వైదిక యుగంలో విద్యావ్యవస్థ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పురాతన కాలంలో విద్యను మనిషి మూడవ కన్నుగా భావించారు. జ్ఞానానికి మార్గముగా ఈ చదువును భావించారు. ఆనాటి విద్య యొక్క చివరి లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం, కానీ తక్షణ గమ్యం మాత్రం తమ అభిరుచులకు, శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా ఉపాధి పొంది సమాజానికి తమ వంతు సహాయం చేయడం. విద్య జీవితానికి వెలుగునిస్తుందని, అది లేనివాడు గుడ్డివానితో సమానమని భావించేవాళ్ళు. విద్యను వారు చాలా గౌరవంగా భావించారు. వారి మాటల్లోనే చెప్పాలంటే "స్త్రీపురుషులకు విద్య చాలా ముఖ్యమైనది, అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, తల్లిలాగా పోషిస్తుంది, తండ్రిలా మార్గదర్శిలా నిలుస్తుంది, భార్యలాగా సుఖసౌఖ్యాలను ప్రసాదిస్తుంది, కీర్తిని సంపాదిస్తుంది, కష్టాలు తొలిగిస్తుంది, స్వచ్ఛమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది, నాగరికునిగా మారుస్తుంది, పొరుగుదేశంలో ప్రయాణిస్తుంటే మంచి తోడుగా నిలుస్తుంది, కనుకనే దానిని కల్పవృక్షంగా భావిస్తారు".
ఇంకా చెప్పాలంటే
స్వదేశ పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే
అనగా "రాజు తన రాజ్యంలోనే పూజించబడతాడు, కానీ విద్వాంసుడు అన్ని దేశాలలోనూ పూజించబడతాడు"
ఈ కాలంలోని విద్యావ్యవస్థ ముఖ స్వరూపం
[మార్చు]ఫీజు | ఉచితం |
రాజకీయ నియంత్రణ | లేదు |
గురువుల, ఉపాధ్యాయుల గౌరవం, స్థితి | ఉన్నత స్థితి |
ప్రదేశం | గురుకులాలు |
లక్ష్యం, గమ్యం | ఆత్మసాక్షాత్కారం |
తక్షణ గమ్యం | వృత్తి విద్య (కులాలను అనుసరించి ?) |
బోధనా పద్ధతి | వల్లెవేయడం, గుర్తుంచుకోవడం, ఒక్కొక్కరికీ చెప్పడం, ప్రయాణం ద్వారా అనుభవాల ద్వారా |
భాష | సంస్కృతం |
దండన పద్ధతులు | స్వయం నియంత్రణ, corporal |
స్త్రీ విద్య | బాగానే ఉండేది |
శాస్త్రీయ విద్య | ఖనిజాల త్రవ్వకం, లోహపు పని, ఆర్కిటెక్చరు, గణితము, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం మొదలగునవి |
వ్యాపారాత్మక విద్య | కొద్దిగా ఉండేది |
గణితము | చాలా బాగుండేది, రేఖాంశ శాస్త్రము మంచి వృద్ధిలో ఉండేది, ఆర్యభట్టారకుడు రచించిన శుల్వసూత్రములు, క్రీస్తు పూర్వం 400 నుండి క్రీస్తు శకం 200 మధ్యకాలంలో, చాలా ప్రముఖమైనవి, సున్నా కూడా ఈ కాలంలోనే కనుగొన్నారు. |
ఈ కాలంలో గురు శిష్య సంబంధాలు చాలా గొప్పగా ఉండేవి, గురువు శిష్యునికి తండ్రిలాగా ఉండేవాడు.
లోపాలు
[మార్చు]- జడమయమైనది, మార్పునకు అవకాశం తక్కువ
- పాఠ్యాంశాలు కఠినమైనవి
- క్రమశిక్షణ మరీ ఎక్కువ
- స్త్రీ విద్య ఉన్నా, తక్కువే
- పూర్తిగా మతపరమైన విద్య
వ్యక్తిత్వ వికాసం
[మార్చు]ఈ కాలంలో నాలుగు స్థంబాలపై ఆధారపడి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసేవారు,
- స్వయం గౌరవం, ఆత్మ గౌరవం
- ఆత్మ విశ్వాసం
- ఆత్మ సంయమనం
- యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం
ఈ కాలంలో విద్య తప్పనిసరి, అన్ని తరగతుల వారికినీ,
కొన్ని పాఠ్యాంశములు
[మార్చు]- వ్యాకరణ శాస్త్రము
- తత్వ శాస్త్రము
- హేతు శాస్త్రము
- ఆయుర్వేదము
- కళలు
- గణితము
- ఖగోళము
- అస్త్ర విద్య
- అర్థ శాస్త్రం
- నాలుగు వేదాలు
- శిక్ష
- కల్పము
- నిరుక్తము
- ?
- జ్యోతిష్యాస్త్రము
- ధర్మము
- నీమాంశ
- తర్క
- పురాణాలు
మొదలగున్నవి
ఇప్పటి కాలానికి మల్లె పిల్లలకు రాజభోగాలుండేవి కావు. రాజు కొడుకైనా బడుగు బాపడి కుమారుడైనా సరే ఒకేలా ఉండాలి. బిక్ష వృత్తి ద్వారా రోజూ పొట్టపోసుకోవాలి, కానీ సమాజంలో వీరికి గౌరవం మెండుగా ఉండేది, ఇంటికి వచ్చిన విద్యార్థికి లేదని చెప్పడం అపచారంగా భావించేవారు. విద్య అందరికీ ఉచితంగానే ఉండేది.