వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 17

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెప్టెంబరు 17, 2008 (2008-09-17)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ ఎన్నికైనాడు.
  • సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్‌గా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఎం.ఎల్.కుమావత్ నియమితులయ్యాడు.
  • ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ చైర్మెన్ ఎ.వి.ఎస్.రాజు అతిపెద్ద గ్రంథం రచించినందుకు గిన్నిస్‌బుక్‌లో పేరు సంపాదించాడు.
  • బీజింగ్‌లో పారాలింపిక్స్ క్రీడలు ముగిశాయి. 89 స్వర్ణాలతో సహా మొత్తం 211 పతకాలు సాధించి చైనా ప్రథమస్థానం పొదగా, బ్రిటన్, అమెరికాలు రెండో, మూడో స్థానాలలో నిలిచాయి.
  • ప్రపంచ మహిళల చదరంగం చాంపియన్‌షిప్ టైటిల్‌ను రష్యాకు చెందిన అలెక్సాండ్రా కోస్టెనిక్ గెలుచుకుంది.
  • ఇండియన్ క్రికెట్ లీగ్లో చేరిన బంగ్లాదేశ్ క్రికెట్ క్రీడాకారులపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పదేళ్ళ నిషేధం విధించింది.
  • భారత హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా ఎం.కె.కౌశిక్ నియమితుడైనాడు.