వేదం వెంకటాచల అయ్యర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేదం వెంకటాచల అయ్యర్
జననం1883
మరణం1931
ప్రసిద్ధిసుప్రసిద్ధ పండితుడు, కవి, విమర్శకుడు
తండ్రివేంకట రమణశాస్త్రి
తల్లిలక్ష్మమ్మ

వేదం వెంకటాచల అయ్యర్ రచయిత.

జననం, విద్య

[మార్చు]

ఇతడు 1863లో మద్రాసులో జన్మించాడు. తండ్రి వేంకట రమణశాస్త్రి, తల్లి లక్ష్మమ్మ, ఈయన ప్రతాపపరుద్రీయం నాటకకర్త వేదం వెంకటరాయ శాస్త్రి తమ్ముడు. వెంకటాచల అయ్యర్ మద్రాసు వవిశ్వవిద్యాలయంలో బి.ఎ., బిఎల్., పాసయ్యాడు. బి.ఎ పరీక్షలో సంస్కృతంలో ప్రథముడుగా వచ్చినందుకు, గోడేసంస్థానంవారి నుంచి 400 రూపాయలు ఉపకారవేతనం లభించింది. ఆరోజుల్లో అది చాలా పెద్ద మొత్తమే.

వృత్తి

[మార్చు]

బిఎల్., అయిన తరువాత నెల్లూరులో న్యాయవాదవృత్తి చేపట్టాడు. తప్పుడు కేసులను ఎన్నడు వాదించడని పేరుపొందాడు.1922 ప్రాంతంలో నెల్లూరు పొగతోటలో మంచి ఇల్లు కట్టుకొని, పెద్ల గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశాడు.

సాహిత్య ప్రస్థానం

[మార్చు]

వెంకటాచల అయ్యర్ నెల్లూరు కోర్ట్ లో న్యాయవాదవృత్తి కొనసాగిస్తూనె భాషాశాస్రం మీద పరిశోధించాడు. అనేక అంతర్ జాతీయ విశ్వవిద్యాలయాల్లోని భాషా పరిశోధకులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి సందేహ నివృత్తి చేసుకొనేవాడు. అన్న వెంకటరాయ శాస్త్రి భాషా విషయంలో, సామాజిక విషయాల్లో సంప్రదాయవాది, ఈయన వ్యావహారికభాషా వాదాన్ని అంగీకరింఛి, సంస్కృతభాషలో అన్యభాషాపదాల మీద కృషిచేశాడు. ఆ క్రమంలో ఇంగ్లీష్, ఫ్రెంచ్, హీబ్రు, అరబ్బీ, పార్సీ, ఉర్దూ వంటి నేక భాషలతో పరిచయం ఏర్పరచుకొని, సంస్కృతంలోని పరభాష పదాల మీద పరిశోధన కొనసాగించాడు. సంస్కృతభాషమీద ఇతర భాషల ప్రభావాన్ని పరిశోధించాడు. ఇండాలజిస్తు గా ప్రసిద్హులు. Asiatic Society సభ్యడు. Modern review వంటి గొప్ప పత్రికల్లో, భారతిలో భాషావిషయాల మీద రాశాడు. సంస్కృత మహాభారతం మీద పరిశోధించి, Notes of a Study of the Priliminary Chapters of the Mahabharata Being an attempt to Seperate from Genuine to Matter Spurious అనే గ్రంథాన్ని 1922 లో ప్రచురించాడు. ఈ పరిశోధనను పూణే భండార్కర్ సంస్థ కూడా ఆమోదించింది. "Probable etimologies of Some Sanskrit words of foreign origion" గ్రంథాన్ని ప్రచురించాడు. నెల్లూరులో బ్రాహ్మణ సమాజం ఈయన భావాలను వ్యతిరేకించి, కులబహిష్కరణకు విఫలప్రయత్నం చేసింది.

ఈయన భారతి మాసపత్రికలో తెలుగు లోన్ వర్డ్స్ మీద వ్యసాలు రాశాడు. కొన్ని వ్యాసాలు "కతిపయ శబ్దార్థ విచారము" పేరుతొ ఒక పుస్తకం ప్రచురించాడు. ఈయన పరిశోధన, నోట్స్ ను ఈయన మనుమలు వేదం వెంకటరామన్ జాగ్రత్తగా decipher చేసి, degetise చేయించాడు, ఈయన గ్రంథాలయాన్ని పూణే బండార్కర్ సంస్థకు చేర్పించి భావి పరిశోధకులకు ఉపకారం చేశాడు.

మరణం

[మార్చు]

వెంకటాచల అయ్యర్ 1931 లో చనిపోయాడు.

మూలాలు

[మార్చు]
  • 1.Notes of a Study of the Priliminary Chapters of the Mahabharata Being an attempt to Seperate from Genuine to Matter Spurious,
  • 2. Probable etimologies of Some Sanskrit words of foreign origion",
  • 3. విక్రమ సిహపురి మండల సర్వస్వం, సంపాదకులు: యెన్.ఎస్.కె, నెల్లూరు జిల్లా పరిషద్ ప్రచురణ, 1964,
  • 4. తెలుగు కోరాలో వేదం వెంకటాచల అయ్యర్ మీద డాక్టర్ కాళిదాసు పురుషోత్తం వ్యాసం,
  • 5.వేదం వెంకటాచల అయ్యర్ వ్యాస సంపుటి "కతిపయ శబ్దార్థ విచారము" 1933.