబంగి వెంకట చిన అప్పలనాయుడు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019 - 3 జూన్ 2024
ముందు సుజయ్ కృష్ణ రంగారావు
తరువాత బేబీ నాయన
నియోజకవర్గం బొబ్బిలి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1955
పక్కి గ్రామం, బొబ్బిలి మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు సురాపా నాయుడు
జీవిత భాగస్వామి చిన్న అమ్మలు

శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బొబ్బిలి నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

శంబంగి వెంకట చిన అప్పలనాయుడు 1955లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పక్కి గ్రామంలో జన్మించాడు. ఆయన బి.ఏ వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

శంబంగి చిన అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి బొబ్బిలి నియోజకవరాగం నుం 1983,1985,1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి 1994లో విప్‌‌గా పని చేశాడు. ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయి అనంతరం ఏఐసీసీ నియమితుడయ్యాడు. అప్పలనాయుడు 25 మే 2018 న కాంగ్రెస్‌ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి,[1] 2019లో ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]శంబంగి వెంకట చిన అప్పలనాయుడు 6 జూన్ 2019న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా నియమితుడయ్యాడు.[3][4]

సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి పార్టీ పోలైన ఓట్లు
1983 శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ 40610 కె.ఎన్‌. వాసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ 23660
1985 శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ 44875 ఐ.వి. రమణమూర్తి కాంగ్రెస్ పార్టీ 15427
1989 పెద్దింటి జగన్మోహన రావు కాంగ్రెస్ పార్టీ 41809 శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ 41711
1994 శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ 38725 పెద్దింటి జగన్మోహన రావు కాంగ్రెస్ పార్టీ 23660
1999 పెద్దింటి జగన్మోహన రావు కాంగ్రెస్ పార్టీ 50803 శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ 41491
2004 సుజయ్ కృష్ణ రంగారావు కాంగ్రెస్ పార్టీ 53581 శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ 40891
2014 సుజయ్ కృష్ణ రంగారావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 83587 శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కాంగ్రెస్ పార్టీ 4966
2019 శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 84955 సుజయ్ కృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీ 76603

మూలాలు

[మార్చు]
  1. Sakshi (25 May 2018). "వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
  2. Sakshi (2019). "బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం విజేత 2019". Retrieved 10 January 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)[permanent dead link]
  3. HMTV (6 June 2019). "ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
  4. TV9 Telugu (8 June 2019). "ప్రోటెం స్పీకర్‌గా శంబంగి చిన్న అప్పలనాయుడు". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)