Jump to content

వై.వెంకటరామి రెడ్డి

వికీపీడియా నుండి
వై.వెంకటరామి రెడ్డి
వై.వెంకటరామి రెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
ముందు ఆర్.జితేంద్ర గౌడ్
నియోజకవర్గం గుంతకల్లు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1965
రాంపురం గ్రామం, మంత్రాలయం మండలం , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
తల్లిదండ్రులు ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి, లలితమ్మ [1]
జీవిత భాగస్వామి శారద
బంధువులు వై.శివరామి రెడ్డి (అన్న), వై. బాలనాగిరెడ్డి (అన్న) , ఎల్లారెడ్డి సాయి ప్రసాద్‌ రెడ్డి (అన్న) [2]
సంతానం వై.నైరుతి రెడ్డి , వై.నిషిత రెడ్డి
నివాసం గుంతకల్లు

ఎల్లారెడ్డి గారి వెంకటరామి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గుంతకల్లు నియోజకవర్గం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

వై.వెంకటరామి రెడ్డి 1965 జూలై 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, మంత్రాలయం మండలం, రాంపురం గ్రామంలో ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి (మాజీ ఎమ్మెల్యే ఉరవకొండ), లలితమ్మ (మంత్రాలయం మండలం రాంపురం గ్రామ సర్పంచ్‌) దంపతులకు జన్మించాడు. ఆయన బెంగుళూరు యూనివర్సిటీ నుండి బి.ఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

వై.వెంకటరామి రెడ్డి 2006లో కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా పని చేశాడు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఆర్‌.జితేంద్రగౌడ్ చేతిలో 5094 ఓట్లతో తేడాతో ఓటమిపాలయ్యాడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఆర్‌.జితేంద్రగౌడ్ పై 47,930 ఓట్ల మోజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (6 November 2019). "ఆ తల్లి కడుపున నలుగురు ఎమ్మెల్యేలు". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. V6 Velugu (27 May 2019). "అరుదైన రికార్డ్..ఒకే సారి ముగ్గురు అన్నదమ్ములు అసెంబ్లీకి" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (2019). "Guntakal Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.