వేములూరిపాడు
స్వరూపం
వేములూరిపాడు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
వేములూరిపాడు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°17′55″N 80°17′59″E / 16.298715°N 80.299721°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | ఫిరంగిపురం |
ప్రభుత్వం | |
- సర్పంచి | దేవసోత్ గోవిందమ్మబాయి |
పిన్ కోడ్ | 522529 |
ఎస్.టి.డి కోడ్ | 08641 |
ప్రముఖులు
[మార్చు]దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ జలపాలేశ్వరస్వామివారి ఆలయం:-
- ఈ ఆలయం, వెలనాటి చోళులు కట్టించారని ఒక శాసనం ఆలయంలో ఉంది.
- ఈ ఆలయంలో 2014, డిసెంబరు-30న, విజయనగర రాజు అచ్యుతరాయల కాలం నాటి శిలాశాసనం బయట పడింది. అది ఐదు అడుగుల పొడవు, 20" వెడల్పు, 13"దళసరితో ఉంది. దానిమీద విజయనగరం రాజుల కాలం నాటి అక్షరాలు 27 పంక్తులతో చెక్కబడి ఉన్నాయి. ఆ కాలంలో ఒక సామంతరాజు తన తల్లిదండ్రులకోసం ఈ శాసనం వేయించినాడని ఉంది. అందులో కొండవీడుకు ఉత్తరాన ఉన్న ఒక వనం కోసం వేయించిన శాసనం అనుకుంటున్నారు. ఈ ఆలయం మాత్రం, వెలనాటి చోళులు కట్టించారని ఇంకొక శాసనం ఆలయంలో ఉంది.