ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. 1947లో భారత స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది. మొత్తము కోస్తా జిల్లాలు పది. (మొత్తం వ్యాసం చూడండి)
వ్యాసం
తిక్కన
"తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి" అన్నది నానుడి. జయం పేరుతో సంస్కృతంలో భగవాన్ వ్యాస మహర్షి రచించిన మహాభారతాన్ని నన్నయ భట్టారకులు, తిక్కనసోమయాజి, ఎఱ్ఱన ఆంధ్రీకరించారు. వీరు కవిత్రయంగా ప్రసిధ్దులు. తిక్కన జీవిత కాలం 1205 - 1288. విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిధ్దికి మంత్రిత్వం వహించారు. (పూర్తివ్యాసం చూడండి)
ఈ వారం చిత్రం
గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన గ్రామము ఉండవల్లి, ప్రసిద్దమైన ఉండవల్లి గుహలున్నదిక్కడే.