వోక్స్ వాగన్

వికీపీడియా నుండి
(వోల్క్స్ వాగన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వోక్స్ వ్యాగన్
రకంSubsidiary of వోక్స్ వ్యాగన్ గ్రూప్
పరిశ్రమAutomotive
స్థాపనమే 28, 1937
స్థాపకుడుఫెర్డినాండ్ పోర్షె, రాబర్ట్ లే
ప్రధాన కార్యాలయంవోల్ఫ్స్ బర్గ్, జర్మనీ
సేవ చేసే ప్రాంతము
Worldwide
కీలక వ్యక్తులు
Martin Winterkorn:
Chairman of the Board of Management,
Christian Klingler:
Board of Management of the Volkswagen Passenger Cars Ferdinand Piëch : Chairman of Volkswagen Supervisory Board
ఉత్పత్తులుకార్లు
రెవెన్యూ2,79,23,20,00,000 యూరో (2022) Edit this on Wikidata
22,12,40,00,000 యూరో (2022) Edit this on Wikidata
15,83,60,00,000 యూరో (2022) Edit this on Wikidata
మాతృ సంస్థVolkswagen Group Edit this on Wikidata
వెబ్‌సైట్Volkswagen.com (international) and VW.com (US)

Volkswagen Aktiengesellschaft (VAG) లేదా Volkswagen Group లేదా VW జర్మనీ లోని వోల్ఫ్స్ బర్గ్ కి చెందిన కారుల తయారీదారు.

ఆడి ఎ జీ, బెంట్లీ మోటార్స్ లిమిటెడ్, బుగాట్టి ఆటోమొబైల్స్ , సియట్, స్కోడా ఆటో, స్కానియా ఏ బీ వోల్క్స్ వాగన్ కి చెందిన సంస్థలు.

వోల్క్స్ వాగన్ (జర్మన్ లో ఫోల్క్స్ వాగన్ గా ఉఛ్ఛరిస్తారు) అనగా ప్రజల వాహనం అని అర్థం. ప్రస్తుతం దీని ఉపశీర్షిక డస్ ఆటో (ఆంగ్లంలో ద కార్ అని అర్థం). దీనికి పూర్వం దీని ఉపశీర్షిక Aus Liebe zum Automobil (ఆంగ్లంలో For Love of the Automobile) గా ఉండేది.

చరిత్ర

[మార్చు]

1930 నాటికి జర్మను ఆటోమొబైల్ పరిశ్రమలో అధిక భాగం విలాసవంతమైన మోడళ్ళతోనే నిండి ఉండటంతో, సగటు జర్మను తాహతు ఒక మోటారుసైకిల్ కి మించేది కాదు. దీనిని ఆసరా చేసుకొని కొన్ని కారు సంస్థలు "ప్రజల కారు" పేరుతో మెర్సిడెజ 170 ఏ హెచ్, ఆడ్లర్స్ ఆటోబాన్, స్టేయర్ 55, హనోమాగ్ 1, 3 ఎల్ లను చేపట్టాయి. అయితే బారెన్యై బేలా అనబడు హంగేరీ-ఆస్ట్రియన్ ఇంజనీరు 1920 నాటికే ఇటువంటి కారు నిర్మించటంతో ఈ ఒరవడిని అప్పటికి క్రొత్తదిగా భావించలేదు. జోసెఫ్ గంజ్ అనే జర్మన్-హంగేరియన్ కారు నిర్మాణదారు స్టాండర్డ్ సుపీరియర్ ను నిర్మించి దానిని "జర్మన్ వోల్క్స్ వాగన్"గా ప్రచారం చేశాడు. చెకొస్లొవాకియా లో హన్స్ లెడ్వింకా అనే ఆస్ట్రియన్ ఇంజినీరు రూపొందించిన జర్మనులలో మంచి పేరున్న టాట్రా టి 77 రాను రాను చిన్నది గా మారుతూ మరింత అందుబాటులోనికి వచ్చింది. 1933 నాటికి ఇటువంటి కారులు నిర్మాణ దశలో ఉన్న సమయంలోనే అడాల్ఫ్ హిట్లర్ దేశం "ప్రజల వాహనం" సమర్పించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇద్దరు పెద్దలు, ముగ్గురు పిల్లలు గంటకి వంద కి.మీ చొప్పున ప్రయాణం చేయగలిగే ఒక ప్రాథమిక మోడల్ కారు తన అవసరంగా వెలిబుచ్చాడు. హిట్లర్ పాలించే "థర్డ్ రైఖ్" అనే ప్రాంత ప్రజలకి 990 రైఖ్ మార్క్ ల ఆదాయ పథకానికి "ప్రజల వాహనం" ఇచ్చేవారు. (ఇది ఒక చిన్న మోటారు సైకిల్ ధర)

అప్పటికే చలామణిలో ఉన్న ఒక ప్రాజెక్టును పూర్తి చేయాలని ఒత్తిడి తెచ్చినా, హిట్లర్ "ప్రజల కారు"కే మొగ్గు చూపాడు. దీని కొరకు ఫెర్డ్రినాండ్ పోర్షె అను ఇంజినీరును ఎన్నుకొనబడ్డాడు. మెర్సిడెజ్ 170 హెచ్ ని రూపొందించటమే కాక స్టెయర్ లో కూడా పోర్షె కు అనుభవం ఉన్నది. తన స్వంత డిజైను స్టూడియో ప్రారంభించినప్పుడు ఎన్ ఎస్ యూ, జ్యుండాప్ అను రెండు మోటారు సైకిల్ రూపొందించే సంస్థలతో కలిసి "ఆటో ఫ్యూర్ యెడర్మన్" ("Auto für Jedermann-car for everybody") అను రెండు ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. రెండు ప్రాజెక్టులు బాలారిష్టాలు దగ్గరే ఆగిపోయినా వాటి ప్రాథమిక నమూనా ఇంకా పోర్షె మదిలో అలాగే ఉంది. 22 జూన్ 1934 న హిట్లర్ కోసం "ప్రజల కారు"ను రూపొందించటానికి పోర్షె అంగీకరించాడు.

ఆ నమూనాలకే ఇంధన వ్యయాన్ని తగ్గించేలా, ఉపయోగించటంలో సౌలభ్యం ఉండేలా, విడిభాగాలను సరి చేయటంలో ఖర్చు తక్కువ అయ్యేలా కొన్ని మార్పులు చేశారు. ఒక సగటు యూరోపియను వారానికి 5 మార్కులను పొదుపు చేసి సొంత కారును నడుపుకొనేలా ("Fünf Mark die Woche musst Du sparen, willst Du im eigenen Wagen fahren" — "Save five Marks a week, if you want to drive your own car") ఒక ఆదాయ పథకాన్ని రూపొందించగా, 3,36,000 వేల మంది ఆ పథకంలో చేరారు. "KdF-Wagen" (జర్మను: Kraft durch Freude — "strength through joy") వంటి మొదటి తరం కారులు 1936లో స్టుట్ట్ గార్ట్లో రూపొందించబడేవి. గుండ్రంగా, ఎయిర్-కండీషన్ సౌలభ్యంతో, ఇంజను కారుకు వెనుక వైపు ఉండేలా ఈ కార్లు రూపొందించబడేవి. వోక్స్ వ్యాగన్ KdF కార్యక్రమంలో యాత్రలు, ప్రయాణాలను పొందుపరచటంలో ఒక భాగమే. కార్లకే కాకుండా ఇతర వస్తువులకి కూడా అప్పటికే వోక్స్ అన్న పేరు ఉండేది. (ఉదా: రేడియో రిసీవర్లు). 16 సెప్టెంబరు 1938న "Volkswagenwerk GmbH" పునర్నామకరణం జరిగింది.

నేడు మనం చూస్తున్న బీటిల్ నమూనా ఎర్విన్ కమెండా అను ఇంజినీరు రూపొందించింది.

26 మే 1938 న ఇప్పటి వోల్ఫ్స్ బర్గ్ (అప్పట్లో KdF-ష్టాడ్ట్) లో ప్రత్యేకంగా ఒక కార్మాగారం స్థాపింపబడింది. 1939 లో యుద్ధానికి ముందు ఉత్పత్తి అయిన కార్లు వ్రేళ్ళ పైన లెక్కపెట్టవచ్చును. ఆదాయ పథకపు ఖాతాదార్లకి ఒక్కరికి కూడా కారు ఇంకా అప్పటికి ఇవ్వబడలేదు. హిట్లరు 49వ జన్మదినోత్సవాన (20 ఏప్రిల్ 1938) అతనికి ఒక టైప్ 1 కేబ్రియోలెట్ బహూకరించబడింది.

రెండవ ప్రపంచ యుద్ధానికి కావలసిన క్యూబెల్ వ్యాగన్, ష్విమ్ వ్యాగన్ ను రూపొందించటంలో నిమగ్నమయినది.

1945: బ్రిటీషు సైన్యం, మేజర్ ఇవాన్ హిర్స్ట్, తేలని భవితవ్యం

[మార్చు]
VW Type 82E

యుద్ధం తర్వాత కూడా సంస్థ మనగలిగిందంటే, దానికి సింహ భాగ కారణం, బ్రిటీషు సైన్యాధికారి మేజర్ ఇవాన్ హిర్స్ట్, REME. 1945 లో అమెరికన్ల చే బంధింపబడ్డా, KdF-ష్టాడ్ట్, బాంబు దాడుల్లో దెబ్బతిన్న కార్మాగారం బ్రిటీషు ఆక్రమిత ప్రదేశాలల క్రిందకు రావటం వలన అవి వారికే ఇచ్చివేయబడ్డాయి. ఓల్డ్ హాంలో పుట్టిన హిర్స్ట్ నియంత్రణలో అవి ఉండేవి. మొదట వీటిని మిలిటరీ వాహన నిర్వహణకై ఉపయోగించాలనుకొన్నారు. అయితే మిలిటరీ ఉత్పత్తులున్న ఆ ప్రదేశాన్ని హిర్స్ట్ వాణిజ్య సంస్థగా కాకుండా "రాజకీయ మృగం"గా వ్యవహరించటంతో దెబ్బతిన్న యుద్ధ పరికరాలను సరి చేయటం కోసం ఉపయోగించాలనుకొన్నారు. కార్మాగారంలో రూపొందించిన ఒక కారుకు హిర్స్ట్ ఆకుపచ్చ రంగును వేయించి బ్రిటీషు సైన్య ముఖ్య కేంద్రానికి పంపించారు. తేలికగా ప్రయాణించగలిగే కారులు అప్పటికి లేకపోవటంతో సెప్టెంబరు 1945లో బ్రిటీషు సైన్యం 20,000 కార్లు ఆర్డరు చేసింది. మొదటి కొన్ని వందల కార్లు సైన్యానికి తరలింపబడగా, తర్వాతివి జర్మను తపాలా కార్యాలయానికి పంపించబడ్డాయి.

సైన్యం ఉపసంహరణ తర్వాత కొంత మంది బ్రిటీషు సైనికులు వారి వీ డబ్ల్యూ బీటిల్ లను వారితో బాటు UK కి తీసుకు వెళ్ళారు. అటువంటి వాటిలో UK రిజిస్ట్రేషన్ అయిన JLT 420 ఇప్పటికీ పీటర్-కొల్బోర్న్ బేయర్ వద్ద ఉన్నది. సర్రే లో రిప్లీ ప్రాంతంలో మొట్ట మొదట UK కి వోక్స్ వ్యాగన్ ను దిగుమతి చేసిన కోల్బోర్న్ గ్యారేజెస్ యజమాని కుమారుడ ఇతను.

1946 సంవత్సరానికి ఈ కార్మాగారం నెలకి 1,000 కార్లను ఉత్పత్తి చేసేది. పైకప్పు, కిటికీల మరమ్మత్తు లేక, వర్షాల వలన ఉత్పత్తి ఆపేయవలసి వచ్చేది. ఉక్కు కోసం వేరే కారులను మార్చుకొనవలసి వచ్చేది.

రెండవ ప్రపంచ యుద్ధ సమయానికి కార్మాగారం పేరు "వోక్స్ వ్యాగన్" గా, పట్టణం పేరు "వోల్ఫ్స్ బర్గ్"గా మారిపోయాయి. ఉత్పత్తి కూడా పెరిగింది. కార్మాగారం భవితవ్యం ఏంటో ఇంకా అప్పటికి కూడా సరిగా తేలలేదు. బ్రిటీషు, అమెరికా, ఫ్రెంచి సంస్థలు దీనిని సొంతం చేసుకోవటానికి నిరాకరించాయి.

ఇదే ఆలోచనతో ఫ్రాన్సులో సిట్రాయెన్ అనే సంస్థ 2సివి, ఇటలీలో ఫియట్ 500 సంస్థ "టోపోలినో" లను రూపొందించినవి.

1945 నుండి 1948: ఆలీ ఆక్రమిత జర్మనీలో మనుగడ

[మార్చు]

పోరాట దిశలో జర్మనీ బలాన్ని నిర్వీర్యం చేయటానికి ఆలీ దేశాలు సర్వవిధాలా ప్రయత్నించాయి. పారిశ్రామికంగా జర్మనీ ఎదగటానికి ఉన్న పథకాలని అమలు చేయకుండా చూసి అడ్డుకట్ట వేసాయి. 1936 లో జర్మనీ ఉత్పత్తి చేసిన కారులలో కేవలం 10% మాత్రమే ఉత్పత్తి అయ్యేలా చూశాయి.

1945 లో బ్రిటీషు నియంత్రణలోకి వచ్చిన వోక్స్ వ్యాగన్ ను బ్రిటన్ కు తరలించాలని యోచన వచ్చింది. సాంకేతిక అవసరాలను పూరించకపోవుట మూలాన, సగటు కొనుగోలుదారునికి ఏ మాత్రం ఆకర్షణీయంగా కనబడకపోవుట మూలాన, ఆర్థికంగా అసలు గిట్టుబాటు కాకపోవుట మూలాన ఏ బ్రిటీషు ఉత్పత్తిదారుడు దీనిని సొంతం చేసుకొనుటకు ముందుకు రాలేదు. అందుచేత బ్రిటీషు సైన్యానికి కారులను రూపొందించుటకు మాత్రమే దీనిని ఉపయోగించుకొన్నారు.

1948 నుండి: పశ్చిమ జర్మనీ నూతన శకానికి ప్రతీక

[మార్చు]

1948 నుండి వోక్స్ వ్యాగన్ పశ్చిమ జర్మనీ ఆర్థిక వ్యవస్థ యొక్క నూతన శకానికి ప్రతీకగా వెలుగొందింది.ఓపెల్లో 1930 ల నుండి 1940 ల వరకు ప్రజల వాహనాల, యుద్ధ వాహనాల ఉత్పత్తిని నిర్వహించే హైన్రిఖ్ నార్డ్ హాఫ్ (1899 - 1968) 1948లో ఉద్యోగిగా తీసుకొనబడ్డాడు. లోయర్ సాక్సనీ ప్రభుత్వం, పశ్చిమ జర్మనీ సంయుక్తంగా నిర్వహించే ట్రస్టు అధీనంలో నడుస్తున్న కార్మాగార నిర్వహణని హిర్స్ట్ ఉపసంహరించుకొన్నాడు. వోక్స్ వ్యాగన్ టైప్ 2 వాణిజ్య వాహనం, వి డబ్ల్యు కార్ మన్ ఘియా అనే పోటీ వాహనాలను పరిచయం చేయడంతో బాటు 1968 తాను తుది శ్వాస విడిచేవరకూ సంస్థ విధివిధానాలను నియంత్రించాడు.

అమెరికాలో వోక్స్ వ్యాగన్లు మొట్టమొదటి సారిగా 1949 లో ప్రదర్శింపబడ్డాయి. "విక్టరీ వ్యాగన్"గా ప్రవేశించిన వీటి అమ్మకాలు పెద్దగా ఉండేవి కావు. అమ్మకాలను, సేవలను ప్రామాణీకించటానికి ఏప్రిల్ 1955లో వోక్స్ వ్యాగన్ ఆఫ్ అమెరికా ఏర్పడ్డది. టైప్ 1 వోక్స్ వ్యాగన్ బీటిల్ ల ఉత్పత్తి విపరీతంగా పెరిగి 1955 సంవత్సరానికి ఒక మిలియన్ కు చేరుకొంది.

న్యూ యార్క్ ప్రచార సంస్థలు డాయ్ల్, డేన్ బెర్న్ బాఖ్ ప్రకటనలతో అమ్మకాలు పెరిగాయి. కళా నిర్దేశకుడు హెల్ముట్ క్రోనే, కాపీ రైటర్లు జూలియన్ కోయ్నిగ్, బాబ్ లెవిన్ సన్ లు కలసి వినోదాత్మక ప్రకటనలతో సంపన్న యువతను ఆకట్టుకొన్నారు.

1960-70 ల సమయానికి కారులు కొద్దిగా పాతబడ్డా, అమెరికా ఎగుమతులు, సృజనాత్మక ప్రకటనలు, పెరుగుతున్న ఖ్యాతి ఫోర్డ్ మాడల్ టి రికార్డులని మించింది. 1973 నాటికి ఉత్పత్తి 16 మిలియన్లు దాటినది.

ఆటో యూనియన్, ఎన్ ఎస్ యూ లు వోక్స్ వ్యాగన్ స్వంతం

[మార్చు]

1964 లో వోక్స్ వ్యాగన్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కనుమరుగైన ఆటో యూనియన్ (ఆడి కారుని తయార చేసే సంస్థ)ని స్వంతం చేసుకొన్నది. 1969 లో ఎన్ ఎస్ యూ మోటరెన్ వర్కె ఏ జీని స్వంతం చేసుకొంది. ఈ రోజు మనం చూస్తున్న ఆడి ఈ రెండు సంస్థల కలయిక. 1970లలో వోక్స్ వ్యాగన్ రూపొందించిన ఎయిర్-కూల్డ్ మాడళ్ళకు గిరాకీ అనూహ్యంగా పడిపోవటంతో ఈ రెండు సంస్థల సాంకేతిక విలువలు వోక్స్ వ్యాగన్ ని గట్టెక్కించటంతో వీటి కొనుగోలు దీని చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టం.

భారత దేశంలో లభించు రకాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]