వేదాంతం రామలింగ శాస్త్రికూచిపూడి భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారుడు. అతను కొరియోగ్రాఫర్, రచయిత, నర్తకుడు, నటుడు పరిశోధకుడిగా అనేక రంగాలలో రాణించి బహుమఖ ప్రజ్ఞాశాలిగా కీర్తి గడించాడు. కూచిపూడి నృత్యం పై అతను చేసిన పరిశోధనకు గాను ప్రభుత్వం 2012లో సంగీత నాటక అకాడమీ అవార్డు తో సన్మానించింది.[1] అతను సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠానికి విశ్రాంత ప్రధానాచార్యులు (ప్రిన్సిపాల్). అతను కూచిపూడి నాట్యానికి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం అనేక అవార్డులతో సత్కరించింది. హిందూ దినపత్రిక అతనిని కూచిపూడి పితామహుడిగా అభివర్ణించింది.[2][3]2022 డిసెంబరులో కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యునిగా ఎంపికయ్యారు.
వేదాంతం రామలింగ శాస్త్రి 1963 జూన్ 3న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా కూచిపూడిలో సూర్యనారాయణ, సత్యవతమ్మ దంపతులకు జన్మించాడు.[4][5] అతను 1979లో ప్రాథమిక విద్యను తన స్వస్థలమైన కూచిపూడిలో పూర్తి చేశాడు. 1984లో వేదాంతం రామలింగ శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకున్నాడు. 1990లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ (తెలుగు) పొందాడు. వేదాంతం రామలింగ శాస్త్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కూచిపూడి నృత్యంలో డిప్లొమా పూర్తి చేశాడు. అతను "తెలుగులో కూచిపూడి నాటక అభివృద్ధి" పై పరిశోధనలు చేసినందుకుగాను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందాడు.
అతను కూచిపూడి నాట్యాన్ని కళారత్న డా.వేదాంతంరాధేశ్యామ్, వెంపటి చినసత్యం, వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి కులపతి వెంపటి పెద సత్యం, వంటి మొదలైన ప్రముఖ నాట్యాచార్యుల వద్ద నేర్చుకున్నాడు. శ్రీమతి బాలాత్రిపురసుందరి,డా.కల్వువకొలనుగంగాధరరావు, ఆచార్య శివునూరి విశ్వనాథశర్మ, బ్రహ్మశ్రీ చెరుకు పల్లి సుబ్రహ్మణ్యశర్మ గర్ల వద్ద సాహిత్యాన్ని అధ్యయనం చేశారు.
అతను 1989 నుండి 2004 వరకు హైదరాబాద్ డివిజనులోని దక్షిణ-మధ్య రైల్వేలో కూచిపూడి నృత్య ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అతను "శ్రీ వేదాంతం కూచిపూడి కళా పరిషత్" ను స్థాపించి, వందలాది మంది విద్యార్థులకు, కూచిపూడి నృత్యం నేర్పిస్తున్నాడు. అతను నిర్వహిస్తున్న, కూచిపూడి కళాపీఠంలో 2005 నుండి వేసవి శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్నాయి. అతని వద్ద నృత్యం నేర్చుకున్న నృత్యకారులు దేశ విదేశాలలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. వందలాది కూచిపూడి కళాకారులను/శిష్యులను నాట్యాచారులుగా, నాట్యగురువులుగా మలచి దిశానిర్దేశం చేశాడు.
ఈయన స్కూలు పాఠాలకు, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కూచిపూడి సిలబస్ ను రూపొందించారు. 2024డిసెంబర్ నాటికి అన్ని కూచిపూడి ప్రక్రియలలో 142 రూపకాలు రచించారు.కూచిపూడి సంప్రదాయ బద్ధంగా శబ్దాలను పెద్ద సంఖ్యలో రచించారు.అంతేకాదు పలు కౌత్త్వాలను రచించిచారు.వీరిదే కూచిపూడి నాట్యచరిత్రలో ఆల్ టైం రికార్డు. కూచిపూడి నాట్య ప్రక్రియ మీద 100వందలాదిగా వ్యాసాలు వ్రాసారు. "తెలుగులో కూచిపూడి నాట్య వికాసం"," కూచిపూడి వ్యాసమంజరి", "గజాననీయం", "బ్రాహ్మణ సర్వస్వం", "ఇతడు భామ" పుస్తకాలను రచించాడు.వివిధ దేవీ దేవతలపై వందలాది కీర్తనలను రచించారు.
క్షేత్రయ్య పదాలు వలెనే కూచిపూడి రామలింగేశ్వర స్వామి మీద ఎన్నో పదాలు రచించారు. వెయ్యి సంవత్సరాలకు పైగాగల చరిత్ర ఉన్న కూచిపూడి నాట్యచరిత్రను యుగాల వారిగా విభజించారు. కూచిపూడి ప్రక్రియను ,ప్రాముఖ్యతను క్రోడీకరించి డాక్యుమెంట్లుగా తయారు చేసారు.
వేదాంతం రామలింగ శాస్త్రి కూచిపూడి నృత్యంలో (14వ శతాబ్దంలో పేరుపొందింది) "కేళిక" అనే ప్రక్రియను పునరుద్ధరించి, కేళికలను30 కి పైగా రచనలను రచించి వీటిలో చాలా వరకు నాటకాలుగా ప్రదర్శించబడ్డాయి. 50 కి పైగా థీమ్ పాటలను స్వరపరిచి, ప్రదర్శించిన ఘనత అతనికి దక్కింది.
రామలింగశాస్త్రి అన్ని రకాల కూచిపూడి ప్రక్రియలను రూపొందించి, ప్రదర్శించారు. నర్తనశాల, వినాయక చవితి, వేదోద్ధారణ, నాట్యవేదం వంటి రచించిన 126 రూపకాలలోనివి. ఈయన దుర్యోధనుడు, కంసుడు, కీచకుడు, తారకాసురుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, గజాసురుడు, సోమకాసురుడు వంటి పలు ప్రతినాయక పాత్రలు, విష్ణుచిత్తుడు, నారదుడు, విప్రనారాయణుడు, బుద్ధుడు వంటి సహాయక పాత్రలవంటి పలుపాత్రలను వందలాదిగా ప్రదర్శనలు చేసారు.
అతను పది కూచిపూడి యక్షగానాలు, అనేక జావాలీలు, పడాలు నృత్యరూపకల్పన చేశారు. 30కి పైగా నృత్య రూపాలకు దర్శకత్వం వహించాడు. అతను స్వయంగా నృత్యరూపకల్పన చేసి, దానికి అవసరమైన అన్ని మెరుగులు దిద్దుతూ, దానికి దర్శకత్వం వహించి, ప్రధాన పాత్ర పోషించి, తన కుటుంబ సభ్యులు, శిష్యులతో కలిసి నృత్య ప్రదర్శన ఇచ్చాడు. కూచిపూడి నాట్యాన్ని 9 దశలుగా విభజించి కూచిపూడి నాట్య ఔన్నత్వాన్ని వేదాంతం రామలింగ శాస్త్రి చాటాడు. పరిచయదర్వు, వర్ణనాత్మక దర్వు, సాంత్వన దర్వు , ప్రేయోదర్వు అనే నాలుగు ముఖ్యమైన దరువులను కూచిపూడి నాట్యానికి సృజించి సమకూర్చాడు.
భరతముని నాట్యశాస్త్రంలో చెప్పిన ఐదు దర్వులకు సిద్ధేంద్రయోగి 13వ శతాబ్దంలో మరొకటి జోడించగా రామలింగశాస్త్రి మరో నాలుగు దర్వులను సృజించి సమకూర్చారు. వీటన్నిటిని కలిపి "దశవిధదర్వులు" అనే విధానం కూచిపూడి నాట్యంలో స్థిరపడింది. రామలింగ శాస్త్రి వేల సంవత్సరాల కూచిపూడి నాట్య ప్రస్థానాన్ని - ప్రాక్సిద్ధేంద్ర, సిద్ధేంద్ర, కేళికా, నృత్య నాటక, యక్షగాన, భాగవతుల రామయ్య, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపటి చినసత్యం యుగములనేపేర యుగవిభజన చేసి, ఆయా యుగాలలో జరిగిన నాట్య ప్రస్థానాన్ని సోదాహరణంగా వివరించారు. అలాగే కూచిపూడి నాట్యమునందు సంస్కృత రూపకాలు, కలాపములు, కేళిక , నృత్యనాటకం, యక్ష గానె, నృత్య రూపకం, నృత్య నాటిక, వ్యస్తాంశం , ఏకపాత్రకేళికలనే తొమ్మిది ప్రక్రియలను పేర్కొని వాటికి లక్ష్యలక్షణాలను నిరూపించారు. పై ప్రక్రియలన్నిటిలోనూ విరివిగా రచననూ, నృత్యీకరణలను, ప్రదర్శనలనూ చేసిన మొదటి కూచిపూడి నాట్య గురువు. అలాగే కూచిపూడి నాట్య కళలో మూడవ కలాపరచన "ఉమాకలాపము" ను వీరే రచించారు. మొదటిది భామాకలాపం 13వ శతాబ్దంలో, రెండవది గొల్లకలాపం 18వ శతాబ్దంలో రచించినవి కాగా మరల మూడవది ఈయన చేసినదవడం గమనార్హం.
రామలింగశాస్త్రి 1998లో సిరియా పర్యటన సందర్బంగా 18 వేదికలలో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. లండన్ లో నర్తనశాల, శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకాలు ప్రదర్శించారు. ఇటిఎ ఫెస్టివల్ లో ప్రదర్శన ఇచ్చారు. 2008లో యుఎస్ఎ కు కూచిపూడి యాత్ర చేసి పలు ప్రదర్శనలు ఇచ్చారు.
కళారత్న పురస్కారం 1997, 2001 లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం[6]
1997లో భారత కేంద్ర ప్రభుత్వంచే జూనియర్ ఫెలోషిప్ అవార్డు
2008లో అతిపెద్ద కూచిపూడి నృత్య ప్రదర్శనకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డు[7]
2012లో భారత రాష్ట్రపతి చేతులు మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు[8]
2012లో కూచిపూడి నృత్యానికి అందించిన సేవలకు గాను ఒరిస్సా ప్రభుత్వంచే నృత్యవిద్వాన్ అవార్డు[9]
2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న అవార్డు
2021లో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్ గా ఉత్తమ సేవలకుగాను వైఎస్ఆర్ లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డు
2021లో విద్యారంగంలో అయన అందించిన విశిష్ట సేవలకు ISA ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, న్యూ ఢిల్లీ వారిచే అవుట్ స్టాండింగ్ లీడర్షిప్ ప్రిన్సిపాల్ అవార్డ్
2022లో పామర్రులో ఘంటసాల-బాలు స్మారక సంగీత కళాపీఠం వారిచే ఘంటసాల శతజయంతి సందర్బంగా ఘంటసాల అవార్డు
2023 మార్చి 26న కాకినాడ శాస్త్రీయ నాట్య ఆచార్యుల సమాఖ్య వారిచే శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా భరతముని అవార్డు
2023 మార్చి 31న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే 2020 సంవత్సరానికి నృత్య విభాగంలో ప్రతిభా పురస్కారం
2023 జులై 8న విశాఖపట్నంలో నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వారిచే పద్మశ్రీకె. శోభానాయుడు ఎక్సలెన్స్ అవార్డు- 2023[10]
2023 అక్టోబరు 7న విశాఖపట్నం కళాభారతి వేదికలో కీ.శే.పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 100 సంవత్సరాల పండుగ సందర్భంగా వారి కుటుంబం నిర్వహించిన వేడుకలో ఘంటసాల పురస్కారం
2023 అక్టోబరు 15న కూచిపూడిలో అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీ, కూచిపూడి అర్ట్ అకాడమీ, జయహో భారతీయం, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్స్ సంయుక్త నిర్వహణలో "4వ ప్రపంచ కూచిపూడి నాట్యదినోత్సవం 2023" సందర్భంగా శ్రీ సిద్ధేంద్రయోగి పురస్కారం[11]
2023 సెప్టెంబరు 30, అక్టోబరు 1న రాజమహేంద్రవరంలో స్వర్ మహతి కళాపరిషత్ వారిచే "భరతముని ఆరాధనోత్సవాలు - 2023" సందర్భంగా కళారత్న - లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డు
2024 మే 18న బెంగుళూరులో "భారతకళాగ్రామ" ఇంటర్నేషనల్ నాట్య సంస్థవారిచే "నాట్య కౌస్తుభ" బిరుదు
2024 డిసెంబర్ 27 నుంచి 29 వరకు విశాఖపట్నంలో నటరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమి నేతృత్వంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డాన్స్ కాంగ్రెస్ వేడుకల్లో నాట్య విభూషణ్- 2024 అవార్డు
2025 జనవరి 11న, ప్రొద్దుటూరు పట్టణంలో నటరాజ కళాక్షేత్రం వారిచే "గురుబ్రహ్మ" బిరుదు
వివిధ ప్రభుత్వ , కళాసంఘాల ద్వారా అందుకున్న నటరత్న, కూచిపూడి కళానిధి, కూచిపూడి రత్నాకర, నటరాజ, కూచిపూడి వాచస్పతి మొదలైనవి
హిందూ దినపత్రిక లోని ఒక వ్యాసంలో గురువుగారిని "కూచిపూడి మాస్ట్రో"[12] గా అభివర్ణించారు. కీ.శే. పద్మభూషణ్ వెంపటి చినసత్యంగారి తరువాత కూచిపూడి మాస్ట్రో గా అతనిని సంబోధించడం రామలింగశాస్త్రికి దక్కిన మరో గౌరవం. ఇది కూచిపూడి లో వారికి గల ప్రజ్ఞాపాఠవాలకు నిదర్శనం.
రామలింగ శాస్త్రి భార్య పేరు వెంకటదుర్గాభవాని. కర్ణాటక సంగీతం, తెలుగులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. ఆవిడ సంగీత దర్శకురాలు, గాయని. నట్టువాంగంలో గణనీయమైన పేరు పొందారు. భర్తతో కలిసి 1990 నుండి అన్ని ప్రధాన ప్రదర్శనాల్లోను, వివిధ సెమినార్లలోను ముఖ్యభాగస్వామినిగా సహకరిస్తూనే చేసారు. వారికి ఇద్దరు సంతానం. సత్యఫణికృష్ణదత్తు (ఘనపాఠి కృష్ణ యజుర్వేదం), మోహనసత్యశ్రీనివాస వాగ్దేవీప్రసాదు (ఎం.ఎ. కూచిపూడి నాట్యం, కూచిపూడి, సాత్త్వికాభినయం, యక్షగానం, కర్నాటక సంగీతంలో డిప్లొమా). పెద్దకుమారుడు యజుర్వేద అధ్యాపకులు. పెద్దకోడలు దేవీభవాని నాట్య కళాకారిణి, నర్తకి. చిన్న కుమారుడు నృత్యదర్శకుడు, "కూచిపూడి కరదీపిక" అనే గ్రంథరచయిత కూడా.