Jump to content

వై ఐ కిల్డ్ గాంధీ

వికీపీడియా నుండి
వై ఐ కిల్డ్ గాంధీ
కృతికర్త: నాథూరామ్ గాడ్సే
దేశం: భారతదేశం
భాష: ఆంగ్లం , హిందీ
ప్రచురణ:
విడుదల:


వై ఐ కిల్డ్ గాంధీ (ఆంగ్లం: Why I Killed Gandhi ) నాథూరాం గాడ్సే చే రచించబడ్డ ఒక పుస్తకం.

ముందు మాట

[మార్చు]

30 జనవరి 1948, గాడ్సే మహాత్మా గాంధీ ని హత మార్చాడు. 27 మే 1948 నుండి 10 ఫిబ్రవరి 1949 వరకు వాదోపవాదాలు జరిగాయి. 5 మే 1949 న గాడ్సే కోర్టుకు తెలిపిన చివరి మాటలే ఈ పుస్తకం.[1] 150 పారాగ్రాఫులు కలిగిన ఈ వాంగ్మూలం చదివి వినిపించటానికి, గాడ్సే కు అయిదు గంటల వ్యవధి పట్టింది. [2]

పుస్తకాంశాలు

[మార్చు]

తాను ఒక బ్రాహ్మణ కుటుంబం లో పుట్టినందున హిందూధర్మం పై తనకి అపారమైన నమ్మకం ఉందని, హిందువుగా పుట్టినందుకు తాను గర్విస్తానన్న వాక్యాలతో పుస్తకం మొదలౌతుంది. హిందూ మతాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థ, అంటరానితనం వంటి జాడ్యాలకు వ్యతిరేకంగా పోరాడి సహపంక్తి భోజనం లో పాల్గొన్నాడు.


వీర సావర్కర్, గాంధీలు హైందవం గురించి చేసిన భాషణలకు తాను ఆకర్షితుడను అయ్యాను అని తెలుపుతాడు.


1920 బాలగంగాధర తిలక్ మరణం తర్వాత కాంగ్రెస్ లో గాంధీ పెత్తనం పెరిగిపోయింది. సత్యం, అహింస వంటి అంశాలతో గాంధీ సర్వత్రా మన్ననలను చూరగొన్నాడు. ఈ అభిప్రాయాలతో నాకు విభేధాలు ఉన్నాయి. రాముడు, కృష్ణుడు సైతం హింసకు మినహాయింపులు కానప్పుడు, మానవ మాత్రులం మనం అహింస ను ఎందుకు పాటించాలి? వీరి గురించి గాంధీకి తెలియదా? శివాజీ, రాణాప్రతాప్, గురు గోవింద సింగ్ వంటి వారు అవలంబించిన హింసా ప్రవృత్తి వలనే శాంతిస్థాపన జరిగింది. వీరి హింసను ఖండించిన గాంధీ తనను తాను మోసం చేసుకోవట్లేదా?

కాంగ్రెస్ లో గాంధీ చెప్పిందే వేదం అయ్యింది. తను అనుకొన్నది జరగకపోతే, గాంధీ కాంగ్రెస్ కు దూరంగా వెళ్లిపోయేవాడు. హిందువులపై జరిగిన అరాచకాలకు నోరు మెదపని గాంధీ, ముస్లిం ల కు చీమ కుట్టగనే నిరాహార దీక్షకు దిగేవాడు. సత్యాగ్రహం పేరు తో ఉన్మాదం సృష్టించాడు.

తప్పు తర్వాత తప్పు, వైఫల్యం తర్వాత వైఫల్యం గాంధీకి పరిపాటి అయ్యింది. దేశం లో ఎక్కువ వాడుక లో ఉన్న హిందీ భాషను ప్రక్కన పెట్టి, హిందీ/ఉర్దూల సంకలనం అయిన, వ్యాకరణం లేని, కేవలం ఒక మాండలికం అయిన హిందుస్థానీ భాష ను జాతీయ భాష చేయాలని మంకు పట్టు పట్టాడు. గాంధీ మాటకు ఎదురు చెప్పలేక కాంగ్రెస్ లో పెద్దలు కూడా దీనిని వ్యతిరేకించలేదు. గాంధీ ప్రయోగాలు మొత్తం హిందువుల పైనే ఉండేవి.

1946 నుండి ముస్లిం లీగ్ సైన్యాలు హిందువుల పై విరుచుకుపడ్డాయి. హిందువుల మాన భంగాలు, హత్యలు, దౌర్జన్యాలు మిన్నంటాయి. బెంగాల్ నుండి కరాచీ వరకు నెత్తురు యేర్లు అయ్యి పారింది. ఇంత జరిగినా గాంధీ కిక్కురు మనలేదు. జిన్నా అడుగులకు మడుగులు ఒత్తిన కాంగ్రెస్, 30 జూన్ 1948 నాటికి భారత్ ను విభజిస్తాం అని హామీ ఇచ్చింది. అయితే గాంధీ-మౌంట్ బ్యాటన్-కాంగ్రెస్ చలువ వలన్ ఈ కార్యక్రమం 15 ఆగష్టు 1947 కు పూర్తి అయ్యింది.

30 ఏళ్ళ గాంధీ నాయకత్వం లో మనం సాధించింది ఇదే! స్వేచ్చ, శాంతియుత అధికార బదిలి అని కాంగ్రెస్ గొప్పలు పోయేది దీనికే!! హిందూ-ముస్లిం ల ఐక్యత అనే బుడగ పేలిపోయింది. "ఇది త్యాగంతో గెలిచిన స్వతంత్రం" అని జవాహర్ లాల్ నెహ్రూ సెలవిచ్చారు. ఎవరి త్యాగం? కాంగ్రెస్ లో తలపండిన వారు, గాంధీ నేతృత్వం లో భరతమాతను ముక్కలు చెక్కలు చేస్తుంటే, నాలో కోపం బుసలు కొట్టింది.

గాంధీ జాతిపిత అంటారు. దేశ విభజనకు ఒప్పుకొని తన పితృత్వానికి కళంకం తెచ్చుకొన్నాడు. పాకిస్తాన్ కు మాత్రం న్యాయం చేసిన గాంధీ ఆ దేశానికి జాతిపిత కు అర్హుడయ్యాడు. గాంధీ ని నేను చంపాలనుకొన్న ఆలోచన నాపై ఎంతటి వ్యతిరేకాన్ని, కోపాన్ని, అగౌరవాన్ని తెస్తుందో నాకు తెలుసు.


కానీ భారతీయ రాజకీయాలు శక్తివంతంగా ఎదగాలంటే, గాంధీ జీవించ రాదు. నా భవిష్యత్తు గాఢాంధకారం లోకి వెళ్ళిపోతుందని నాకు తెలుసు. కానీ పాకిస్తాన్ విషకోరల నుండి దేశం విముక్తి చెందుతుంది. లోకం నన్ను ఒక ఉన్మాది అని అనుకొంటుంది. అయినా సరే, దేశం ఎదుగుదలకు ఈ హత్య ఉపయోగపడుతుంది అంటే దానికి నేను సిద్ధమే.


ఆలోచనను ఆచరణలో పెట్టటానికి నా ధైర్యాన్ని మొత్తం మూటగట్టవలసి వచ్చింది. బిర్లా హౌస్ లో ఆ రోజు, లక్షల హిందువుల ఊచకోతకు కారణం అయిన వ్యక్తి శరీరం లోకి నేను తూటాలను దించాను. నాకు వేరే ఎవ్వరి పై ద్వేషం లేదు. ప్రస్తుత ప్రభుత్వం గాంధీ నేతృత్వం లో ముస్లిం పక్షపాతి కావటం నాకు నచ్చలేదు.

ఈ హత్యకు నేను పూర్తి బాధ్యతను వహిస్తున్నాను. నా పైన ఎవ్వరూ జాలి చూపవద్దు. నా పై విమర్శలు నా నైతిక బాధ్యతను కించిత్తు కూడా కదల్చలేక పోయాయి.

నిజాయితీ గల చరిత్రకారులు నిజానిజాల విశ్లేషణ చేస్తారని, భవిష్యత్తులో ఈ కార్యం యొక్క విలువ కడతారని ఆశిస్తున్నాను.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Godse, Nathuram. "Why I Killed Gandhi". archive.org. Retrieved 2024-09-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Biswas, Soutik (2022-01-24). "Nathuram Godse: The mystery surrounding Mahatma Gandhi's killer". bbc.com. Retrieved 2024-09-08.{{cite web}}: CS1 maint: url-status (link)